సీతాకోకచిలుక (సినిమా)
1981 ప్రేమకథాచిత్రం
సీతాకోకచిలుక 1981లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో విడుదలైన అలైగల్ ఒవితల్లై (அலைகள் ஓய்வதில்லை) మాతృక. రెండింటిలోను మురళి ప్రధానమైన కథానాయకుని పాత్రను పోషించాడు.
సీతాకోకచిలుక (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | భారతీరాజా |
---|---|
తారాగణం | మురళి, ముచ్చర్ల అరుణ, సిల్క్ స్మిత, శరత్ బాబు, ఆలీ కార్తీక్ (అతిధి పాత్రలో) |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | పూర్ణోదయా మూవీ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చుపాటల రచయిత :వేటూరి సుందర రామమూర్తి
- మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా.. ఎస్పి..బాలసుబ్రహ్మణ్యం , వాణి జయరాం
- మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము . ఎస్. పి. బాలసుబ్రమణ్యం, ఎస్ పి. శైలజ.
- సాగరసంగమమే, ప్రణయ సాగరసంగమమే.. డ్యూయెట్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
- పాడింది పాడింది పట్నాల కాకి , రమేష్.
- సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే, వాణి జయరాం. రచన: వేటూరి సుందర రామమూర్తి.
- అలలు కలలు, డ్యూయెట్, వాణి జయరాం, ఇళయ రాజా.
- అలలు కలలు , వాణి జయరాం.
విశేషాలు
మార్చు- ఈ సినిమాలో ఆలీ బాలనటుడిగానే కామెడీ పండించాడు. పెళ్ళి సంబంధం మాట్లాడటానికి విలన్ అయిన శరత్ బాబు ఇంటికి హీరో కార్తీక్ స్నేహితులతోబాటు, బాలుడైన ఆలీ పంచే కట్టుకుని, తాంబూల పళ్ళెం చేతబట్టుకొని పోవటం, తీరా శరత్ బాబును చుడగనే ఆలీ పంచె తడిపేసుకోవటం కడుపుబ్బ నవ్విస్తుంది.