సుజాత మోహన్ (వైద్యురాలు)
సుజాత మోహన్ ఒక భారతీయ కంటి వైద్యురాలు. చెన్నైకి చెందిన ఆమె ఆ ప్రాంతంలో ఉచిత కంటి సంరక్షణను అందించే దాతృత్వ కృషికి ఆమె నారి శక్తి పురస్కార్ అవార్డుతో గుర్తింపు పొందింది.[1]
సుజాత మోహన్ | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | వైద్యురాలు |
కెరీర్
మార్చుసుజాత మోహన్ తమిళనాడులోని చెన్నైలో శంకర నేత్రాలయ అనే కంటి ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. డాక్టర్ మోహన్ రాజన్, రాజన్ ఐ కేర్ హాస్పిటల్ ఛైర్మన్ అండ్ మెడికల్ డైరెక్టర్ కాగా, సుజాత మోహన్ దానికి ఎగ్జిక్యూటివ్ మెడికల్ డైరెక్టర్.[2] ఈ ఆసుపత్రిలో చెన్నై విజన్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద విభాగం ఉంది, ఇది దక్షిణ భారతదేశంలో కంటి దృష్టిని మెరుగుపరచగల కార్యకలాపాలను నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.[3] ఈ ట్రస్ట్ చెన్నైతో సహా కాంచీపురం, తిరువళ్ళూర్, తిరువణ్ణామలై, వెల్లూర్, విల్లుపురం మొదలైన ప్రాంతాల్లో 3,500కి పైగా కంటి పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వారు ఒక మిలియన్ మంది వరకు ప్రజల కళ్ళను పరీక్షించారు, దీని ఫలితంగా 100,000 కంటిశుక్లం ఆపరేషన్లు, 7,000 కార్నియల్ మార్పిడి, 300,000 జతల అద్దాల సరఫరా జరిగింది. కంటిశుక్లం ఆపరేషన్లలో రోగి కళ్ళలో లెన్స్ అమర్చడం జరుగుతుంది, ఈ సేవ రోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా అందించబడింది. కార్నియల్ కంటి మార్పిడికి నిధులు సమకూర్చిన రోటరీ క్లబ్, వాహనం లోపల కంటి ఆపరేషన్లు నిర్వహించగలిగేలా ఒక వ్యాన్ సహాయంతో ఇది సాధ్యమైంది.[3][4]
ఆమెకు 2019 మార్చి 8న నారి శక్తి పురస్కార్ లభించింది. 2018 సంవత్సరానికి గాను ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి అధ్యక్ష భవనంలో ప్రదానం చేసాడు.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుఆమె శంకర నేత్రాలయలో తన సీనియర్ అయిన డాక్టర్ మోహన్ రాజన్ ని 1987 ఆగస్టు 19న వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు.
మూలాలు
మార్చు- ↑ Staff Reporter (2019-03-12). "Nari Shakti Puraskar presented". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-01-05.
- ↑ "Your eyes are his family problem". web.archive.org. 2024-06-23. Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 3.0 3.1 "Dr Sujatha Mohan: A woman's winning vision for the poor". The New Indian Express. Retrieved 2021-01-05.
- ↑ Pyarilal, Vasanth (2019-08-03). "A Visionary for all to see: Dr.Mohan Rajan & Dr. Sujatha Mohan - By Sanjay Pinto | RITZ" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-05.
- ↑ "Nari Shakti Puraskar - Gallery". narishaktipuraskar.wcd.gov.in. Retrieved 2020-04-11.