సీమ రేల Caesalpiniaceae కుటుంబానికి చెందిన చెట్టు.సీమ రేలను ఉరుముడు, సీమ తంగేడు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Cassia marginata. ఇది ఎరుపు రంగు పువ్వులు పూస్తుంది. కాసియా మార్గినాటా మధ్య తరహా చెట్టు, ఇది 8-12 మీటర్ల వరకు పెరుగుతుంది ఈ మొక్క భారతదేశానికి చెందినది. దీనిని అలంకార మొక్కగా ఉపయోగిస్తారు. తేమతో కూడిన మట్టి లో పెరుగుతుంది . కాసియా మార్గినాటా విత్తనాల సేకరణ సమయం అక్టోబర్ - డిసెంబర్ లలో ,1-2 సంవత్సరం వరకు విత్తనములు నిల్వ ఉంటాయి [1] సీమరేల మన దేశం లో మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్, కొల్లాపూర్, పూణే జిల్లాలో ( పశ్చిమ కనుమలు ) , కేరళ లోని పాలక్కాడ్, తిరువనంతపురం, త్రిసూర్ జిల్లాలలో , తమిళనాడు లోని కోయంబత్తూర్ జిల్లా లో కనబడుతుంది [2]

హైదరాబాద్ లో సీమ రేల పువ్వులు




ఇవి కూడా చూడండి

మార్చు

రేల


బయటి లింకులు

మార్చు
  1. "Multipurpose Tree Seeds : Cassia marginata". www.ehorticulture.com. Archived from the original on 2020-02-22. Retrieved 2020-10-15.
  2. "Cassia roxburghii DC". India Biodiversity Portal. Retrieved 2020-10-15.
"https://te.wikipedia.org/w/index.php?title=సీమ_రేల&oldid=3436767" నుండి వెలికితీశారు