సుకాంత కుమార్ నాయక్

సుకాంత కుమార్ నాయక్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో నీలగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సుకాంత కుమార్ నాయక్
సుకాంత కుమార్ నాయక్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
ముందు ప్రతాప్ చంద్ర సారంగి
నియోజకవర్గం నీలగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1966-04-24) 1966 ఏప్రిల్ 24 (వయసు 58)
రాజకీయ పార్టీ బిజు జనతాదళ్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్ (తండ్రి)
జీవిత భాగస్వామి సంజుక్తా రౌత్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

సుకాంత కుమార్ నాయక్ బిజు జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీలగిరి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుష్మా బిస్వాల్‌ పై 13,700 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు బీజేడీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1]

సుకాంత కుమార్ నాయక్ 2019 ఎన్నికలలో నీలగిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అబ్యర్ధి సంతోష్ ఖతువాపై 1,577ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2024 ఎన్నికలకు ముందు 2024 మార్చి 29న బీజేపీని వీడి మార్చి 31న బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్‌లో బీజేడీ సీనియర్ నేత ప్రతాప్ కేశరి డియో, రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్రా సమక్షంలో బిజు జనతాదళ్ పార్టీలో చేరాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. "Naveen Patnaik loses 3 MLAs to BJP ahead of polls in Odisha" (in ఇంగ్లీష్). 22 March 2019. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. ThePrint (31 March 2024). "Odisha: BJP MLA Sukanta Nayak joins BJD". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  3. The Week (31 March 2024). "Odisha BJP MLA Sukanta Nayak joins BJD" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  4. ETV Bharat News (31 March 2024). "Odisha: BJP MLA Sukanta Nayak Joins BJD" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.