సీతాఫలపు కుటుంబము

సీతాఫలపు కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.[1]

సీతాఫల పండ్లు
సీతాఫల చెట్టు

సీతాఫలము చెట్లు మనదేశమునందంతటను బెరుగు చున్నవి.

ఈ కుటుంబములో బెద్ద చెట్టును గుబురు మొక్కలును గలవు. కొన్ని తీగెలవలె నల్లుకొనును. ఈ మొక్కలు శీతల దేసమునందంతగా లేవు, ఆకులు, ఒంటరి చేరిక. సాధారణముగ రెండు వరుసలుగా నేయుండును. కణుపు పుచ్చము లుండవు. సమాంచలము కొన్నిటి యాకులకును సువాసన గలదు. వృతాగ్రము గోపురము వలె నుండును. రక్షక పత్రములును, ఆకర్షణ పత్రములును వలయమునకు మూడేసి గలవు. కింజల్కములును, స్త్రీ పాత్రములుని అసంఖ్యములు. కింజల్కపు కాదల సంయోగకములు పుప్పొడి తిత్తుల పైకి వచ్చి యుండును. గింజలును బీజపుచ్ఛము గలదు.

కుటుంబ లక్షణాలు

మార్చు
  • ఆకులు: ఒంటరి చేరిక, కొమ్మకు రెండు వైపునే యుండును. లఘు పత్రములు, కురుచ బొడిమ, కణుపు పుచ్చములు లేవు. సమ గోళాకారము, సమాంచలము కొన సన్నము.
  • పుష్పమంజరి: కణుపు సందుల నొక్కొక్క పుష్పముండును. సరాళము. అకు పసుపు రంగు.
  • పుష్పకోశము: రక్షక పత్రములు మూడు. చిన్నవి. నీచము.
  • దళవలయము: ఆకర్షణ పత్రములు మూడు. పెద్దవి. సన్నముగ నిడివి చౌకపునాకారముగను దళసిరగను నుండును.
  • కింజల్కములు: అసంఖములు. సంయోజకములు పుప్పొడి తిత్తులపైకి వచ్చి యున్నవి.
  • అండకోశము: స్త్రీ పత్రములన్నియు విడివిడిగా నున్నవి. అవి చాల గలవు. ఒక్కొక్క దాని కొక్కొక్క కీలమున్నది. స్త్రీ పత్రములును గింజల్కములు గోపురము వలె నున్న వృతాగ్రము పై నున్నవి. ఫలము, కండ కాయ.

రామాఫలపు చెట్టు

మార్చు

రామాఫలపు చెట్టు ఇంచుమించు సీతాఫలము వలెనే యుండును. పండు మాత్రము కొంచమెర్రగను నున్నగను నుండును. ఈ మొక్కలను బెంచుట కష్టము లేదు. గింజలు నాటి గాని కొమ్మలను, పేదవేసి సిద్ధము చేసిన గుంటలలో పాతి గాని పెంచెదరు. తరువాత వర్షములు కురియు వరకు అప్పుడప్పుడు నీరు పోయ వలెను. ఈ చెట్ల పండ్లు మిక్కిలి రుచిగా నుండును. బెరడును ఆకులును వేరులును అందులందు ఉపయోగ పడు చున్నవి. వేరు రసమునకు విరేచనము కలుగ చేసేయు గుణము గలదందురు. ఆకుల రసౌను మూర్చచే పడియున్నవారల ముక్కులకు వ్రాసిన వారిని సేద దేర్చునని చెప్పుదురు.

సంపంగి

మార్చు

గుబురు మొక్క. ఆకర్షణ పత్రములు రెండు వరుసలుగా నున్నవి. ఈ పుష్పము మిక్కిలి మనోహరమగు సువాసన వేయును.

నరమామిడి

మార్చు

ఇది పొడుగుగా పెరుగు నొక చెట్టు ఆకులు బల్లెపు ఆకారము. అంచుతరళితము. దీనినే అశోక వృక్షమని కూడా అంటారు.

మూలాలు

మార్చు
  1. వేమూరి, శ్రీనివాసరావు (1916). వృక్షశాస్త్రము. మద్రాసు: విజ్ఞాన చంద్రికా మండలి. p. 64. Retrieved 27 June 2016.[permanent dead link]