సుకర్ణో (1901 జూన్ 6 – 1970 జూన్ 21)[2] ఇండోనేషియా తొలి అధ్యక్షుడు, ఇండోనేషియా జాతి పితగా ప్రఖ్యాతుడు.

హిస్ ఎక్సలెన్సీ, డాక్టర్, హాజీ సుకర్ణో

పదవీ కాలం
18 ఆగస్ట్ 1945 – 12 మార్చ్ 1967
ప్రధాన మంత్రి సుతాన్ జాహ్రిర్
అమీర్ జారిఫుద్దీన్
మహమ్మద్ హత్తా
అబ్దుల్ హలీం
మహమ్మద్ నత్సీర్
సోకిమాన్ విర్జోసంద్జోజో
విలోపో
అలీ సాస్త్రోమిద్జోజో
బుర్హనుద్దీన్ హరాహప్
జువాండా కర్తవిద్జాజా
ఉపరాష్ట్రపతి మహమ్మద్ హత్తా
ముందు పదవి స్థాపన
తరువాత సుహార్తో

12వ ఇండోనేషియా ప్రధానిగా జీవితకాల ఇండోనేషియా అధ్యక్షుడు
పదవీ కాలం
9 జూలై 1959 – 25 జూలై 1966
అధ్యక్షుడు ఆయనే
ముందు జువాండా కార్తవిద్జాజా
తరువాత పదవి రద్దు

వ్యక్తిగత వివరాలు

జననం (1901-06-06)1901 జూన్ 6
సురబయ, తూర్పు జావా, డచ్ ఈస్టిండీస్[1]
మరణం 1970 జూన్ 21(1970-06-21) (వయసు 69)
జకార్తా, ఇండోనేషియా
రాజకీయ పార్టీ Indonesian National Party
జీవిత భాగస్వామి ఓతారీ
ఇంగిట్ గార్నాసియా
ఫత్మావతి
హర్తిని
కర్తిని మనొప్పొ
దెవి సుకర్ణో
హర్యాతీ
యూరికె సాంగర్
హెల్డీ జాఫర్
పూర్వ విద్యార్థి Bandung Institute of Technology
మతం Sunni Islam
సంతకం సుకర్ణో's signature

నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం పొందేందుకు సాగిన ఇండోనేషియా స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకుడు. ఆయన ఇండోనేషియా జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు కావడంతో దశాబ్ది పాటు డచ్ జైళ్ళలో మగ్గారు. జపనీస్ సైన్యం ఇండోనేషియాను ఆక్రమించినప్పుడు ఆయనను విడిపించారు. సుకర్ణో, అతని సహ జాతీయవాదులు జపనీస్ యుద్ధ కార్యకలాపాలకు మద్దతు సంపాదించేందుకు కృషిచేయగా, దానికి ప్రతిగా జపనీయులు ఇండోనేషియా జాతీయ భావాలు వ్యాప్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించారు. జపనీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో లొంగిపోవడంతో 1945 ఆగస్టు 17న సుకర్ణో, మొహమ్మద్ హట్టా ఇండోనేషియా స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు, సుకర్ణో తొలి అధ్యక్షుడయ్యారు. 1945-49 మధ్యకాలంలో ఇండోనేషియాను తిరిగి వలసరాజ్యంగా మార్చుకునేందుకు డచ్ వారు సాగించిన సైనిక, దౌత్యపరమైన కార్యకలాపాలను ఎదిరించి స్వాతంత్ర్యాన్ని నిలుపుకునేందుకు పోరాటం సాగించారు. చివరకు ఆయన కృషి ఫలించి 1949లో డచ్చివారు ఇండోనేషియాను సార్వభౌమ రాజ్యంగా గుర్తించారు. ప్రేమొద్య అనంత తోర్ - ఆధునిక యుగంలో వివిధ జాతి, సంస్కృతి, మత భేదాలు కలిగిన ప్రజలను ఒక్క చుక్క రక్తం చిందకుండా ఐక్యం చేయగలిగిన ఆసియా నాయకుడు సుకర్ణో ఒకడేనని వ్యాఖ్యానించారు.[3]

పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు అస్తవ్యస్త పరిస్థితుల అనంతరం సుకర్ణో గైడెడ్ డెమొక్రసీ పేరిట నిరంకుశ పాలనా విధానం 1957లో ప్రవేశపెట్టి తద్వారా భిన్నత్వం కలిగిన ఆ దేశపు మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న అనిశ్చిత పరిస్థితి, తిరుగుబాట్లు అంతం చేశారు. 1960ల్లో సుకర్ణో ఇండోనేషియాను వామపక్షం వైపుకు మొగ్గుచూపించేలా చేయడం చూడొచ్చు. సోవియట్ యూనియన్చైనాల నుంచి సహాయం తీసుకుంటూ ఇంపీరియలిజానికి వ్యతిరేకం అన్న నినాదంతో దూకుడుగా వరుస విదేశాంగ విధానాల అమలు ప్రారంభించారు. 1965లో 30 సెప్టెంబరు ఉద్యమం జాతి వివక్షాపూరితం, వామపక్ష వ్యతిరేకం అయిన అల్లర్లకు దారితీసింది. ఈ పరిణామాలతో 1967లో ఆయన సైన్యాధ్యక్షుల్లో ఒకరైన సుహార్తో ఆయనను తప్పించి పాలనా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి మరణించేవరకూ గృహనిర్బంధంలో సుకర్ణో గడిపారు.

నేపథ్యం మార్చు

జపనీస్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, సంపన్నుడు అయిన రాడెన్ సూకెమి సొస్రోదిహార్ద్జో, అతని బ్రాహ్మణ కులస్తురాలైన బాలి జాతి భార్య అయు న్యొమాన్ రాయ్ లకు సుకర్ణో డచ్ ఈస్టిండీస్ (ప్రస్తుతం ఇండోనేషియా)లోని తూర్పు జావాకు చెందిన సురాబయా వద్ద జన్మించారు. ఆయన జన్మనామం కుస్నో[4]IPA: [kʊsnɔ]. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యం పాలై బతికి బట్టకట్టిన పిల్లలకు తిరిగి పేరుపెట్టే జపనీయుల సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చారు. 1912లో స్థానిక ప్రాథమిక పాఠశాలలో పట్టభద్రుడయ్యాకా యూరోపీస్చె లాగెరె స్కూల్ (డచ్-ప్రాథమిక పాఠశాల)లో చదువుకునేందుకు మొజొకెర్తో పంపించారు. 1916లో డచ్-కాలేజ్ ప్రిపరేటరీ స్కూల్ అయిన హొగెరె బర్గెర్ స్కూల్లో చదువుకునేందుకు సురబయకు పంపగా అక్కడే ఇండోనేషియా జాతీయవాది, సరెకత్ ఇస్లాం స్థాపకుడు అయిన జొక్రోమినొతొను కలిశారు. 1920లో సుకర్ణో జొక్రొమినొతొ కుమార్తె సితి ఓతారిని వివాహం చేసుకున్నారు. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ బందుంగ్ (బందోంగ్ సాంకేతిక విద్యాసంస్థ), బందుంగ్ లో విద్యాభ్యాసం ఆరంభించారు. అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటూ, తన దృష్టి అందులో ఆర్కిటెక్చర్ మీద నిలిపారు. తను నివాసం ఉంటున్న బోర్డింగ్ హౌస్ యజమాని సనోసి భార్య ఇంగిత్ గర్నాసియ్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నారు. ఇంగిత్ సుకర్ణో కన్నా 13 సంవత్సరాల పెద్ద. సుకర్ణో మొదటి భార్య సితి ఓతారికి, ఇంగిత్ తన భర్త సనోసికి విడాకులిచ్చి వివాహం చేసుకున్నారు. సుకర్ణో తర్వాతికాలంలో ఇంగిత్ కి విడాకులు ఇచ్చి, ఫాత్మావతిని వివాహం చేసుకున్నారు.

సుకర్ణో 1926 మే 25న ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. జూలైలో ఆయన మిత్రుడు అన్వారితో కలిసి ఆర్కిటెక్చర్ సంస్థను స్థాపించారు. బందుంగ్ లో సుకర్ణో & అన్వారీ అన్న సంస్థ ఏర్పరిచారు. వారు అర్కిటెక్చర్ లో ప్లానింగ్, కాంట్రాక్ట్ సేవలు చేసేవారు.

ప్రాచుర్య సంస్కృతిలో మార్చు

పుస్తకాలు మార్చు

  • కువాంటర్ కె గెర్బాంగ్, రామధన్.కె.హెచ్. రాసిన ఇండోనేషియన్ నవల, దీనిలో సుకర్ణో, ఆయన రెండవ భార్య ఇంగిట్ గర్నాసియల మధ్య శృంగారాన్ని, అనుబంధాన్ని చిత్రీకరించారు.

గీతాలు మార్చు

  • యుంతుక్ పడుకా జంగ్ ములియా ప్రెసిడెన్ సుకర్ణో (మహారాజశ్రీ ప్రెసిడెంట్ సుకర్ణోకి అన్న అర్థంతో ప్రారంభమౌతుంది) అన్న పాట 60ల తొలిదశకంలో సోయెతెద్జో రాయగా, ప్రఖ్యాత ఇండోనేషియన్ గాయని లిలిస్ సూర్యాని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. పాటలోని భావాలన్నీ అప్పటి ఆజీవిత అధ్యక్షుడైన సుకర్ణోను ప్రశంసిస్తూ సాగుతాయి.

సినిమాలు మార్చు

  • ఫిలిపినో నటుడు మైక్ ఎంపెరియో 1982లో పీటర్ వైర్ దర్శకత్వం వహించిన ద ఇయర్ ఆఫ్ లివింగ్ డేంచరెస్లీలో సుకర్ణో పాత్ర పోషించారు. అదే పేరుతో క్రిస్టఫర్ కోచ్ రాసిన నవలను ఈ సినిమాకు అడాప్ట్ చేశారు.
  • ఇండోనేషియన్ సామాజికవేత్త, రచయిత ఉమర్ ఖయాం 1982 నాటి రెండు సినిమాలు ఆరిఫిన్ సి.నోయెర్ దర్శకత్వం వహించిన పెంగ్ఖైనతన్ జి ఎస్/పికెఐ, జకార్తా 66 అన్న సినిమాల్లో సుకర్ణో పాత్ర పోషించారు.
  • ఇండోనిషియన్ నటుడు ఫ్రాన్స్ తుంబున్ 1997లో బ్లాంకో, ద కలర్ ఆప్ లైఫ్ (అపి సింతా అంతానియో బ్లాంకో అన్న టీవీ సీరియల్ ఆధారంగా) అన్న సినిమాలో సుకర్ణో పాత్రలో నటించారు. బాలి, ఇండోనేషియాల్లో నివసించిన స్పానిష్ పెయింటర్ అంటానియో బ్లాంకో జీవితం ఆధారంగా ఆ సినిమా తీశారు.
  • ఇండోనేషియన్ నటుడు సుల్తాన్ సలాదిన్ 2005లో రిరి రిజా దర్శకత్వం వహించిన గీ సినిమాలో సుకర్ణో పాత్ర పోషించారు. ఆ సినిమా సో హోక్ గీ అనే విద్యార్థి ఆందోళన కారుని జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించారు.
  • భవిష్యత్తులో రానున్న 9 రీజన్స్ అన్న సినిమాలో ఇండోనేషియన్ నటుడు టియో పకుసదెవో సుకర్ణో పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా సుకర్ణో వైవాహిక జీవితం ఆధారంగా ఉంటుంది. ఆయన జీవితంలోని 9 మహిళలు ఓతారీ (అచా సెప్త్రిసా నటించారు); ఇంగిట్ గర్నసియ్ (హ్యాపీ సల్మా); ఫత్మావతి (రెవలినా సయుతి తెమాత్); హర్తిని (లోలా అమారియా); హర్యాతీ; కర్తిని మనొప్పొ (వులన్ గురిత్నొ); రత్న సరి దేవి (మరియానా రెనాతా); యురికె సాంగర్ (పెవితా పేర్స్)లత ఆయన జీవితాలను ప్రతిబింబిస్తూ తీశారు. 2012లో వచ్చిన మరో జీవిత చరిత్ర హెబిబీ డన్ ఐనున్ లో టియో పకుసదెవో సుకర్ణో మంత్రివర్గ సహచరుల్లో ముఖ్యుడు, పదవికి ఆయన వారసుడు అయిన సుహార్తో పాత్రను కూడా పోషించడం విశేషం.
  • ఇండోనేషియా నటుడు ఐరో భయు 2013లో విడుదలైన సుకర్ణో:ఇండోనేషియా మెర్దెకా అన్న సినిమాలో సుకర్ణో పాత్ర పోషించారు. ఈ సినిమాకు హనుంగ్ బ్రమంత్యో దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సుకర్ణో పుట్టుక నుంచీ ఇండోనేషియా జపాన్ నుంచి స్వాతంత్ర్యం వహించడం వరకూ ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకున్నారు.
  • 2013లో విడుదలైన కెతికా బంగ్ ది ఎండెలో ఇండోనేషియన్ నటుడు బైమ్ వాంగ్ సుకర్ణో పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఎండె, ఫ్లోరెస్ ద్వీపాల్లో సుకర్ణో ప్రవాస జీవితాన్ని ప్రధానంగా తీసుకుని తీశారు.
  • ఇండోనేషియన్ నటుడు, బుల్లితెర ప్రముఖుడు డి.మహేంద్ర 2015 సినిమా గురు బంగ్సా:జోక్రోమినొటొలో సుకర్ణో పాత్ర పోషించారు. సుకర్ణో సహా పలువురు ఇండోనేషియా స్వాతంత్ర్యోద్యమ ప్రముఖులకు గురువు, స్వయంగా ఇండోనేషియా జాతీయోద్యమకారుడు అయిన ఓమర్ సయద్ జోక్రోమినొటొ జీవిత చరిత్ర చిత్రం ఇది.

Notes మార్చు

  1. A. Setiadi (2013), Soekarno Bapak Bangsa, Yogyakarta: Palapa, pp. 21.
  2. Biografi Presiden Archived 2013-09-21 at the Wayback Machine Perpustakaan Nasional Republik Indonesia
  3. Pramoedya ananta Toer, SOEKARNO, TIME Asia story TIME 100: AUGUST 23-30, 1999 VOL. 154 NO. 7/8, http://edition.cnn.com/ASIANOW/time/asia/magazine/1999/990823/sukarno1.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-23. Retrieved 2016-11-29.
"https://te.wikipedia.org/w/index.php?title=సుకర్ణో&oldid=3687226" నుండి వెలికితీశారు