సుజాతా రామదొరై

కర్ణాటకకు చెందిన విద్యావేత్త

సుజాతా రామదొరై బెంగుళూరులో పెరిగింది. ఆమె కుటుంబంలో విద్యావేత్తలు లేనప్పటికీ ఆమె తల్లితండ్రులు ఆమెను చదివించడానికి ముఖ్యత్వం ఇచ్చారు. ఆమె విద్యావేత్తగా ఎదగడానికి ప్రేరణ ఇచ్చిన వారిలో వారి అమ్మమ్మ కూడా ఒక్కరు. ఆమెకు విఙానతృష్ణ అధికంగా ఉన్నప్పటికీ చదుకోవడానికి అవకాశం లభించలేదు. ఆమె సాధించలేని విద్యను మనుమల సంతానంలో ఙానదీపికలను వెలిగించడానికి దోహదం చేసింది.

సుజాతా రామదొరై
వృత్తిమహిళా శాస్త్రవేత్త

మాథమెటిక్స్ మార్చు

సుజాతా రామదొరై స్కూలులో చదివే రోజులలో మాథమెటిక్స్ అంటే భయపడేది. అసలు ఎవరైనా మాథమెటిక్స్ ఎలా చేస్తారో? అని కూడా ఆలోచించేది. అయినప్పటికీ " ది కమర్షియల్ సక్సెస్ ఆఫ్ జాన్ నాష్'స్ లైఫ్ హిస్టరీ " చదివిన తరువాత, " ఎ బ్యూటిఫుల్ మైండ్ " చిత్రం చూసిన తరువాత మాథమెటికల్ నాలెడ్జ్ అంటే మక్కువ ఏర్పడింది. ప్రాథమిక స్థాయిలోనే ఆథమెటిక్స్ అంటే భయం స్థానంలో మక్కువ ఏర్పడింది. కొంచం అర్ధం చేసుకుంటే చాలు ఎవరైనా చక్కగా మాతమెటిక్స్‌లో ఉన్నతస్థాయిలో ఉత్తీరత సాధించవచ్చని అర్ధం చేద్కున్నది. ఉన్నత పాఠశాల స్థాయిలో ఆమెకు లభించిన ఉపాధ్యాలు అంకితభావంతో బోధించడం ఆమెకు ఎంతో ఉపకరించింది.

ఉన్నత పాఠశాల మార్చు

సుజాతా రామదొరై వేసవి శలవులలో కూడా సిటీ లైబ్రరీ నుండి తరువాత సంవత్సరం పుస్తకాలను తీసుకువచ్చి అధ్యయనం చేసుంది. తరువాత సంవత్సరం తరగతిలో మాథమెటిక్స్, ఆంగ్లంలో అందరికంటే ముందు స్థానంలో ఉండడం సాధ్యమైంది.

'కాలేజి మార్చు

1979లో ఉన్నత చదువులు కొనసాగించడానికి ఇప్పటిలా సలహాలు కాని సమాచారం కాని లభించేది కాదు. ఇంజనీరింగ్ కాలేజిలో స్థానం లభించడం అంతసులువు కాదు. అయినప్పటికీ కంప్యూటర్ విభాగంలో ఇంజనీరిగ్ పట్టాపుచ్చుకుంటే మాత్రం సౌకర్యవంతమైన జీవితానికి గ్యారంటీ ఉండేది. ఆసమయంలో మహిళలు అంతగా ఇంజనీరింగ్ చేసేవారు కాదు. అందుకని సుజాతా రామదొరై కుటుంబం ఆమెను ఏదైనా డిగ్రీ చదవమని సలహా ఇచ్చారు. తరువాత సుజాతా రామదొరై తాను ఆరాధించే మాథనెటిక్స్ చేయడానికి నిశ్చయించుకున్నది. ప్రి యూనివర్శిటీ అయిన తరువాత సహవిద్యార్థుల నిరుత్సాహపరచిప్పటికీ లక్ష్యపెట్టక ఇంజనీరింగ్, మెడికల్ గురించి ఆలోచించక ఆమె మాథమెటిజ్స్ డిగ్రీ చేయాలని అనుకున్నది.

వివాహం మార్చు

సుజాతా రామదొరైకు డిగ్రీ పూర్తిచేయక మునుపే వివాహం జరిగింది. వివాహం తరువాత కరెస్పాండెస్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసింది. అయినప్పటికీ రీసెర్చ్ చేయాలన్న సంకల్పం మాత్రం ఆమెలో అలాగే బలంగా ఉండిపోయింది. ఆమె భర్తతో ముంబయికి వెళ్ళిన తతువాత కొంతమంది ఆమెకు " టాటా ఇంస్టిట్యూట్‌ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ " గురించిన విషయం తెలియజేసారు. తరువాత ఆమె " టి.ఐ.ఎఫ్.ఆర్" ప్రకటన చూసి పి.హెచ్.డి చేయడానికి అభ్యర్థించింది. ఆమె అక్కడ ప్రొఫెసర్ పరిమళారామన్ మార్గదర్శకత్వంలో పూర్తిచేసింది. పి.హెచ్.డి తరువాత ఆమె అక్కడ ఉద్యోగబాధ్యతలు స్వీకరించింది. సుజాతా రామదొరై రీసెర్చ్ ప్రధానాంశం " ఆల్జీబ్రాయిక్ థియరీ ఆఫ్ ఆర్థిమెటిక్ ఫాంస్ ". చివరి దశాబ్ధంలో ఎలిపిక్ కర్వుల మీద ఆర్థిమెటిక్ జామెంట్రీ గురిచి ఆమె పరిశోధన చేపట్టింది. సహకారంతో పనిచేయడం వలన రీసెర్చ్ విదూఅర్ధులు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి మరింత తెలుసుకోవడానికి సహకరిస్తుంది.

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.