సి.వి. ఆనంద బోస్

(సి. వి. ఆనంద బోస్ నుండి దారిమార్పు చెందింది)

సి.వి. ఆనంద బోస్, భారతదేశానికి చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అతను 2022 నవంబరు 23 పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పని చేస్తున్నాడు.[2][3] సీవీ ఆనంద బోస్‌  రచయిత. అతను ఇంగ్లీష్‌, హిందీ, మళయాళ భాషల్లో 32 పుస్తకాలు రచించాడు.

సి.వి. ఆనంద బోస్
సి.వి. ఆనంద బోస్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 నవంబర్ 2022[1]
ముందు లా. గణేశన్ (అదనపు బాధ్యత)

వ్యక్తిగత వివరాలు

జననం (1951-01-02) 1951 జనవరి 2 (వయసు 73)
మన్ననం , ట్రావెన్‌కోర్-కొచ్చిన్ , భారతదేశం
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానం 2
నివాసం రాజ్ భవన్, కోల్‌కతా
పూర్వ విద్యార్థి కేరళ విశ్వవిద్యాలయం (ఎం.ఏ)
బిట్స్ పిలాని (పీహెచ్‌డీ)
పురస్కారాలు జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆనంద బోస్ జనవరి 2, 1951న కేరళలోని కొట్టాయం జిల్లాలోని మన్ననం గ్రామంలో జన్మించాడు. ఆనంద బోస్ తండ్రి పి.కె వాసుదేవన్ నాయర్ స్వాతంత్ర్య సమరయోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరుడు. నాయర్ తన కొడుకు పేరుకు 'బోస్' అని చేర్చాడు. ఆయన కురియాకోస్ ఎలియాస్ కాలేజీ, మన్ననం చంగనాస్సేరిలోని సెయింట్ బెర్చ్‌మన్స్ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేసి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ నుండి పీహెచ్‌డీ అందుకున్నాడు. ఆయన ఆ తరువాత ఇంగ్లీష్ లెక్చరర్‌గా, బెంగాల్‌లో స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పని చేసి 26 ఏళ్లకే ఐఏఎస్‌లో చేరాడు.

వృత్తి జీవితం

మార్చు

ఆనంద బోస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) చేరి కాసర్‌గోడ్ సబ్-కలెక్టర్‌గా, కొల్లాం జిల్లా కలెక్టర్‌గా,  భారత ప్రభుత్వ కార్యదర్శిగా, కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా, 2011లో పదవీ విరమణ పొందే ముందు కోల్‌కతాలోని నేషనల్ మ్యూజియంలో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

బోస్ 2019లో బీజేపీలో చేరి కేరళ స్థానిక రాజకీయాలకు దూరంగా ఉంటూ జాతీయ నేతలతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సీవీ ఆనంద్‌ బోస్‌ ను పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమిస్తూ  రాష్ట్రపతి భవన్‌ 2022 నవంబరు 17న నోటిఫికేషన్‌ జారీ చేయగా[4] అతను గవర్నర్‌గా నవంబర్‌ 23న ప్రమాణస్వీకారం చేశాడు.[5]  

మూలాలు

మార్చు
  1. "C. V. Ananda Bose has been appointed as next West Bengal Governor". NDTV. 17 November 2022. Retrieved 18 November 2022.
  2. India Today (20 November 2022). "Meet C.V. Ananda Bose, visionary bureaucrat and now West Bengal governor" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  3. The Hindu (17 November 2022). "C. V. Ananda Bose appointed West Bengal Governor". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  4. NT News (18 November 2022). "బెంగాల్‌ గవర్నర్‌గా ఆనంద బోస్‌". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  5. ETGovernment (24 November 2022). "Retired IAS officer CV Ananda Bose takes oath as Governor of West Bengal - ET Government". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.