కొల్లాం జిల్లా

కేరళ లోని జిల్లా ప్రధాన కేంద్రం

కొల్లాం జిల్లా, భారతదేశం, కేరళ రాష్ట్రం లోని జిల్లా.[2] ఈ జిల్లాకు పొడవైన అరేబియన్ సముద్రతీరం ఉంది. ఇక్కడ కొల్లాం నౌకాశ్రయం, అష్టముడి సరోవరం ఉన్నాయి. కొల్లం కేరళ రాష్ట్ర జీడిపప్పు ఉత్పత్తి కేంద్రగా గుర్తించబడింది. కొల్లం జిల్లా మైదానాలు, పర్వతాలు, సరోవరాలు, మడుగులు, కేరళ బ్యాక్‌వాటర్, అరణ్యాలు, తోటలు, నదులు కలిగిన భూభాగం కలిగి ఉంది. ఈ ప్రాంతం ఫొనిసియా, పురాతన రోం నగరంతో సముద్ర సంబంధాలను కలిగి ఉంది.[3] జిల్లాలో 30% భూభాగాన్ని అష్టముడి సరోవరం ఆక్రమించుకుని ఉంది. కేరళ బ్యాక్‌వాటర్‌కు ఈ సరోవరం ద్వారంగా ఉంది. దేవలకర, తెక్కుంబగం పంచాయితీలలో బి.సి 1400 కాలపు పురాతన నౌకాశ్రం " కొకరేని (సముద్రతీర ద్వీపాల నౌకాశ్రయం ) పోర్ట్ ఆఫ్ తార్సిష్ " స్థాపినబడింది. కొల్లం ప్రాంతం " భగవంతుని నిజనివాసం " అని గుర్తింపు పొందింది.[4] కొల్లాం జిల్లాలో 5 తాలూకాలు, 69 గ్రామాలు, 29 పట్టణాలు ఉన్నాయి.కొల్లం జిల్లాలో హిందూయిజం, క్రైస్తవం, ముస్లిం మతాలు ప్రధానంగా ఉన్నాయి.

Kollam District
കൊല്ലം ജില്ല
Quilon District
District
From top: Paravur estuary, Light house and clock tower in Kollam city, 13 Ring bridge of Thenmala, Check dam across Kallada river
From top: Paravur estuary, Light house and clock tower in Kollam city, 13 Ring bridge of Thenmala, Check dam across Kallada river
Nickname: 
Cashew capital of the world
దస్త్రం:Kollamdistrict.png
CountryIndia
Stateకేరళ
ప్రధాన కార్యాలయంKollam
Government
 • CollectorPranab Jyothi Nath IAS
విస్తీర్ణం
 • Total2,491 కి.మీ2 (962 చ. మై)
 • Rank6th
జనాభా
 (2011)
 • Total26,35,375
 • జనసాంద్రత1,058/కి.మీ2 (2,740/చ. మై.)
భాషలు
 • అధికారMalayalam, English, Tamil
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-KL-02, KL-23, KL-24, KL-25, KL-61
Vehicle registrationKollam, Paravur: KL-02, Karunagappally: KL-23, Kottarakkara: KL-24, Punalur: KL-25, Kunnathur: KL-61
లింగ నిష్పత్తి1112 /
అక్షరాస్యత93.77%[1]
Website,

భౌగోళికం

మార్చు

కొల్లం జిల్లా కేరళ రాష్ట్రం దక్షిణ సముద్రతీరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన లక్షద్వీపాల సముద్రతీరానికి పశ్చిమంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఆలంప్పుళ జిల్లా, ఈశాన్య సరిహద్దులో పతనంతిట్ట జిల్లా, దక్షిణ సరిహద్దులో తిరువనంతపురం జిల్లా ఉన్నాయి.జిల్లా వైశాల్యం 2,492 చ.కి.మీ.విస్తీర్ణం ఉంది. వైశాల్యపరంగా, జనసాంధ్రత పరంగా ఈ జిల్లా రాష్ట్రంలో 7 వ స్థానంలో ఉంది. కొల్లం జిల్లా సముద్రతీరం పొడవు 37 కిలోమీటర్లు. కొల్లం జిల్లా రాష్ట్రంలో తక్కువ సముద్రతీరం ఉన్న జిల్లాగా గుర్తించబడింది. జిల్లాలో ఉన్న సముద్రతీరాలలో కోత్తకర (കൊട്ടാരക്കര), పునలూర్, కరునాగపళ్ళి, పరవూర్ ప్రధానమైనవి.

భౌగోళిక ప్రత్యేకతలు

మార్చు

కొల్లంలో ఉన్న శాస్తంకోట్ట సరోవరం కేరళ రాష్ట్రంలోని మచినీటి సరోవరాలలో పెద్దది. ఇది కొల్లం పట్టణానికి అవసరమైన మంచినీటిని సరఫరా చేస్తుంది. జిల్లాలో కల్లాడ నది, తిక్కర నది ప్రవహిస్తూ ఇక్కడే సముద్రంలో కలుస్తాయి. జిల్లాలో 30% శాతం భూభాగంలో విస్తరించి ఉన్న అష్టముడి సరోవరం, పరవూర్ సరోవరం ఉన్నాయి. దక్షిణకేరళ లోని ప్రథమ స్థానంలో ఉన్న సుందరమైన " నీందకర " చేపలరేవు ఈ జిల్లాలో ఉంది. ఎడవ, నదయార సరోవరాలలో కొంత భాగం ఈ జిల్లాలో ఉన్నాయి. కొల్లం సముద్ర రేవును మార్‌అర్బో స్థాపించాడు. ఈ రేవు నిర్మాణానికి వేనాడు రాజు ఉదయమార్తాండ వర్మ నిధిని సమకూర్చాడు.

వాతావరణం

మార్చు

కొల్లం ఉష్ణోగ్రత ఏడాది పొడవునా దాదాపు స్థిరంగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత 25 నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వేసవి సాధారణంగా మార్చి నుండి మే వరకు ఉంటుంది; రుతుపవనాలు జూన్‌లో ప్రారంభమై సెప్టెంబరులో ముగుస్తాయి. కొల్లం వార్షిక సగటు వర్షపాతం దాదాపు 2,700 మిల్లీమీటర్లు (110 అం.) వరకు ఉంటుంది. కొల్లం ప్రాంతపై నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంది. శీతాకాలం నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత 18 నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.దాదాపు చల్లదనం మధ్యస్తంగా ఉంటుంది.[3]

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కొల్లాం జిల్లా జనాభా 26,35,375. అందులో పురుషులు 12,46,968 కాగా, స్త్రీలు 13,88,407 మంది ఉన్నారు.జిల్లాలో మొత్తం 669375 గృహాలు ఉన్నాయి, మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 254260, ఇది మొత్తం జనాభాలో 9.65% ఉంది.దీనిని కేరళ రాష్ట్ర సగటు 1084తో పోలిస్తే కొల్లాం జిల్లా లింగ నిష్పత్తి 1113గా ఉంది. కొల్లాం జిల్లా అక్షరాస్యత శాతం 85.01% అందులో 86.16% మంది పురుష అక్షరాస్యులు కాగా, 83.98% స్త్రీల అక్షరాస్యులు ఉన్నారు. కొల్లాం మొత్తం వైశాల్యం 2483 చ.కి.మీ.కు జనసాంద్రత చ.కి.మీకి 1061 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో, 54.95% మంది జనాభా పట్టణ ప్రాంతంలో నివసిస్తుండగా, 45.05% మంది జనాభా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొల్లాం జిల్లాలో మొత్తం జనాభాలో 12.46% మంది షెడ్యూల్డ్ కులానికి (ఎస్.సి) చెందిన జనాభా ఉండగా, 0.41% మంది జనాభా షెడ్యూల్డ్ తెగలకు (ఎస్.టి) చెందినవారు ఉన్నారు.[5]

మహానగరరూపం

మార్చు

మహానగరం కొల్లం జనసాంధ్రతలో కేరళ రాష్ట్రంలో 6వ స్థానంలో దేశంలో 49 వ స్థానంలో ఉంది. జిల్లా జనసంఖ్య 11,87,158.[1] మహానగరం కొల్లంలో అడిచనల్లూర్, అడినాడు, అయనివేలికులాంగర, చవర, ఎలాంపల్లూర్, ఎరవిపురం (భాగం), కల్లెలిభగోం, కరునాగపల్లి, కొల్లం, కోత్తకర, కులశేఖరపట్టిణం, మయ్యనాడు, మీనాడు, నెడుంపన, నీందకర, ఓచిర, పనయం, పన్మన, పెరినాడు, పూతకుళం, తళుదల, తొడియూర్, త్రిక్కడవూర్, తిరుక్కరువా, త్రికోవిల్‌వట్టం, వడక్కుంతల పట్టణాలు విలీనమయ్యాయి.[6]

 
Lighthouse, Thangasseri, Kollam

1835లో ట్రావంకోర్ సంస్థానం 2 విభాగాలుగా కొల్లం, కొట్టాయం విభజించబడిన నాటి నుండి జిల్లా పాలన మొదలైంది. ట్రావంకోర్ - కొశ్చిన్ విలీనం తరువాత 3 విభాగాలలో కొల్లం ఒకటిగా మారింది. 1957లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తరువాత షెంకోట్టై తాలూకా మద్రాసుతో విలీనం చెయ్యబడింది. తరువాత అదే సంవత్సరం చెర్తల, అంబలపుళా, మావెలికర, కార్తికపళ్ళి, చెంగనూర్, తిరువల్ల తాలూకాలు (ఇవి అప్పటి వరకు కొల్లం జిల్లాలో ఉన్నాయి ) కొత్త జిల్లా ఆలంప్పుళ కలిసాయి. 1983లో పతనమిట్ట తాలూకా అదనంగా 9 గ్రామాలు కొల్లం నుండి వేరుచేయబడి కొత్తగా ఏర్పాటు చేయబడిన పతనంతిట్ట జిల్లాలో కలిసాయి.[7]

జిల్లా పాలన

మార్చు
 
Paravur estuary: Scenic beauty of backwaters and beaches

కొల్లం జిల్లా పరిపాలనా సౌలభ్యం కోసం పతనపురం, పునలూర్, కున్నత్తుర్, కోత్తకర, కరునాగపళ్ళి, కొల్లం అనే 6 ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లా పాలన జిల్లా ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా కలెక్టర్ నిర్వహణా బాధ్యతలు వహిస్తాడు. ఇతర బాధ్యతలతోపాటు శాంతి భద్రతలు బాధ్యత కలెక్టరుకు ఉంది. జిల్లా ఆదాయశాఖ కలెక్టర్ ఆధీనంలో ఉంటుంది. పాలనా సౌలభ్యం కొరకు జిల్లాలో క్విలాన్ కేంద్రగా రెవెన్యూ విభాగం ఏర్పాటు చేయబడింది. కొల్లం జిల్లాలో 5 తాలూకాలు, 13 బ్లాకులు, 69 పంచాయితీలు, ఒక నగరపాలక సంస్థ, 3 పురపాలికలు, 104 గ్రామాలూ ఉన్నాయి. ప్రభుత్వకార్యాలయాలన్నీ ఒకే ప్రదేశంలో ఉండేలా 1956లో కొల్లం సివిల్ స్టేషను ఏర్పాటు చెయ్యబడింది.

పోలీస్ శాఖ

మార్చు

కొల్లం పోలీస్ నిర్వహణ నగర, గ్రామీణ 2 విభాగాలుగా విభజించబడింది. నగర పోలీస్ వ్యవస్థ " సిటీ పోలీస్ కమీషనర్ " ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం కొల్లంలో ఉంది. గ్రామీణ పోలీస్ శాఖ రూరల్ సూపరిండెండెంట్ ఆధ్వర్యంలో పమిచేస్తుంది. గ్రామీణ పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం కొత్తకరలో ఉంది. రెండుశాఖలు తిరువనంతపురం (కేరళ) ఐ.జి.పికి రిపోర్టులు పంపిస్తారు.

కొల్లం నగర పోలీస్ కరునాగపళ్ళి, కొల్లం, చాతనూర్. అనే 3 శాఖలుగా విభజించారు.. ఒక్కో విభాగం ఒక్కో అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎ.సి.పి) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఒక్కో ఉపవిభాగం సర్కిల్స్‌గా విభజించబడుతుంది. సర్కిల్ ఇంస్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సర్కిల్ పనిచేస్తుంది. ఒక్కో సర్కిల్ పలు పోలీస్ స్టేషన్లుగా విభజించాు. పోలీస్ స్టేషను సబ్ ఇన్స్‌పెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కొల్లం రూరల్ పోలీస్ డిస్ట్రిక్ 2 ఉప విభాగాలుగా (కోత్తకర, పునలూరు) విభజించారు. ఒక్కో విభాగం ఒక్కో డెఫ్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ విభాగంలో 13 పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి. కొల్లం సిటీ ట్రాఫిక్‌ను సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ట్రాఫిక్ పోలీస్ స్టేషను " ఆశ్రమం గౌండులో ఉంది. నీందకరలో (కొల్లం) మొదటి పోలీస్ స్టేషను స్థాపించారు.[8] భారతదేశంలోని మొదటి పోలీస్ మ్యూజియం (సర్ధార్ వల్లభాయ్ పఠేల్ పోలీస్ మ్యూజియం) లో పలు పోలీస్ కళాఖండాలు, చాయాచిత్రాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో విధులు నిర్వహించే సమయంలో మరణించిన పోలీస్ అధికారుల చాయాచిత్రాలు ఉన్నాయి.[8] ఫోరెంసిక్ విభాగంలో అత్యంతమైన చాయాచిత్రాల సేకరణ ఉంది. ఈ మ్యూజియం ఈస్ట్ కొల్లం పోలీస్ స్టేషను వద్ద ఉంది.

తాలూకాలు

మార్చు

కొల్లం జిల్లా, కతునాగపళ్ళి, కున్నతూర్, కోత్తకర, పునలూర్, పతనపురం, కొల్లాం అనే 6 తాలూకాలుగా విభజించారు.ఆ ఆరు తాలూకాలలో 104 గ్రామాలు ఉన్నాయి. ఒక్కోక తాలూకాకు ఒక్కొక తహసిల్దార్ ప్రధాన అధికారిగా ఉంటాడు.

పురపాలికాలు

మార్చు

కొల్లం జిల్లాలో 3 పురపాలకసంఘాలు ఉన్నాయి.పునలూరు, పరవూరు, కరునాగపళ్ళి. చాలాకాలం నుండి కోఓత్తకర, అంచల్ పంచాయితీలను పురపాలికలుగా మార్చటానికి రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తుంది.

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు

మార్చు

కొల్లాం జిల్లాలో మూడు లోక్‌సభ (దిగువ సభ) నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో చవర, కుందర, ఎరవిపురం, కొల్లాం, చాతన్నూరు, చదయమంగళం, పునలూర్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. మావేలికర లోక్‌సభ నియోజకవర్గంలో కున్నత్తూరు, కొట్టారక్కర, పతనాపురం శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, కరునాగపల్లి శాసనసభ నియోజకవర్గం అలప్పుజ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంది.

రాజకీయాలు

మార్చు

కొల్లం జిల్లా కేరళ శాసనసభ నియోజకవర్గాలకు 11 ప్రతినిధులను ఎన్నుకుంటుంది. రాజకీయంగా కొల్లం జిల్లాకు సుసంపన్నమైన చరిత్ర ఉంది. కొల్లంలో అత్యధిక ఓట్లు సంపాదించిన పార్టీ సాధారణంగా కేరళ ప్రభుత్వాన్ని రూపొందించి అధికారాన్ని చేపడుతుంది. కొల్లంలో సంప్రదాయంగా సి.పి.ఐ (ఎం) నాయకత్వంలో ఉన్న డెమొక్రటిక్ ఫ్రంట్ బలంగా ఉంది. కొల్లం జిల్లాలో స్వాతంత్ర్యసమరంలో పాల్గొన్న వారిలో ముఖ్యులు టి.ఎం.వర్గీస్, సి.కేశవన్, కుంబలదు శంకు పిళ్ళై మొదలైనవారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులైన చంద్రన్ కాళి అంబి, ఫ్రాంకో రాగవన్ పిళ్ళై కొల్లంలో జన్మించినవారే.

సంస్కృతి

మార్చు
 
Paravur K.C Kesava Pillai - Mahakavi

ఒకప్పటి వేనాడు రాజధానిగా ఉన్న కొల్లం గొప్ప అధ్యయన, సాంస్కృతిక కేంద్రగా విలసిల్లింది. ఇది దక్షిణ భారతదేశం నుండి పలు పండితులను ఆకర్షింవింది. 14వ శతాబ్దంలో చారిత్రక ముఖ్యత్వం కలిగిన 2 రచనలు ( లీలెతిలకం, ఉన్నునీలి సందేశం ) వెలువడ్డాయి. కోత్తకర తంబురాన్ రూపకల్పనలో రామనాట్టం అనే వినూత్న కథాకళి ప్రక్రియ రూపొందించబడింది. అతను మళాయాళీ వాక్యాలతో కృష్ణనాట్టం కూడా రూపొందించాడు.

 
Music Director Paravur G.Devarajan

పరవూరులో జన్మించిన కె.సి కేశవ పిళ్ళై గొప్ప కవిగా, రచయితగా, నాటకరచయితగా, పండితుడుగా గుర్తింపు పొందాడు. అతని రూపకల్పనలో మలయాళంలో సదర్మ అనే సంగీతరూపకం తయారైంది.అతను కేశవీయం, మహాకాయం సాహిత్యంలో ఖ్యాతిగాంచాయి. మలయాళీ సంగీత చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించాడు.అతను కొన్ని పాటలకు సంగీతం కూడా సమకూర్చాడు. సుజననందిని సంపాదకుడు, స్థాపకుడు పరవూరు కేశవన్ అసన్ జిల్లా లోని ప్రఖ్యాత సాహిత్యకర్తలలో ఒకరుగా గుర్తింపు పొందాడు.

అతనికి పత్రికా విలేఖరి, రచయితగా కూడా పేరుంది. అతను వ్రాసిన శరత్చంద్రిక ఆయుర్వేద వైద్యానికి ఉపకరిస్తుంది. ఇ.వి కృష్ణ పిళ్ళై హాస్యరచయితగా ఖ్యాతి గడించాడు. కుముదిని, మలయాళరాజ్యం సంపాదకుడు సి.వి కుంజురామన్ కవి, విమర్శకుడు, రచయిత, పత్రికావిలేఖరిగా ఖ్యాతి చెందాడు.

అధునిక కాలంలో ఎలమకులం కుంజన్ పిళ్ళై, సూరనాడు కుంజన్ ఈ జిల్లాకి పిళ్ళై సాహిత్యకారులుగా ప్రసిద్ధికెక్కారు. అలాగే కథాకళి కళాకారులుగా ఓయూరు కొచు గోవింద పిళ్ళై ., చవరపరుకుట్టి పసిద్ధిచెందారు. పారిస్ విశ్వనాథన్, జయపాల పణికర్ కళాకారులుగా ఖ్యాతిసంపాదించారు. ప్రబల కవులుగా ఒ.ఎన్.వి కురుప్, తిరునల్లూర్ కరుణాకరన్, పునలూరు బాలన్ కీర్తి సంపాదించారు. నవలా రచయితలుగా కె.సురేంద్రన్, ఎ.పి. కలక్కడ్, జర్నలిస్టులుగా కె.బాలకృష్ణన్, నటులుగా కోత్తకర శ్రీధరన్ నాయర్, ఒ.మాధవన్, కథాప్రసంగం కళాకారులుగా వి.సాంబశివన్ కొల్లం పట్టణానికి చెందినవారుగా గుర్తింపు పొందారు.

హిందూ ఆరాధన

మార్చు
 
Mukathala Murari (Sri Krishna) Temple
  • కొల్లాం నగరం నుండి 10కి.మీ దూరంలో ముఖతల మురారి శ్రీ కృష్ణస్వామి ఆలయం ఉంది.[9]
  • కున్నత్తూర్ తాలూకాలోని పొరువళి గ్రామంలో ఎడకాడు వార్డ్ (కర) పెరువిరుది మలనాడ అలయం ఉంది. ఇది కొల్లం, పతనంతిట్ట లోని కడంప్‌నాడుకు, అలంప్పుజ్హ జిల్లాలకు ఉత్తరంలో ఉంది.
  • ఒచిరా జిల్లా ఉత్తర ప్రాంతంలో జాతీయరహదారి 47 పక్కన ఉంది. ఇక్కడ ఒచిర పరబ్రహ్మ ఆలయం ఉంది.[10] వృశ్చికమాసంలో పండనిలం (వరి పొలాలు) వద్ద వార్షికంగా " ఒచిరాకాళి " ఉత్సవం నిర్వహించబడుతుంది. ఒచిరా టౌన్ మసీద్, ఒచిరా ఆలయం మత ఐక్యతకు చిహ్నంగా ఒకదానికి ఒకటి దగ్గరగా నిర్మించబడి ఉంది. ఈ ఆలయం శబరిమల ఏడతవలంగా కూడా ఉంది.
 
Kottarakkara Sree Mahaganapathi Kshethram
  • కోత్తకర వద్ద ఉన్న మహాగణపతి ఆలయం ఉంది.[11] ఈ ఆలయం ఉన్నియప్పం కేరళ ప్రజల ఆదరణ చూరగొంది. కోత్తకర ఆలయం పూజలలో ఉదయకాల పూజ ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ ఆలయ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఇప్పిడిది గణేశాలయంగా గుర్తింబడుతుంది.[11]
  • ఎడక్కిడం తెట్టికునిల్ వద్ద శ్రీ మహాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అడమూడుదల్, కడుంపాయసం ప్రధాన్యత సంతరించుకుంది.
  • అష్టముడి సరోవరం సమీపంలో ఉన్న " ఆశ్రమం శ్రీకృష్ణస్వామి ఆలయం " [12] కొల్లంలో గుర్తించబడిన ఆలయాలలో ఒకటిగా భావించబడుతుంది. ఆలయ ప్రధానదైవం రెండుచేతులలో వెన్నముద్దలు పట్టుకున్న బాలకృష్ణుడు. ఈ ఆలయంలో నిర్వహించబడే అరట్టు మహోత్సవానికి కొల్లం పూరం అనే వేరొక పేరు కూడా ఉంది.[13] ప్రతిసంవత్సరం ఆశ్రమ మైదానంలో కొల్లం పూరం నిర్వహించబడుతుంది.[14][15]
 
Kettu kala (an offering to God) from Kollam district
  • అమ్మాచివీడు ముహుర్తి [16] పట్టణ ప్రాంతంలో ఉంది. దీనిని ఒక సంపన్న కుటుంబం స్థాపించింది. ప్రతిసంవత్సరం ధను మాసంలో మండలపూజ నిర్వహించిన తరువాత ఉత్సవం నిర్వహించబడుతుంది.
 
Pattazhy Devi Temple
 
Vadakkevila Koonambaikulam Temple
  • కొల్లంలో ఉన్న మరొక ప్రధాన ఆలయం జిల్లా కారాగారం సమీపంలో ఉన్న ఆనందవళ్ళీశ్వరం. ఇక్కడ మహాదేవుడు (పశ్చిమ ముఖంగా), దేవి (తూర్పు ముఖంగా) ప్రధానదైవాలుగా ఉన్నారు. వీరితో గణాశుడు, అయ్యప్ప, శ్రీ కృష్ణ, మురుగన్ కూడా ఆరాధనలను అందుకుంటున్నారు. అంతే కాక ఇక్కడ హనుమంతుడు కూడా ఆరాధించబడుతున్నాడు.
  • ఎడవనాడు భగవతి ఆలయం కొల్లంలో ఉన్న దుర్గ ఆలయాలలో ఒకటి. ఇది కొల్లంలోని పట్టణ ప్రాంతంలో ఉంది.
  • వరట్టుచిరా దేవి ఆలయం కేరళపురం: ధారిక వధానంతరం శాంతించిన భగవతి ఆలయం ఇది.
  • అగస్తియాకోడె మహాదేవ ఆలయం:- ఇది కొల్లంలో ఉన్న మహాదేవాలయాలలో ఇది ఒకటి. ఇది అంచల్ పంచాయితీలో ఉంది. ప్రతి శివరాత్రికి ఇక్కడ జరిగే ఉత్సవానికి కులాతీతంగా, మతాతీతంగా అనేకమంది ప్రజలు హాజరౌతూ ఉంటారు.
  • త్రిక్కడవూర్ మహాదేవ ఆలయం:- ఇది జిల్లాలో గుర్తించతగిన శివాలయాలలో ఒకటి. త్రిక్కడవూర్ పంచాయితీలో అష్టముడి సరీవరతీరంలో ఉంది. ప్రతిసంవత్సరం ఈ ఆలయంలో జరిగే స్రత్తు ఉత్సవానికి ప్రపచం నలుమూలల నుండి వేదాది భక్తులు వస్తుంటారు. ఈ ఉత్సవం " కుంభం " మాసంలో నిర్వహించబడుతుంది.ఈ ఉత్సవంలో ఆలయం 8 దిక్కులలో 8 గుర్రాలను నిలిపి ఉంచడం ఈ ఉత్సవం ప్రత్యేకత.
  • కొలువిలా భరణికవు దేవి ఆలయం:- ఇది జాతీయరహదారి పక్కన మదన్నద వద్ద ఉంది. ప్రతిసంవత్సరం ఇక్కడ 41 రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవం మీన మాసం భరణి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు.
  • వీరభద్ర స్వామి ఆలయం:- అష్టముడి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో ప్రధాన దైవం వీరభద్రుడు. ఈ ఆలయం 250 సంవత్సరాల పురాతన కుటుంబానికి చెందిన " కుట్టియాళకంస్ " వారికి స్వతం.
  • ఉమయనల్లూర్ శ్రీ బాలసిబ్రాహ్మణ్య మురుగన్ స్వామి ఆలయం [17] :- ఇది జాతీయరహదారి 47 పక్కన కొల్లం పట్టణానికి 8 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయంలో నిర్వహించే " ఆనవాల్ పిదుట్టం " ఉత్సవానికి వేలాది భక్తులు వస్తుంటారు.[17] ఈ మహోత్సవం మీనమాసంలో నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రం అంతటి నుండి వేలాది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో " తిరుపయ్యం " ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని 500 సంవత్సరాల పూర్వం వేనాడు రాణి " ఉమయమ్నరాణి " నిర్మించిదని భావిస్తున్నారు.
  • ఆర్యకవు:- ఇది పశ్చిమ కనుమలలో జిల్లాకు తూర్పు సరిహద్దులో జాతీయరదారి పక్కన ఉంది. ఇది 5 పురాతన అయ్యప్ప ఆలయాలలో ఒకటని భావిస్తున్నారు. పురాతన అయ్యప్ప ఆలయాలు అచంకోవిల్, కులతుపుళాలో ఉన్నాయి.
  • శ్రీ మహాదేవర్ ఆలయం పదింజత్తింకర,:- శ్రీ భూతనాథ ఆలయం. కులక్షేత్రనల్లురు శ్రీ కృష్ణస్వామి, కోత్తకర వద్ద దేవి ఆలయం, చెన్నమాత్ ఆలయం, విలప్పురం, చదనూర్ వద్ద ఉన్న విలాపురం భగవతి ఆలయం మొదలైనవి ప్రఖ్యాతి చెందినవి. అలాగే పొలచిరా ( విలాపురం ఆలయసమీపంలో), చిరకర వద్ద ఉన్న అనంతవలం ( ఏనుగుల ఆశ్రయం) చూడదగిన ప్రదేశాలు.
  • తలవూర్ శ్రీ దుర్గా దేవి ఆలయం:- తళవా పులిఖం దేవి ఆలయం, పెరూర్, కరునల్లుర్ భగవతి ఆలయం, పత్తళి దేవి ఆలయం, పల్లిమన్ మహాదేవ ఆలయం, వడయత్తుకోట శ్రీ కృష్ణస్వామి ఆలయం, కుందర ఇలంపల్లూర్ దేవి ఆలయం, పరవూరు, పుత్తింగల్ దేవి జిల్లాలోని ఇతర హిందూ ఆలయాలలో గుర్తించతగినవి.
  • మరొక ప్రధాన ఆలయం చవర సమీపంలో ఉన్న కోత్తంకులంగర ఆలయం ఒకటి.[18] ఇక్కడ విలక్కేడుపు ఉత్సవంలో స్త్రీల దుస్తులు ధరించి పురుషులు పాల్గొంటారు.
  • కూనంబైకుళం (మలయాళం: ఈ ఆలయం కూడా ప్రబలమైంది. ఈ ఆలయ ప్రధాన దైవం " కూనంబై కులదు అమ్మ " . పుంతలతళం వద్ద ఉన్న పీరూర్ శ్రీ మీనాక్షి ఆలయం, కొల్లం ఆలయాలలో [19] ప్రధానమైనదని భావించవచ్చు. *ఎడక్కిడం సమీపంలో ఉన్న కడైకొడు గ్రామంలో ఉన్న " కడైకొడు మహాదేవ ఆలయం " గ్రామంలో ప్రధాన ఆకర్షణగా ఉంది.

ఆశ్రమం

మార్చు

ఆధ్యాత్మిక గురువు " మాతా అమృతమయి " ఆశ్రమం కొల్లం జిల్లాలోని కరునాగపళ్ళి తాలూకాలోణీ అమృతపురి వద్ద లక్షద్వీపాల సముద్రంతీరంలో నిర్మించబడింది.[20] మాతా అమృతానందమయి జన్మస్థలం కరునాగపళ్ళి సమీపంలోని సముద్రతీర గ్రామం పరయకడవు. ఆమె అక్కడ ఆశ్రమనిర్మాణం జరిగింది. లక్షద్వీపాల సముద్రంతీరంలోని మరొక ప్రఖ్యాత ఆలయం " తిరుముల్లవరం ఆలయం ". ఈ ఆలయానికి వవుబలి ఉత్సవానికి వేలాది భక్తులు వస్తుంటారు.

చర్చీలు

మార్చు
 
New cathedral in Thangassery, Kollam

1309 ఆగస్టు 9 నిర్మించబడిన రోమన్ కాథలిక్ డియోసిస్ ఆఫ్ క్విలాన్ చర్చి మొదటి డియోసిస్ చర్చిగా గుర్తించబడుతుంది. దీనిని 1886 సెప్టెంబరు 1 న పునర్నిర్మించారు. దక్షిణ భారతదేశ పశ్చిమ తీరంలో సెయింట్ థామస్ చేత నిర్మించబడిన 7 చర్చిలలో ఇది మొదటిది.

 
400-year-Infant Jesus Cathedral at Quilon-Tangasseri. In 2006 it was demolished and replaced by a new building.
  • 12 వ శతాబ్దం చివరిదశలో మిషనరీ కాత్యకలాపాలకు క్విలాం కేంద్రగా మారింది. ఫ్రాంసికన్, డోమికన్ మిషనరీలు 13-14 శతాబ్ధాలలో ఇక్కడి విడిది చేసినట్లు ఉత్తరాక ఆధారంగా తెలుస్తుంది.
  • 1339లో పోప్ జాన్ XXII అవిజ్ఞాన్ వద్ద నిర్బంధించగానే క్విలాన్ డియోసెస్ మొత్తం ఇండీస్ ఆర్చియోడిసీస్ గణతంత్రానికి 1329 ఆగస్టు 9న క్విలాన్ కేంద్రగా మారింది. 1329 ఆగస్టు 21న ఫ్రెంచ్ డీమినికన్ జోర్డానీ క్విలాన్ మొదటి బిషప్‌గా నియమించబడ్డాడు.
  • పురాతన క్విలాన్ డియోసిస్ న్యాయపరిధిలో ఇండియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక దేశాలు ఉన్నాయి. జోర్డాన్ కేటలానీ 1323లో సూరత్కు వచ్చాడు. ఆయన క్రైస్తవానికి పుంర్జీవనం ఇవ్వడమేగాక వేలాది మందిని క్రైస్తవమతంలోకి తీసుకువచ్చాడు. ఆయన క్విలాన్‌లో సెయింట్ జార్జ్ చర్చిని నిర్మించాడు. ఆయన వ్రాసిన " మిరబిలియ

డిస్క్రిప్టా " పుస్తకంలో భారతీయ, ఆసియా దేశాలలోని వృక్షాలు, జంతువులు, ప్రజల గురించిన పలు విషయాలు చోటుచేసుకున్నాయి. 800 వందల సంవత్సరాల పూర్వం వ్రాయబడిన పుస్తకాలలో ఇది చాలా అరుదైనదని భావిస్తున్నారు. 1324లో వ్రాసిన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలలో ఇది ఒకటని భావించబడుతుంది.క్విలాన్ మొదటి బిషప్ క్విలాన్ క్రైస్తవుల శ్రేయస్సుకు అధికంగా పాటుపడ్డాడు. భారతదేశ మొదటి బిషప్‌గా ఆయన క్రైస్తవులకు ప్రాంతీయ పాలకులతో సత్సంబంధాలను ఏర్పరిచాడు. ఆయనకు అదనంగా కాలికట్, మంగుళూరు, ఠానే, క్రైస్తవ సమూహం సంక్షేమ బాధ్యత అప్పగించబడింది. అతను 1336లో ముస్లిములచేత హత్యచేయబడ్డాడు.

  • 1348లో జాన్ డీ మారిగ్నోలి, పేపాల్ లిగాటే చైనా నుండి రోంకు వెళుతూ ఇక్కడ 14 మాసాలకాలం నివసించాడు. బిషప్ హత్యతో క్విలాన్ బిషప్ స్థానం ఖాళీగా ఉంది. 1948లో పోర్చుగీసు వారు భరతదేశంలో ప్రవేశించే వరకు బిషప్ స్థానం ఖాళీగా ఉంటూ వచ్చింది. తరువాత 14వ శతాబ్దంలో ఫ్రెంచ్ డోమింకన్ల ద్వారా కేరళ రాష్ట్రానికి లాటిన్ కాథలిజం ప్రవేశించింది. బిషప్ జోర్డానస్ పరిచయం చేసిన లాటిన్ క్రిస్టియానిటీకి పూర్చుగీసు వారు ప్రజాదరణను పెంచారు.
  • భస్రతదేశంలో కాథలిక్ మూలస్థానంగా క్విలాన్ చరిత్రలో నిలిచింది. జాన్ డీ మారిగ్నోలి 1338లో బిషప్‌గా నియమించబడ్డాడు. (1334-1342) పోప్ బెనెడిక్ట్‌తో జాన్ డీ మారిగ్నోలి

ప్రతినిధిగా చైనాకు పంపబడ్డాడు. ఆయన చైనాలో బోధన చేసి తిరిగివెళ్ళే సమయంలో క్విలాన్‌లో విడిది చేసాడు. ఆయన ఇక్కడ ఒక సంవత్సరం నివసించాడు. ఆయన సమయంలో జోర్డాన్ స్థాపించిన చర్చిలో బోధనలు కొనసాగించాడు.

  • 1338 పోప్ బెనెడిక్ట్ సమయంలో పీకింగ్ రాజు ఖాన్ పోప్ అంబాసిడర్ల వద్దకు తన ప్రతినిధిని అవిజ్ఞాన్‌కు పంపాడు. వారికి పోప్ రాజమర్యాదలు చేసాడు. వారు చైనాకు ఒక తెలివైన, శక్తివంతమైన, విశ్వాసపాత్రుడైన దూతను పంపి తమను ఉద్ధరించమని కోరాడు. జాన్ డీ మారిగ్నోలి వారితో చైనాకు వెళ్ళి అక్కడ పని ముగించుకుని తిరిగి వెళ్ళే సమయంలో క్విలాన్‌లో నివసించి బోధన సాగించాడు. ఆయనతో పలువురు సన్యాసులు, ఖాన్‌నుండి అందుకున్న విలువైన కానుకలను తీసుకువచ్చాడు.
 
Quilon bishop's chapel, memorial stone to commemorate the founding of the Syro-Malankara rite, 1930

3 సంవత్సరాల కాలం మతప్రచారం చేసిన తరువాత మారిగ్నొల్లి ఐరోపా తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. 1345 డిసెంబరు 26 ఆయన చైనాను వదిలిన తరువాత అయాన మార్చి మాసం 23న క్విలాన్ చేరాడు. క్విలాన్ ప్రజలు ఆయనకు ఆదరంగా స్వాగతం పలికారు. ఆయన ఇక్కడ 1 సంవత్సరం కంటే అధికంగా ఉన్నాడు.క్విలాన్‌లో ఉన్న సమయంలో ఆయన జోర్డానస్ స్థాపించిన చర్చిలో మతబోధ చేసాడు. బిషప్ స్థాపించిన సెయింట్ జార్జ్ లాటిన్ చర్చ మీద ఆయన తన దృష్టిని అధికంగా కేంద్రీకరించాడు. అయన చర్చిలో ఉపన్యసించడం, అనదమైనపెయింటింగులతో దానిని అలకరించడం చేసాడు. ఆయన విరేచనాలతో బాధపడిన తరువాత మతపరమైన కార్యక్రమాలను కొనసాగించలేదు. ఆయన కోలుకున్న తరువత కేప్ కొమరిన్ వెళ్ళాడు. అక్కడ ఆయన కొండమీద ఒక శిలువను స్థాపించాడు. అక్కడి నుండి సిలోన్ మొత్తం కనిపిస్తుంది. ఆయన చాలా ఆశావాది. క్విలాన్ ప్రజలు ఆయనను ఎప్పటికీ మరువలేరు అని ఆయన స్థాపించిన పాలరాతి స్తంభం తెలియజేస్తుంది. ఆయన 1347 జూలై వరకు సిలోనులో చేరి 1348 సెప్టెంబరులో తిరిగి ఇండియాకు వచ్చి 1350లో ఇండియా వదిలి వెళ్ళాడు.

జెరోం

మార్చు

జెరోం క్విలన్ మొదటి బిషప్‌గా నియమించబడ్డాడు. ఆయన లాటిన్ కాథలిక్కుల అభివృద్ధి కొరకు కాలేజీని స్థాపించాడు. 1951లో బిషప్ జెరోం " ఫాతిమా మాతా నేషనల్ కాలేజిని స్థాపించాడు. పుల్లిచిరాలోని " ఇమ్మాక్యులేట్ కాంసెప్షన్ " వేలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. కొల్లంలో ఇది ప్రముఖ కైస్తవ యాత్రాస్థలంగా గుర్తిచబడుతుంది.

ముస్లిం ఆరాధన

మార్చు

కొల్లం జిల్లాలో గుర్తించతగిన మసీదులు:- షేక్-మసీద్-కరునాగపళ్ళి, ఒచిరా-జుమ-యత్-మసీద్,కుట్టుకాడు-జుమ-మసీద్-చెవర, వలియపళ్ళి (జనకపురం), జుమ-మసీద్ కొలూర్‌విలా, జుమ్మా-యత్-మసీద్ (తట్టమల), ఎన్ - ముస్లిం జుమ్మ - యత్- పళ్ళి (కలమపళ్ళి, కలువ), ముతిరపరంబు పళ్ళి (కలమల), ముతిరాపరంబు, సియవదుమ్మోడు పళ్ళి (కిళికొల్లూరు) మొదలైనవి. " కొల్లూర్విలా జమాయిత్-యత్ " కేరళలో పెద్ద మహల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. కొల్లం నగరానికి 4 కి.మీ దూరంలో ఉన్న కొల్లూర్‌విలా చారిత్రక ప్రాధాన్యక కలిగి ఉంది. కొలూర్విలాలో పేద, ధనిక, జాతిమత బేధాలు లేకుండా జీవిస్తుంటారు. ముస్లిములు అధికసంఖ్యలో ఉన్న కేరళ జిల్లాలలో కొల్లం రెండవస్థానంలో ఉంది. కోలూర్విలా కేంద్రం అయిన పళ్ళిముక్కులో కోలూర్విలా జుమ్మా మసీదు ఉంది. యేమన్ దేశంలోని హలర్ నగరంలో జన్మించిన సయ్యద్ కొచుకోయా తంగల్ కొల్లూర్విలా ప్రజలను ఆధ్యాత్మికంగా, సాంఘికంగా ఉద్ధరించడానికి కృషిచేస్తూ తన జివితంలో అత్యధిక కాలం కొల్లూర్విలాలో గడిపాడు.

కొలూర్విలా జుమ్మా మసీదు

మార్చు

కొలూర్విలా మసీదు చక్కని నిర్మాణశైలిలో సుందరంగా నిర్మించబడింది. ఈ మసీదులో ఏకకాలంలో 5,000 కంటే అధికంగా ప్రార్ధనలు జరపడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఈ మసీదు పెద్దదని భావిస్తున్నారు. కొల్లుర్విలాలో 7,000 ముస్లిం కుట్జుంబాలు ఉన్నాయి.

  • మాదనుల్ ఉలూం అరబిక్ కాలేజ్ : మాదనుల్ ఉలూం అరబిక్ కాలేజ్ కేరళలోని ప్రబలకాలేజీలలో ఒకటి. కేరళలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ అరబిక్ నేర్చుకోవడానికి వస్తుంటారు.
  • ' బుస్తానుల్ తాలిబాన్ మదర్షా: బుస్తానుల్ తాలిబాన్ మదర్షాలో 1,500 విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఈ మదర్షా 1988లో నిర్మించబడిన అందమైన రెండస్థుల భవనంలో నడుపబడుతుంది.
  • ది కొల్లూర్విలా జమాహ్ స్థాపించిన స్కూలు విద్యార్ధులకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తుంది. ఈ స్కూలు మసీదుకు సమీపంలో జాతీయరహదారి నుండి చేరుకోగల దూరంలో ఉంది.

ఆరోగ్యం

మార్చు
 
Entrance of Paravur Taluk Hospital

కొల్లం ఆరోగ్యసంరక్షణా రంగం గత దశాబ్ధంలో అనేక మార్పులకు లోనైంది. ఒకప్పుడు జిల్లాలో వైద్యకళాశాలలు ఉండేవికాదు. ప్రస్తుతం జిల్లాలో 3 వైద్యకళాశాలలు ఉన్నాయి. వీటిలో 2 (కేరళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, వలియత్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్, కరునాగపళ్ళి) అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. కేరళ లోని ఒకే ఒక ఎప్లాయీస్ స్టేట్ ఇంసూరెంస్ మెడికల్ కాలేజ్ కొల్లం జిల్లాలో ఉంది.[21] ఇవి కాక జిల్లాలో అదనంగా 2 వైద్యకళాశాలలు (మీయానూర్‌లో ఉన్న అజియా మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ట్రావంకోర్ మెడికల్ కాలేజ్) ఉన్నాయి. ప్రబల " సమద్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ హాస్పిటల్ " శాఖ కొల్లంలో ఉంది. పద్మావతి మెడికల్ ఫౌండేషన్, హాస్పిటల్ " (హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్) శాస్తంకోటలో ఉంది. బిషప్ బెంజిగర్ హాస్పిటల్, హోలీ క్రాస్ హాస్పిటల్ (కొల్లం), సి.ఎస్.ఐ హాస్పిటల్, క్రీస్తురాజా హాస్పిటల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాక జిల్లాలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ముఖ్యమైన తాలూకా ఆసుపత్రులు కొల్లం, కోత్తకర, పరవూర్ పునలూర్, కరునాగపళ్ళి, శాస్తంకోట తాలూకాలలో ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు

మార్చు
 
View of Kollam Kerala State Road Transport Corporation bus station from Ashtamudi Lake

రహదారి

మార్చు
 
Kollam KSRTC Bus Station

కొల్లం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో బసు, రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది.[22][23] అలాగే పొరుగు రాష్ట్రాలతోనూ కేరళ స్టేట్ రోడ్ ట్రాంస్ పోర్ట్ కార్పొరేషన్, భారతీయ రైల్వే ద్వారా అనుసంధానితమై ఉంది.[22][23] కేరళ స్టేట్ రోడ్ ట్రాంస్ పోర్ట్ కార్పొరేషన్ డిపోలు, సబ్ డిపో, ఆపరేటింగ్ సెంటర్లను నిర్వహిస్తుంది.

  • కొల్లం
  • చంతనూర్
  • కరునాగపళ్ళి
  • ఒచిరా
  • పునలూర్
  • కోత్తకర
  • చండయమంగళం
  • పతనపురం
  • శాస్తంకోట
  • ఆర్యకవు (ఒ.ఎస్)
  • కులతుపుళా (ఒ.ఎస్)

కొల్లం జిల్లా కేరళ లోని ఇతర ప్రాంతాలు, భారతీయ ప్రధాన పట్టణాలతో కొల్లం జాతీయరహదారి 66 (ముందు ఇది జాతీయ రహదారి 47 ),జాతీయరహదారి 183 (ముందు ఇది జాతీయ రహదారి 220 ), జాతీయరహదారి 774 (ముందు ఇది జాతీయ రహదారి 208 ), రాష్ట్రీయ రహదారి, మైన్ సెంట్రల్ రహదారి, పునలూరు-పతనంతిట్ట- మూవత్తుపుళా - మెయిన్ ఈస్ట్రన్ హైవే ద్వారా అనుసంధానితమై ఉంది. కేరళ స్టేట్ రోడ్ ట్రాంస్ పోర్ట్ కార్పొరేషన్, తమిళనాడు ట్రాంస్ పోర్ట్, కర్నాటకా ట్రాంస్ పోర్ట్ రాష్ట్రంలో బసుసర్వీసులను అందిస్తుంది.

రైలు మార్గం

మార్చు
 
Entrance of Kollam Junction railway station
 
Paravur Railway Station

కొల్లం జిల్లాలో " కొల్లం జంక్షన్ రైల్వే స్టేషను " ఉంది. జిల్లాలో మొత్తం 128 షార్ట్, లాంగ్ సర్వీసులు ఉన్నాయి. కొల్లం జంక్షన్ రైల్వే స్టేషను 10 ఎం.ఇ.ఎం.యులు నిర్వహించబడుతున్నాయి. అదనంగా కొల్లంలో పరవూరు, కరునాగపళ్ళి, పునలూరు, శాస్తంకోట, కోత్తకర, కుందర, మాయ్యనాడులలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. [24]

కొల్లం జిల్లా లోని రైల్వే స్టేషన్లు
ఒచిరా కరునాగపళ్ళి సస్తంకోట
మునోర్ ద్వీపం పెరినాడు కొల్లం జంక్షన్
ఎరవిపురం మయ్యనాడు పరవూరు రైల్వే స్టేషను
కిల్లికొల్లూరు చందనతోపు కుందర
తూర్పు కుందర ఎళుకొనే కొత్తరకర
కురి అవనీశ్వరన్ పునలూరు
ఎడమన్ ఒట్టక్కల్ తెన్మల
కళుతురిట్టి ఎడప్పాలయం ఆర్యంకవు [24]

కొల్లాం నుండి భారతదేశం లోని ప్రధాన నగరాలకు రైళ్ళ ద్వారా న్యూ ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై, ఇండోర్, భోపాల్, హైదరాబాద్ (భారతదేశం), తిరువనంతపురం, ముంబై, మదురై, వైజాగ్, జమ్ము, హౌరా, గౌహతి, మడ్గావన్, ఇటార్సీ, హుబ్లి, అహ్మదాబాద్, కన్యాకుమారి, గ్వాలియర్, నాగ్పూర్, పూనా, కోటా, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, కొచ్చిన్, కోళికోడ్, అమృత్‌సర్, విజయవాడ, కోయంబత్తూర్, చండీగఢ్, మంగుళూరు వరకు అనుసంధానిస్తుంది. కొల్లం, తిరువనంతపురం, కొల్లం - ఎర్నాకుళం, కొల్లం - పునలూర్ మార్గాలలో పాసెంజర్ రైళ్ళు నడుస్తున్నాయి. [22]

వాయుమార్గం

మార్చు

కొల్లం పట్టణంలో ఉన్న " ఆశ్రమం ఎయిర్పోర్ట్ " కేరళ రాష్ట్రంలో నిర్మించబడిన మొదటి విమానాశ్రయంగా గుర్తించబడుతుంది. కేరళ రాష్ట్రంలో మొదటి విమానం ఆశ్రమం ఎయిర్పోర్ట్‌లో దిగింది.[25] మొదటి ఆంఫిబియన్ ఎయిర్ క్రాఫ్ట్ (సముద్ర విమానం) కూడా కొల్లం విమానాశ్రయంలో దిగింది. అయినప్పటికీ ప్రస్తుతం కొల్లం జిల్లాలో విమానాశ్రయం లేదు. సమీపంలో ఉన్న విమానాశ్రయం 65కి.మీ దూరంలో ఉన్న తిరువనంతపురంలో ఉంది. [26] ఇక్కడి నుండి రోజువారీగా ముంబై, చెన్నై,ఢిల్లీ, బెంగుళూరు, కొచ్చిన్ లకు విమానసేవలు లభిస్తాయి. అలాగే అంతర్జాతీయంగా షార్జా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, మస్కట్ (ఓమన్), మలేషియా, దోహా, సింగపూర్, కొలంబో దేశాలకు, నగరాలకు విమానసేవలు ఉన్నాయి.

జలమార్గం

మార్చు
 
Kollam-Dalavapuram boat service

కొల్లం జిల్లా చక్కని జలమార్గాలతో సుసంపన్నమై ఉంది. " స్టేట్ వాటర్ ట్రాంస్పోర్ట్ డిపార్ట్మెంట్ " వెస్ట్ కల్లడ, ముంరో ఐలాండ్, అలప్పుళా లకు బోటు సర్వీసులను నిర్వహిస్తుంది. డబుల్ కొల్లం, అలప్పుళా మద్య డెక్కర్ లగ్జరీ బోట్లు నడుపబడుతున్నాయి. మెయిన్ బోటు జెట్టీ నుండి పర్యాటకుల కొరకు ప్రైవేట్ యాజమాన్యం, ప్రభుత్వం లగ్జరీ బోట్లను నడుపబడుతున్నాయి. తిరువనంతపురం వద్ద ఆరంభమౌతున్న వెస్ట్ కోస్ట్ కెనాల్ సిస్టం హోస్ట్‌దుర్గ్ వద్ద ముగుస్తుంది. ఇది పరవూరు, కొల్లం, కరునాగపళ్ళి తాలూకాల గుండా పోతుంది. 62కి.మీ పొడవైన తిరువనంతపురం - షార్నర్ కాలువ కూడా తిరువనంతపురం- హోస్ట్‌దుర్గ్ కాలువలో భాగంగా ఉంది. ఇతర కాలువల విధానాలలో పరవూరు కాయల్, కొల్లం కాలువ, చవర కాలువలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో ప్రకృతి సౌనదర్యం ఉట్టిపడుతున్న ఈ కాలువమార్గాలు పర్యాటక ఆకర్షణలుగా ఉండి రాష్ట్రప్రభుత్వ ఆదాయానికి సహకరిస్తున్నాయి. కేరళ వాటర్ ట్రాంస్పోర్ట్ డిపార్ట్మెంటు (కె.ఎస్.డబ్ల్యూ, టి.డి) నిర్వహిస్తున్న కేంద్రం (కె.ఎస్.ఆర్.టి.సి) బస్‌స్టాండ్ వద్ద ఉంది. పర్యాటకులు కంట్రీ సైడ్ మోటర్ బోట్లు, హౌస్ బోట్లను అద్దెకు తీసుకొని జల మార్గాలలో పర్యటించవచ్చు.

క్రీడలు

మార్చు

కొల్లం జిల్లాలో హాకీక్రీడ అంటే ఆసక్తి అధికం. జిల్లా హాకి, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు అత్యధికంగా ముఖ్యత్వం ఇస్తుంది. డిస్ట్రిక్, స్టేట్ లెవల్, జోనల్ మ్యాచ్లలో పాల్గొనే పలు క్రీడాబృందాలకు కొల్లం పుట్టినిల్లుగా ఉంది. జిల్లాలో అంతర్జాతీయ వసతులతో హాకీ మైదానం నిర్మాణదశలో ఉంది. ఈ మైదానానికి అవసరమైన భూమి కొల్లం లోని ఆశ్రమం తపాలా శాఖ నుండి తీసుకున్నారు. కొల్లం నగర మద్యభాగంలో ప్రబల " లాల్‌బహదూర్ శాస్త్రి స్టేడియం (కొల్లం) " ఉంది. ఈ మల్టీ పర్పస్ స్టేడియంలో రంజి ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, నేషనల్ గేంస్ వంటి క్రీడలకు పలుమార్లు ఆతిథ్యం ఇచ్చాయి.[27] నగరంలో ఉన్న ఆశ్రం మైదానం, పీరంకి మైదానం క్రీడపోటీలకు, ప్రాక్టీస్ చేయడానికి, వార్మప్ మ్యాచులకు ఉపకరిస్తున్నాయి.

కేరళ లాల్బహదూర్ శాస్త్రి స్టేడియం, కొల్లం (క్విలన్)
సంవత్సరం తారీఖు టొర్నమెంటు పాల్గొన్న బృందాలు
1979 3 నవంబరు రంజి ట్రూఫీ 1979/80 కేరళ ఎదురుగా ఆధ్ర
1988 10 డిసెంబరు రంజి ట్రూఫీ 1988/89 కేరళ ఎదురుగా గోవా
1988 17 డిసెంబరు రంజి ట్రూఫీ 1988/89 కేరళ ఎదురుగా కర్నాటకా

జిల్లాలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇన్నడానికి అనువైన పలు క్రీడా మైదానాలు, మిని స్టేడియాలు ఉన్నాయి.

విద్య

మార్చు
 
TKM Engineering College, Kollam
 
SN Polytechnic College (SNPTC), Kottiyam, in 2008

2001 గణాంకాలను అనుసరించి కొల్లం అక్షరాస్యత 91.18%. పురుషుల అక్షరాస్యత 94.43%. స్త్రీల అక్షరాస్యత 88.18%. ఈ గణాంకాలు రాష్ట్ర సరాసరి గణాంకాలకు సమీపంగా ఉంటుంది.[3]

 
Bishop Jerome Institute, Kollam - An integrated campus offering MBA, Architecture and Engineering courses, situated at the heart of the 'Lake City of Kerala'
 
M V Govt. V H S S Peroor, Kollam, covering two acres

కొల్లంలో ప్రైవేట్, ప్రభుత్వానికి స్వంతమైన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. తుయెట్ వద్ద ఉన్న సెయింట్ జీసెఫ్స్ కాంవెంట్ పాఠశాల ఎలాంటి నిధిసహాయం లేకుండా పాఠశాలను నిర్వహిస్తూ 12,000 మంది విద్యార్థులలు విద్యను అందిస్తుంది. ఇలాంటి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో ఇది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం నడుపుతున్న హైయ్యర్ సెకండరీ పాఠశాల ఫర్ బాయ్స్ కొల్లంలోని అతిపురాతన పాఠశాలగా గుర్తింపు పొందింది. జిల్లాలో మొత్తం 128 విద్యాసంస్థలు హైయ్యర్ ఎద్యుకేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాయి. మీనాక్షీ విలాసం గవర్నమెంట్ ఒకేషనల్ పాఠశాల జిల్లాలోని పురాతన పాఠశాలలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇక్కడ 1,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

  • " శ్రీ నారాయణా పాలిటెక్నిక్ కాలేజి (కొట్టియం) " 1957లో కొల్లంలోని నారాయణా ట్రస్ట్ చేత ఇది స్థాపించబడింది.
  • కొల్లంలో ఒక " కేంద్రియ విద్యాలయ ", 3 సి.బి.ఎస్.ఇ స్కూల్స్ ఉన్నాయి. కేరళ స్కూల్స్‌లో ఆంగ్లం, మలయాళం మాఫ్యమంలో విద్యాబోధన చేయబడుతుంది. కొల్లంలో 10 ఇంజనీరింగ్ కాలేజీలు 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాలో 17 ఆర్ట్స్, సైన్సు కాలేజీలు, 11 టీచర్ ట్రైనింగ్ కాలేజిలు, 7 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. కొల్లం .
  • " ది టికె.ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ " 5 దశాబ్ధాలుగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలోఉంది.
  • కొల్లం డియోసెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న " బిషప్ జెరోం ఇంస్టిట్యూట్ " (స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ & స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్), నగరంలోని మరొక ముఖ్యమైన కాలేజీలలో ఒకటిగా భావించబడుతుంది. ఇది కొల్లం రైల్వే స్టేషను సమీపంలో ఉంది. ఈ కాలేజీ విద్యార్థులలో 10,000 మందికి పైగా సమర్ధులైన ఇంజనీరులు ప్రపంచం నలుమూలలో ప్రకాశిస్తున్నారు.
  • టి.కె.ఎం కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ సమర్ధులైన విద్యార్థులకు కేంద్రంగా మారింది. ఇది ఇంజనీరిగ్, దానికి సంబంధించిన డిగ్రీ, ఉన్నత డిగ్రీ విద్యను అందిందిస్తుంది.
  • నగరంలోని సి.బి.ఎస్.ఇ స్కూల్స్‌లో ఒకటైన " నేషనల్ పబ్లిక్ స్కూల్ " కొల్లంలోని తళుతల కొట్టియం వద్ద ఉంది. దీనిని సెంట్రల్ ఎద్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తుంది. దీనికి 2008 ఐ.ఎస్.ఒ సర్టిఫికేట్ పొందింది.

పరిశ్రమలు

మార్చు
 
Chinese nets on the banks of Ashtamudi Lake

కొల్లం జిల్లాలోని చవర, పార్వతి మిల్‌లలో ఉన్న " ది ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ) కొల్లం పరిశ్రమలలో ఒకటిగా భావించవచ్చు. కేరళ సెరామిక్స్ [28] కేరళ ఎలెక్ట్రికల్, కుందర వద్ద ఉన్న అలైడ్ ఇంజనీరింగ్ కంపనీ, కేరళ ప్రెమొ పైప్ ఫ్యాక్టరీ (చవర), కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ (చవర), యునైటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్- కొల్లం, కేరళ అగ్రో-ఫ్రూట్ ప్రొడక్ట్స్ (పునలూరు) మొదలైన పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వానికి స్వనతం అయినవి. ప్రైవేట్ రంగ పరిశ్రమలలో థోమస్ స్టీఫెన్ & కో (కొల్లం), ఫ్లూర్కొ (పొళిక్కర, పరవూరు) కోపరేటివ్ స్పిన్నింగ్ మిల్ (చతన్నూర్), పునలూర్ పేపర్ మిల్స్ (పునలూరు) మొదలైనవి ముఖ్యమైనవి. దాదాపు 2,000 మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైసెస్ జిల్లాలో నమోదు చెయ్యబడింది. కేరళ ప్రభుత్వం ఆధీనంలో శంకరమంగళం (చవర)వద్ద స్థాపించిన కేరళ మినరల్స్ అండ్ మెట్స్ల్స్ పరిశ్రమ హైగ్రేడ్ కెమికల్ కాంపౌండ్ ఆఫ్ టైటానియం డయాక్సైడ్ పిగ్మెంటు, హీలియం ఓర్, సిల్లిమినైట్, మొనజైట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనాలను పైంటింగ్, వెల్డింగ్, సెరామిక్స్, ఫౌండ్రీస్ తయారీలో వినియోగిస్తారు.[29]

 
Women at a small-scale coir (coconut fiber) spinning unit at Kollam

1950 ఆగస్ట్ 18 న భారతప్రభుత్వానికి స్వంతమైన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన " ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ " 4 ప్రొడక్షన్ ప్లాంటులను (మినరల్ డివిషంస్ (చవర), మనవనకురుచ్చి, రేర్ ఎర్త్ డివిషన్లు (అలువ) వద్ద ఇసుక నుండి హెవీమినరల్స్ వేరిచేసే విధానాలు (ఇలిమెనైట్, రూటిల్, జిర్కాన్, సిల్లిమనైట్, గార్నైట్, మొనజైట్) సంస్థలు ఉన్నాయి.[30] ఐ.ఇ.ఆర్.ఎల్ రీసెర్చ్ అండ్ డెవెలెప్మెంట్. యునైటెడ్ ఎలెక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేరళ ప్రభుత్వానికి స్వంతమైంది. ఐ.ఎస్.ఒ సర్టిఫికేట్ పొందిన ఈ సంస్థ డొమెస్టిక్, ఇండస్ట్రీలకు అవసరమైన ఎలెక్ట్రో కెమికల్ మీటర్లు తయారుచేస్తుంది. ఈ సంస్థ ఒక మాసానికి 1,00,000 మీటర్లను తయారుచేస్తుంది.[31]

కొల్లం - టెక్నోపార్క్

మార్చు

కుందర సమీపంలో ఉన్న అష్టముడి సరోవర తీరంలో వేగవంతమైన విద్యుత్తు లైన్ల ద్వారా నిరంతారాయంగా విద్యుత్తు సరఫరా చేయబడగల కొల్లం - టెక్నోపార్క్ పవర్ స్టేషను నిర్మాణదశలో ఉంది. ఈ పార్క్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో ఉంది. ఇది పచేయడం ఆరంభం అయిన తరువాత దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అష్టముడి సరోవరం మీద ప్రత్యేకంగా నిర్మించబడే కార్యాలయ భవనం ఉద్యూగుల రాకపోకల కొరకు బోటు సర్వీసులకు అవసరమైన రేవుతో సహా నిర్మించబడుతుంది.

జీడిపప్పు పరిశ్రమ

మార్చు
 
Twin cashew nuts, ready for harvest from kottarakkara tree

కొల్లం జిల్లాలో జీడిపప్పు పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది, కేంద్రప్రభుత్వం కొల్లం జిల్లాను " జీడిపప్పు పరిశ్రమ కేంద్రంగా " గుర్తించింది. పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు మహిళలు. జిల్లాలో పలు " కాష్యూనట్ ప్రొసెసింగ్ యూనిట్లు " ఉన్నాయి. కేరళ ప్రభుత్వం నిర్వహణలో పనిచేస్తున్న " కాష్యూ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ " ప్రధానకార్యాలయం కొల్లం జిల్లాలో ఉంది. అది జిల్లాలో కాష్యూనట్ తయారీ మాదిరి ఏజన్సీని నిర్వహిస్తుంది. ఈ కార్పొరేషన్‌లో 30 జీడిపప్పు ఫ్యాక్టరీలు, 20,000 శ్రామికులు ఉన్నారు. జీడిపప్పు తయారీలో ఉన్న మరొక ప్రభుత్వ సంస్థ సి.ఎ.పు.ఇ.ఎక్స్. ఇది కోపరేటివ్ రంగంలో ఒక భాగం. ఇది 10 జీడిపప్పు తయారీ ఫ్యాక్టరీలను కలిగి ఉంది.[32] కోయిర్ తయారీ, చేనేత పరిశ్రమ, బంకమట్టి, కొయ్య - ఆధారిత పరిశ్రమ వంటివి కూడా జిల్లా పరిశ్రమను సుసంపన్నం చేస్తున్నాయి.[33]

అంచర్ అరణ్యాలు

మార్చు

కేరళ ప్రభుత్వ అంచనా ప్రకారం జిల్లాలో 81,438 హే భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నట్లు భావిస్తున్నారు. జిల్లాలోని తూర్పు భాభాగంలోని పెన్మల, పునలూరు, అంచంకోయిల్ ఫారెస్ట్ డివిషన్లు. తెన్మల పర్వతశ్రేణి, ఆర్యంకవు పర్వతశ్రేణి, షెండర్నీ అభయారణ్యం తెన్మల డివిషన్లో ఉన్నాయి. అంచంకోయిల్, కెల్లర్, కనయర్ పర్వతశ్రేణులు అంచంకోయిల్ ఫారెస్ట్ డివిషన్లో ఉన్నాయి. పతనపురం, అంచల్ పర్వతశ్రేణులు పునలూరు డివిషన్లో ఉన్నాయి.

షెండర్ని వన్యమృగ అభయారణ్యాలు కొల్లం పట్టణానికి 66 కి.మీ దూరంలో ఉంటుంది. ఇది పశ్చిమ కనుమల దక్షిణభాగంలో 8°50' 8°55'ఉ; అక్షాంశం 77°5', 77°15' తూర్పు రేఖాశంలో ఉన్నాయి.[34] షెంకర్నీ (చెంకుంరీ) (గ్లట ట్రావంకోరియా) సుగంధద్రవ్య వృక్షం ఈ ప్రంతంలో అధికంగా కనిపిస్తున్నందు వలన దీనికి షెండర్నీ అని పేరు పెట్టారు. కల్లడ నదిమీద నిర్మించిన ఆనకట్ట కారణంగా 26 చ.కి.మీ విస్తీర్ణంలో కృత్రిమ సరోవరాన్ని రూపొందించారు. రాయియుగపు అవశేషాలు కలిగిన గుహ ఒకటి షెండర్నీ నది ఈశాన్య భాగంలో ఉంది.[34] ఈ అవశేషాలు మెసోలితిక్ కాలానికి చెందిందని భావిస్తున్నారు.

ఈ ఉష్ణమండల అటవీ ప్రాంతంలో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. కొన్ని అంతరించిపోతున్న జాతుల ప్రాణులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అభయారణ్యంలో బోనెట్, సింహం తోక కోతి, నీలగిరి లంగూర్ గౌర్ (లేదా ఇండియన్ బైసన్), సాంబార్ జింక, ముంట్జాక్ (లేదా జింకలు) ఉన్నాయి, స్థానిక చవరోటియన్ (లేదా మౌస్ జింక), అడవి పంది, భారతీయ ఏనుగు, వివిధ జాతుల మచ్చల అటువంటి భారత దిగ్గజం భారత తాటి ఉడుతలు వంటి ఉడుతలు వంటి ప్రాణులు కనిపిస్తుంటాయి.[34]

వ్యవసాయం

మార్చు
 
Check dam across the Kallada River

కొల్లం జిల్లాలో 2,18,267 చ.కి.మీ వ్యవసాయ భూమి ఉంది. వీటిలో వరి, వక్క, కొబ్బరి, రబ్బర్, మిరియాలు, అరటి, మామిడి, జీడిపప్పు మొదలైన ప్రధానపంటలు పండుతున్నాయి. కుటునబానికి దాదాపు 0.21 హెక్టార్లు. జిల్లాలోని 70% శ్రామికులు వ్యవసాయ సంబంధిత రంగంలో పనిచేస్తున్నారు. కొల్లం చారిత్రాత్మకంగా జీడిపప్పు తయారీకి పేరుపొందింది. జిల్లాలో పలు జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జిల్లాలో కొన్ని సంవత్సరాల నుండి జీడిపప్పు తయారీ తగ్గుతూవస్తుంది. రాష్ట్రంలో కొల్లం జిల్లా వక్క, మొక్కపెండెలం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.

కొల్లం జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు
ఉత్పత్తులు సాగుచేయు భూమి (హె) ఉత్పత్తి (టన్నులలో)
వరి 11,457 24,204
మిరియాలు 10,633 3,235
జింజర్ 612 1,648
జీడిపప్పు 4,663 3,043
టాపియోకా 24,065 556,140
కోకోనట్ 71,310 411 మిలియన్
అరెకానట్ 2,502 1,710
రబ్బర్ 36,797 48,386

నీటిపారుదల

మార్చు
 
Kallada River

కొల్లం జిల్లాలో కల్లడ, ఇతిక్కర నదులు ప్రవహిస్తున్నాయి. ది కల్లడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కల్లడ నదీ జలాలను వాడుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ తెన్మల వద్ద నిర్మించిన ఆనకట్ట జలాలు వ్యవసాయానికి ఉపకరిస్తున్నాయి.

చేపలవేట

మార్చు

కొల్లం పశ్చిమతీర సరిహద్దులో లక్షద్వీపాల సముద్రతీరం ఉంది. కొల్లం జిల్లాలో 37 కి.మీ పొడవైన సముద్రతీరం ఉంది. కేరళ సముద్రతీరంలో 6.3% కొల్లం జిల్లాలో ఉంది. నీందకర, శక్తికులంగర జిల్లాలోని ఫిషింగ్ గ్రామాలలో ప్రధానమైనవి. జిల్లాలో చేపలవేట మీద పూర్తిగా ఆధాపరపడిన గ్రామాలు 26 ఉన్నాయి. జిల్లాలో చెరియజీక్కల్, అలప్పడ్, పందరదురుతు,పుదెంతుర, నీందకర, తంగసేరి, ఎరవిపురం, పరవూరు మొదలైన ప్రబలమైన మత్స్యకారుల గ్రామాలున్నాయి.[35] కేరళలోని చేపల ఉత్పత్తిలో 3 వ వంతు కొల్లం జిల్లాలో ఉత్పత్తి ఔతున్నాయి. అలాగే 60% రొయ్యలు ఈ జిల్లాలో ఉత్పత్తి చేయబడుతున్నాయి. జిల్లా 5,275 టన్నుల చేపలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ నుండి దాదాపు 3,000 మోటర్ బోట్లు నడుపబడుతున్నాయి.[35]

జంతువుల పెంపకం

మార్చు

కేరళ రాష్ట్రంలో పెంపుడు జంతువుల అధికంగా కలిగిన జిల్లాగా కొల్లం జిల్లాకు ప్రత్యేకత ఉంది. పశువులు అధికంగా డైరీ ఫాంలలో ఉన్నాయి. 2,000 ఫాంలలో ఉన్న పశువుల సంఖ్య 1,82,434 ఆవులు, 6,162 బర్రెలు, 1.31,714 మేకలు, 1,034 పందులు ఉన్నాయి. జంతువుల పెంపకంలో జిల్లా 3 వ స్థానంలో ఉంది.

పర్యాటకం

మార్చు
 
Thirteen-ring bridge, Punalur
 
Thenmala Dam
 
Thekkumbhagam bridge, Paravur
 
Kottarakkara Palace

పాలరువి జలపాతం, తెన్మల (అరణ్యం, జలాశయం), అగస్త్యమలై బయోస్ఫేర్ అభయారణ్యం, అష్టముడి (బ్యాక్ వాటర్స్), కొల్లం సముద్రతీరాలు, తిరుముల్లవరం, తంగస్సేరి మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

  • ఆశ్రమం టూరిస్ట్ గ్రామం ప్రబల పర్యాటక గమ్యాలలో ఒకటి :- ఈ పర్యాటక గ్రామం అష్టముడి సరసు తీరంలో ఉంది. పర్యాటక కేంద్రమైన ఆశ్రమంలో " డిస్ట్రిక్ టూరిజం ప్రమోధన్ కైంసిల్ " ఉంది.
  • పర్యాటక గ్రామం ఆనుకుని కేరళ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో విశాలమైన ఆశ్రమ మైదానం ఉంది. ఈ మైదానంలో క్రీడలు, హెలిపాడ్, కొల్లం పూరం, డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహణా జరుగుతూ ఉన్నాయి. ఇది 60 చ.కి.మీ వైశాల్యంలో ఓవల్ ఆకారంలో ఉంటుంది.
  • ముంరోతురుతు ద్వీపాలలో మొదటిసారిగా కమ్యూనిటీ పర్యాటకం ఆరంభించబడింది.
  • బ్యాక్ వాటర్ పర్యాటకం :- కొల్లం జిల్లాలో ఆనందకరమైన పర్యాటకంలో ఇది ఒకటి. అధ్టముడి సరోవరంలో (పరవూరు), ముంరో ద్వీపాలు, అలుంకడవు మొదలైనవి ప్రధాన బ్యాక్ వాటర్ గమ్యాలుగా ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్లు, హౌస్ బోట్లు పర్యాటకులు బస చేయడానికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
  • కొల్లం తూర్పు భాగంలో ఉన్న తెన్మల భారతదేశంలో మొదటి ఎకోపర్యాటకం ప్రాజెక్టుగా గుర్తించారు. దీనిని తెన్మల ఎకోపర్యాటకం ప్రమోషన్ సొసైటీ నిర్వహిస్తుంది.[36][37][38]
  • ప్రముఖ రాజులకు కొల్లం కేద్రంగా ఉంటూ వచ్చింది. కోత్తకరలో కథాకళి నృత్యంలో సరికొత్త పంథా ఒకటి రూపొందించబడింది. కొల్లం ఎలైడాహ్ స్వరూపం రాజధాని అని భావిస్తున్నారు. కుందరలో 1882లో దళవాయి వేలుతంబి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ప్రకటన చేసాడు.[33]
  • సముద్రతీరంలో ఉన్న అలప్పాడ్ గ్రామం 2004 హిందూ మహాసముద్ర భూకంపం, త్సునామీలకు గురైంది.
  • కొల్లం నగరానికి దక్షిణంగా 26కి.మీ దూరంలో వర్కల సముద్రతీరం (దీనిని పాపానాషం అని కూడా అంటారు) ఉంది. కున్నాత్తూరు తాలూకాలో దుర్యోధనుని ఆలయం ఉంది. శక్తికులంగర వద్ద ధర్మశాస్తా ఆలయం- శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో మకరం మాసంలో నిర్వహించబడుతున్న ఉత్సవం ప్రత్యేకత సంచరించుకుంది.
  • చిరక్కర గ్రామపంచాయితీలో ఉన్న పొలాచిర సైట్సీయింగ్ గమ్యంగా ఉంది. ఇక్కడికి సమీపంగా ఊన అనతవలంలో మచ్చికచేయబడిన ఏనుగులను చూడవచ్చు. ఇక్కడ ఏనుగులను తాకవచ్చు అలాగే స్వారీ చేయవచ్చు.
  • చాతనూర్‌కు దక్షిణంగా 4 కి.మీ దూరంలో పొలచిరా వద్ద మన్నతిప్పర ఉంది.
  • కొల్లం నుండి 19కి.మీ దూరంలో ఉన్న శాస్తంకోట సరోవరం. ఇది కేరళలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరసు అలాగే నగరవాసుల విహారప్రదేశాలలో ఒకటి.[39] జెతయుపర ఇది అతిపెద్ద బౌల్డర్‌గా ప్రసిద్ధి చెందింది. పౌరాణికంగా ఈ ప్రదేశానికి ప్రత్యేకత ఉంది. రావణాసురుడు సీతమ్మను అపహరించే సమయంలో రావణుని ఎదిరించిన జటాయువు పడిన ప్రదేశం ఇదని విశ్వసిస్తున్నారు.[39][40]

కొల్లం సముద్రతీరం

మార్చు

కొల్లం సముద్రతీరాన్ని మహాత్మా గాంధీ సముద్రతీరం అని కూడా అంటారు. వగరంలో ఉన్న రెండు సముద్రతీరాలలో ఒకటి. రెండవది తిముల్లవరం సముద్రతీరం. కొల్లం నగరానికి 2 కి.మీ దూరంలో కొల్లం సముద్రతీరం ఉంది. కేరళలో అత్యధికంగా రద్దీగా ఉండే సముద్రతీరాలలో ఇది ఒకటి. సముద్రతీరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూదోట (పార్క్) ఉంది. 1961లో మహాత్మా గాంధీ పేరుతో ఈ పూదోట ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రాంభోత్సవాన్ని అప్పటి భారత అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా జరిగింది. కొల్లం మునిసిపల్ కార్పొరేషన్ సముద్రతీరం తూర్పు భాగంలో మారైన్ అక్వేరియం ఆఫ్ కొల్లం నిర్మించింది. రాష్ట్రంలో ఈ తరహా అక్వేరియాలలో ఇది మొదటిది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Kollam District Level Statistics 2011" (PDF). ecostat.kerala.gov.in. 2012. Archived from the original (PDF) on 2 జనవరి 2014. Retrieved 1 January 2014.
  2. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  3. 3.0 3.1 3.2 "Covt of kerala website, kollam page". Archived from the original on 2009-04-26. Retrieved 2014-07-15.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-09-14. Retrieved 2014-07-15.
  5. "Kollam District Population, Kerala, List of Taluks in Kollam". Censusindia2011.com. Retrieved 2023-06-03.
  6. "Kollam city population Census". census2011.co.in. Retrieved 16 December 2013.
  7. Administration page of quilon.com
  8. 8.0 8.1 "kollam police official website". Archived from the original on 2016-01-11. Retrieved 2014-07-15.
  9. "mukhathala murari temple". Archived from the original on 2011-10-08. Retrieved 2014-07-15.
  10. Oachira website
  11. 11.0 11.1 "Official website of kottarakkara ganapathy temple". Archived from the original on 2013-01-18. Retrieved 2014-07-15.
  12. "Official website of Asramam Sreekrishna swamy temple". Archived from the original on 2009-02-01. Retrieved 2020-01-09.
  13. "Official website of Kollam pooram". Archived from the original on 2009-03-03. Retrieved 2014-07-15.
  14. http://www.hindu.com/2008/04/05/stories/2008040551540300.htm Archived 2008-04-09 at the Wayback Machine News article on kollam pooram
  15. http://www.hindu.com/2009/04/16/stories/2009041653840300.htm Archived 2012-11-07 at the Wayback Machine News article on kollam pooram Hindu Daily
  16. "Extract on Ammachiveedu temble". Archived from the original on 2014-04-24. Retrieved 2014-07-15.
  17. 17.0 17.1 "The Hindu Daily news about Balasubrahmanya swamy temple". Archived from the original on 2007-03-28. Retrieved 2014-07-15.
  18. "News article about Kottamkulangara temple chamaya vilakku". Archived from the original on 2009-03-30. Retrieved 2014-07-15.
  19. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-10-20. Retrieved 2020-01-09.
  20. Amrithapuri website
  21. "Title = ESI Medical College Inaugurated". Archived from the original on 2016-03-01. Retrieved 2014-07-15.
  22. 22.0 22.1 22.2 "Southern Railway". Archived from the original on 2010-09-14. Retrieved 2020-01-09.
  23. 23.0 23.1 KSRTC official website
  24. 24.0 24.1 "kollam railway information". Archived from the original on 2014-08-16. Retrieved 2014-07-15.
  25. "Kollam Asramam Airport". Archived from the original on 2014-04-16. Retrieved 2014-07-15.
  26. Thiruvanthapuram International airport
  27. Stadiums in India KCA-Cricket Archive Archived 2012-01-15 at the Wayback Machine
  28. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-11-07. Retrieved 2020-05-30.
  29. KMML official website
  30. "IREL official website". Archived from the original on 2014-07-14. Retrieved 2014-07-15.
  31. "Official website of UNILEC". Archived from the original on 2014-07-16. Retrieved 2014-07-15.
  32. http://www.cashewcorporation.com
  33. 33.0 33.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-06. Retrieved 2020-01-11.
  34. 34.0 34.1 34.2 "kera prd site". Archived from the original on 2014-06-26. Retrieved 2014-07-15.
  35. 35.0 35.1 "Kerala matsyafed". Archived from the original on 2009-04-26. Retrieved 2014-07-15.
  36. Thenmala Ecotourism website
  37. "Thenmala Ecotourism news Hindu Daily". Archived from the original on 2008-01-16. Retrieved 2014-07-15.
  38. "Thenmala Ecotourism news Hindu Daily". Archived from the original on 2011-06-06. Retrieved 2014-07-15.
  39. 39.0 39.1 tourism page of kollam official website Archived 2017-05-05 at the Wayback Machine.
  40. Jatayu para article from Hindu Daily Archived 2007-10-17 at the Wayback Machine t.

బయటి లింకులు

మార్చు