ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో సుకుమ జిల్లా ఒకటి. ఛత్తీస్‌గఢ్‌కు దక్షిణాన ఈ జిల్లా ఉంది. ఈ జిల్లా సరిహద్దులలో బస్తరు, దెంతెవాడ, బిజాపూర్ జిల్లాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు కూడా సుకుమా జిల్లాకు ఉన్నాయి. సుకుమ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ నుండి 400 కి.మీ. దూరమ్లో ఉంది.

సుకుమ జిల్లా
ఛత్తీస్‌గఢ్ జిల్లా
ఛత్తీస్‌గఢ్‌లో సుకుమ జిల్లా
ఛత్తీస్‌గఢ్‌లో సుకుమ జిల్లా
దేశంభారత దేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
Area
 • మొత్తం5,897 km2 (2,277 sq mi)
Time zoneUTC+05:30 (IST)

2012 జనవరి 12 న దెంతెవాడ జిల్లా నుండి కొంత భాగాన్ని విడదీసి ఈ జిల్లాని ఏర్పరచారు. ఉప ఉష్ణమండల అరణ్యాలతో నిండి ఉంటుంది. గిరిజన తెగ అయిన గోండులు ఈ జిల్లాలో ప్రధానంగా ఉంటారు. జిల్లా జనాభాలో 85% పైగా గిరిజనులే. జిల్లా విస్తీర్ణంలో 65% భాగం అడవులే. చ.కి.మీ.కు 45 మంది ప్రజలతో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉంది. 29% అక్షరాస్యతతో దేశంలో కెల్లా అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలో ఇది ఒకటి. శబరి నది, జిల్లా గుండా ప్రవహించే ప్రధానమైన నది.

ప్రయాణ వసతులు మార్చు

సుకుమ పట్టణాన్ని జాతీయరహదారి - 221 జగదల్‌పూర్‌తో అనుసంధానం చేస్తుంది. జాతీయ రహదారి-30, రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్తో సుకుమను కలుపుతుంది. సుకుమ జిల్లాకు ఒడిషా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

సుకుమ నుండి రాయ్‌పూర్ కు బస్సులు నడుస్తున్నాయి. జగదల్‌పూర్, దంతేవాడ, మల్కనగిరి, హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడలకు సుకుమ నుండి బస్సులు తిరుగుతాయి.

దంతేవాడ, జగదల్‌పూర్ రైల్వేస్టేషన్లు సుకుమకు దగ్గరలోని రైల్వే స్టేషన్లు. జగదల్‌పూర్ విమానాశ్రయం 100 కి.మీ., దూరంలో ఉంది. ఇక్కడి నుండి విశాఖపట్నం, భుబనేశ్వర్ లకు విమాన సౌకర్యం ఉంది.