సుజయ్ పాల్
జస్టిస్ సుజయ్ పాల్ (జననం 21 జూన్ 1964) భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను మధ్యప్రదేశ్ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయగా, మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[1][2]
సుజయ్ పాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 26 మార్చి 2023 | |||
నియమించిన వారు | ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 2014 ఏప్రిల్ 14 – 25 మార్చి 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మధ్యప్రదేశ్ | 1964 జూన్ 21
వృత్తి జీవితం
మార్చుసుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించిన ఆయన లా పూర్తిచేసి 1990లో న్యాయవాదిగా మధ్యప్రదేశ్ హైకోర్టులో బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆయన జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టులో సివిల్, రాజ్యాంగ పక్షాలు, సర్వీస్ విషయాలపై ప్రాక్టీస్ చేసి, 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.
జస్టిస్ సుజయ్ పాల్ తన కుమారుడు మధ్యప్రదేశ్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన తర్వాత మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్ధించగా ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం 2024 ఫిబ్రవరి 13న ఆమోదించింది.
జస్టిస్ సుజయ్ పాల్ తన కుమారుడు మధ్యప్రదేశ్ కోర్టులో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన తర్వాత మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్ధించగా ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం 2024 ఫిబ్రవరి 14న ఆమోదించింది. ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 18న నోటిఫికేషన్ జారీ చేసింది.[3][4]
మూలాలు
మార్చు- ↑ NT News (27 March 2024). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్ ప్రమాణం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ Andhrajyothy (27 March 2024). "హైకోర్టు జడ్జిగా సుజయ్ పాల్ ప్రమాణ స్వీకారం". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ Eenadu (19 March 2024). "హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
- ↑ Andhrajyothy (19 March 2024). "రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఇద్దరు జడ్జిలు". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.