సీప్ (CEEP) [1] సాంకేతిక లేక సాంకేతికేతర పాలిటెక్నిక్ కోర్స్ లలో ప్రవేశానికి పరీక్ష. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి [2] నిర్వహిస్తుంది. 3 లేక3.5 సంవత్సరాలు అవధి గల 29 రకాల కోర్సులలో, ప్రభుత్వ, ప్రవేటు పాలిటెక్నిక్ విద్యాలయాలలో, ఇతర పాలిటెక్నిక్ కోర్స్ లు గల కళాశాలలలో ప్రవేశానికి ఎంపిక జరుగుతుంది.

ఉపాధి, పైచదువు మార్చు

డిప్లొమా చేసిన తరువాత, సాంకేతిక నిపుణులుగా, లేక పర్యవేక్షణాధికారులుగా లేక, సొంతంగా ఉపాధి కల్పించుకోవచ్చు. పై చదువులు ( పోస్ట్ డిప్లొమా, డిగ్రీ) చదవవచ్చు.

పరీక్ష వివరాలు మార్చు

ఈ పరీక్ష సాధారణంగా మే నెలలో జరుగుతుంది. 10 వ తరగతి లేక సరిసమానమైన చదువులో ఉత్తీర్ణులైన వారు, దీనిని రాయవచ్చు.

2009 పరీక్ష గణాంకాలు మార్చు

మొత్తం 1,95,0 27మంది పరీక్షకు హాజరుకాగా 1,54,328మంది ఉత్తీర్ణత సాధించారు. అనగా 81.8 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతంబాలురలో 79.22, బాలికలలో 86.97. ఈ ఫలితాల్లో కాకినాడకు చెందిన ఎం.ఎస్.ఆర్‌కే తేజ అగ్రస్థానం సాధించగా, తణుకుకు చెందిన రమ్యశ్రీ, సత్య రాఘవ అనీష్, ఎం.శ్వేత, రాజేష్‌కుమార్ తదితరులు ద్వితీయ స్థానంలో నిలిచారు. 115 పాలిటెక్నిక్ కళాశాలలో 38,620 సీట్లు, ఇంజినీరింగ్ కాలేజీలలో, షిఫ్ట్ పద్ధతిలో పాలిటెక్నిక్ కోర్సులు మొదలవడంతో 14820 సీట్లు ఉన్నాయి. మిగిలిపోయిన సీట్లకి స్పాట్ అడ్మిషన్ నిర్వహించారు.

2012 పరీక్ష గణాంకాలు మార్చు

‍పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (సీప్) ఫలితాలు 19 మే 2012 న విడుదలయ్యాయి. 80.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 85.28 శాతం మంది ఉత్తీర్ణులవ్వగా, బాలురు 79.37 శాతంతో సరిపెట్టుకున్నారు. 118 మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ, సాయిచంద్, రూపశ్రీ 118/200 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 86 శాతం ఉత్తీర్ణతతో, ఖమ్మం జిల్లా మొదటి స్థానం పొందింది. హైదరాబాదు 70.69 శాతంతో చివరి స్థానం పొందింది. 2.28 లక్షల మంది విద్యార్థి నీ, విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, 1.84 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. 22 మే 2012 నుంచి ర్యాంకు కార్డులు పంపిణీ జరుగుతుంది. సీప్ 2012 పరీక్ష 2 మే 2012 న జరిగింది.

వనరులు మార్చు

  1. సీప్ వెబ్ సైట్[permanent dead link]
  2. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్
"https://te.wikipedia.org/w/index.php?title=సీప్&oldid=2826908" నుండి వెలికితీశారు