సుందర్‌గఢ్

ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లా ముఖ్యపట్టణం

సుందర్‌గఢ్ ఒడిషా రాష్ట్రం సుందర్‌గడ్ జిల్లా లోని పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, పట్టణ జనాభా 45,036. సుందర్‌గఢ్, ఒడిశాలో పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు పొందింది. ఉక్కు, ఎరువులు, సిమెంట్, ఫెర్రోవెనేడియం, మెషిన్-బిల్డింగ్, గాజు, చైనా-క్లే ప్లాంట్లు, కర్మాగారాలు, స్పిన్నింగ్ మిల్లులు ఈ జిల్లాలోని కొన్ని ప్రధాన పరిశ్రమలు. సుందర్‌గఢ్ ఒడిషా ఖనిజ పటంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. జిల్లాలో ఇనుప ఖనిజం, సున్నపురాయి, మాంగనీస్‌తో సమృద్ధిగా ఉన్నాయి.


సుందర్‌గఢ్
సుందర్‌గఢ్ is located in Odisha
సుందర్‌గఢ్
ఒడిశాలో పట్టణ స్థానం
Country  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా సుందర్‌గఢ్
జనాభా (2011)
 - మొత్తం 45,036
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
Telephone code 06622
Vehicle registration OD-16
వెబ్‌సైటు http://sundergarh.nic.in/

భౌగోళిక శాస్త్రం

మార్చు

సుందర్‌గఢ్ వద్ద ఉంది22°07′N 84°02′E / 22.12°N 84.03°E / 22.12; 84.03 [1] దీని సగటు ఎత్తు 243 మీటర్లు (801 అడుగులు). Ib నది ఉత్తరాన ప్రవహిస్తుంది.

శీతోష్ణస్థితి

మార్చు

ఈ జిల్లా శీతోష్ణస్థితి వేసవిలో బాగా వేడి గాను, శీతాకాలంలో చల్లగానూ ఉంటుంది. వాతావరణం వేడిగా, తేమతో కూడుకుని ఉంటుంది. జిల్లా సాధారణ వర్షపాతం సుమారు 1230 మి.మీ. కానీ వర్షపాతం హెచ్చుతగ్గులుంటాయి. ఇది పంట ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

చరిత్ర

మార్చు

సుందర్‌గఢ్ 1948 వరకు గంగ్‌పూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది. 1948 నుండి సుందర్‌గఢ్ జిల్లాకు కేంద్రంగా మారింది. పురాతన కాలంలో, సుందర్‌గఢ్ వివిధ రాజవంశాల పాలకుల క్రింద ఉండేది. అయితే, పాలక కుటుంబాల మూలానికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు అందుబాటులో ఉన్నాయి. గంగ్‌పూర్‌లోని ప్రస్తుత రాజ కుటుంబం శేఖర్ వంశానికి చెందినది. ఈ మాజీ సంస్థానం సంబల్పూర్ రాజ్యంలో ఉంది. దీనిని హిరాఖండ్ దేశ్ అని పిలుస్తారు. తరువాత ఇది నాగ్‌పూర్ మరాఠా రాజుల ఆధిపత్యం లోకి వెళ్ళింది. 1803లో కుదిరిన దేవ్‌గావ్ (రూర్కెలా సమీపంలో ఉంది) ఒప్పందం ప్రకారం నాగ్‌పూర్‌కు చెందిన మరాఠా చీఫ్ రఘుజీ భోంస్లా, దీనిని బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించాడు. ఇది 1806లో అతనికి తిరిగి అప్పగించారు. చివరకు 1826లో దీన్ని బ్రిటిషు వారి పరం చేసారు. 1905లో, బోనైతో పాటు ఈ సంస్థానాన్ని ఛోటానాగ్‌పూర్ కమీషనర్ నియంత్రణ నుండి ఒడిషా డివిజన్‌కు బదిలీ చేసి, ప్రత్యేక రాజకీయ ప్రతినిధిని నియమించారు.

జనాభా

మార్చు

2011 భారత జనగణన ప్రకారం, పట్టణ జనాభా 45,036. వీరిలో పురుషులు 22,754 కాగా, స్త్రీలు 22,282.

రవాణా

మార్చు

సుందర్‌గఢ్ నుండి ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గం ఉంది. రాష్ట్ర రహదారి 10, ఇక్కడి నుండి రూర్కెలా, సంబల్‌పూర్‌లకు వెళ్తుంది.

సమీప రైల్వే స్టేషన్ ఝార్సుగూడా రైల్వే స్టేషన్. పట్టణం నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్సుగూడ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • దిలీప్ టిర్కీ - సుందర్‌గఢ్‌కు చెందిన హాకీ ప్లేయర్

మూలాలు

మార్చు