సుజాతా మోహపాత్ర

సుజాతా మోహపాత్ర (జననం జూన్ 27, 1968) ప్రముఖ భారతీయ ఒడిస్సీ నృత్య కళాకారిణి.[1][2]

నృత్యం చేస్తున్న సుజాత.

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం మార్చు

1968లో ఒడిశాలో బాలాసోర్ లో జన్మించింది సుజాత. చాలా చిన్నతనంలోనే గురు సుధాకర్ సాహు వద్ద ఒడిస్సీలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది ఆమె.[3]

1987లో భువనేశ్వర్ వచ్చిన ఆమె,[4] పద్మవిభూషణ్ గ్రహీత గురు కెలుచరణ్ మోహపాత్ర వద్ద ఒడిస్సీ రీసెర్చి సెంటర్ లో ఒడిస్సీ నృత్యంలో శిక్షణ కొనసాగించింది సుజాత. గురు కెలుచరణ మోహపాత్ర కుమారుడు  రతికాంత్ మోహపాత్రను వివాహం చేసుకుంది ఆమె.[5] ఆ దంపతుల కుమార్తె ప్రీతిషా మోహపాత్రా కూడా ఒడిస్సీ నృత్య కళాకారిణి.

కెరీర్ మార్చు

సుజాత నృత్యం నేర్చుకున్న కొన్నాళ్ళకు సుధాకర్ సాహూ యొక్క డ్యాన్స్ ట్రూప్ తో కలసి ఒడిస్సీ సంప్రదాయ నృత్యాలు, జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చేది. గురు కెలుచరణ్ శిష్యరికంలో వైవిధ్యమైన శైలిని అలవరచుకున్న సుజాత, ఒడిస్సీ నృత్య కళాకారిణిల్లో ప్రముఖురాలిగా స్థానం సంపాదించుకుంది.[6]

మూలాలు మార్చు

  1. Orissi performance by Sujata Mohapatra Archived 2012-03-28 at the Wayback Machine The South Asian Times, March 12, 2007.
  2. Sujata Mohapatra review
  3. Sudhakar Sahu: First Guru of Sujata Mohapatra Archived 2012-11-10 at the Wayback Machine The Hindu
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-12-28. Retrieved 2017-05-03.
  5. Mehta, Kamini. "Odissi dancer Sujata Mohapatra mesmerizes school students". Times of India. Retrieved 19 December 2015.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-02. Retrieved 2017-05-03.