ప్రధాన మెనూను తెరువు
  ?Tiruvannamalai

తిరువణ్ణామలై
తమిళనాడు • భారతదేశం

తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర ఆలయం
తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర ఆలయం
Tiruvannamalai తిరువణ్ణామలైను చూపిస్తున్న పటము
తమిళనాడు రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటము
Location of Tiruvannamalai తిరువణ్ణామలై
 [http://maps.google.com/maps?ll=30.22,86.07&spn=0.1,0.1&t=h Tiruvannamalai

తిరువణ్ణామలై] 

అక్షాంశరేఖాంశాలు: 30°13′N 86°04′E / 30.22°N 86.07°E / 30.22; 86.07Coordinates: 30°13′N 86°04′E / 30.22°N 86.07°E / 30.22; 86.07
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 171 మీ (561 అడుగులు)
జిల్లా(లు) Tiruvannamalai జిల్లా
జనాభా 1,49,301 (2011 నాటికి)
Municipal chairman R. Sridharan
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 606 (601, 602, 603, 604)
• +91-4175
• TN 25

తిరువణ్ణామలై (తమిళం: திருவண்ணாமலை) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువణ్ణామలై జిల్లాలో ఒక పుణ్య క్షేత్రము మరియు మునిసిపాలిటి. ఇది తిరువణ్ణామలై జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణామలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువణ్ణామలైతో చాలా యోగులకి సిద్ధులకి[1] సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువణ్ణామలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం.

పుణ్య క్షేత్రంసవరించు

 
గుడిలో భక్తులు

తిరువణ్ణామలై పంచ భూత క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు చిదంబరం, శ్రీ కాళహస్తి, తిరువనైకోవిల్ మరియు కంచి వరుసగా ఆకాశము, గాలి, నీరు మరియు భూమిని సూచిస్తాయి.

ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు.[2]

ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ వట్టి కాళ్ళతో ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధిస్తారు. ఈ ప్రదక్షిణ 14 కి.మీ. ఉంటుంది.[3]. ప్రతి ఏడాది, తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర పౌర్ణమి రాత్రి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తారు. 2016 లో గిరి ప్రదక్షిణ తేదీలు: జనవరి 23 (శని), ఫిబ్రవరి21 (ఆది), మార్చి 22 (మంగళ), ఏప్రియల్ 21 (గురు), మే 21 (సని), జూన్ 19 (శని), జూలై 19 (మంగళ), జూలై 30 (మంగళ), ఆగస్టు 17 (గురు), సెప్టెంబరు 16 (శుక్ర), అక్టోబరు 15 (శని), నవంబరు 13 (ఆది), డిశంబరు 13 (మంగళ)

అద్వైత వేదాంత గురువు రమణ మహర్షి తిరువణ్ణామలైలో 53 సంవత్సరాలు నివసించి 1950లో పరమపదించారు. అయన ఆశ్రమం అయిన శ్రీ రమణాశ్రమము అరుణాచల కొండ దిగువన, ఈ నగరానికి పశ్చిమాన ఉంది. శేషాద్రి స్వామి మరియు యోగి రామ్ సూరత్ కుమార్ ఈ నగరానికి చెందిన ఇతర గురువులకు ఉదాహరణలు.

భౌగోళిక స్థితిసవరించు

తిరువణ్ణామలై చెన్నైకి 185 కి.మీ. దూరంలోను, బెంగళూరుకి 210 కి.మీ. దూరంలోను ఉంది. తెన్పెన్నై నది మీద ఉన్న సాతనుర్ ఆనకట్ట తిరువణ్ణామలై దగ్గరలోని పర్యాటక ప్రదేశం. అరుణాచల కొండ ఎత్తు దాదాపు 1,600 అడుగులు.

జనాభాసవరించు

As of 2001భారత జనాభా లెక్కల ప్రకారం[4], తిరువణ్ణామలై జనాభా 130,301. వీరిలో పురుషులు 53%, మహిళలు 47% మంది ఉన్నారు. తిరువణ్ణామలై యొక్క సగటు అక్షరాస్యత రేటు 74%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 80%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 63%. తిరువణ్ణామలై జనాభాలో 9% మంది 6 సంవత్సరాల లోపు వయస్సులో ఉన్నారు.

పర్యాటకరంగంసవరించు

 
అరుణాచలేశ్వర గుడి గోపురాలు

అరుణాచల క్షేత్రంసవరించు

శివుని గుడి తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ రాజులచే 9వ మరియు 10వ శతాబ్దాల మధ్యలో నిర్మింపబడింది. ఈ క్షేత్రం చాలా పెద్ద గోపురాల వల్ల ప్రసిద్ధి చెందింది.[5] క్రి. శ. 9వ శతాబ్ద కాలంలో రాజ్యమేలిన చోళ రాజుల శిలాశాసనాల వల్ల ఈ విషయం తెలుస్తున్నది.

11 అంతస్తుల తూర్పు రాజ గోపురం 217 అడుగుల ఎత్తు ఉంది. కోట ప్రకారంలా ఉండే బలిష్టమైన గోడల నుండి చొచ్చుకు వచ్చే నాలుగు గోపురాలు, ఈ మందిర సముదాయానికి భీకర ఆకారాన్ని ఇస్తాయి. పై గోపురము, తిరుమంజన గోపురము మరియు అన్ని అమ్మాళ్ గోపురము ఈ ప్రాకారానికి ఉన్న మిగిలిన గోపురాలు. విజయ నగరాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు వేయి స్తంభాల శాలను, కోనేరును నిర్మించాడు. ప్రతి ప్రకారము ఒక పెద్ద నందిని, వల్లల మహారాజ గోపురము, కిల్లి గోపురము వంటి చాలా గోపురాలను కలిగి ఉంటుంది.

పంచ భూతాలను సూచించే పంచభూత స్థలాలలో ఇది ఒకటి. పంచ భూత స్థలాలో ఇది తేజో క్షేత్రం - అగ్నిని సూచిస్తుంది. మిగిలినవి - తిరివన్నై కోవిల్ (ఆపః స్థలం - నీరు) కంచి (పృథ్వీ స్థలం - భూమి) శ్రీ కాళహస్తి (వాయు స్థలం - గాలి) చిదంబరం (ఆకాశ స్థలం - ఆకాశం).

రవాణాసవరించు

రహదారిసవరించు

రహదారులతో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి తిరువణ్ణామలై చేరుకోవచ్చు. ఈ నగరం పుదుచేరి - బెంగళూరు జాతీయ రహదారి (NH 66) చిత్తూరు - కడలూరు రాజ్య రహదారుల కూడలిలో ఉంది. తమిళనాడులోని ఇతర నగరాలు చెన్నై, వేలూరు, సేలం, విల్లుపురం, తిరుచి, మదురై, కోయంబత్తూరు, ఈరొద్, తిరుప్పురు, ఇంకా కన్యాకుమారి, మరియు ఇతర ప్రాంతాలైన తిరుపతి, బెంగళూరు, పుదుచేరి వంటి నగరాలకి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (TNSTC) తిరువణ్ణామలై నుండి బస్సులను నడుపుతుంది.

రైలు రవాణాసవరించు

వెల్లూరు నుండి విల్లుపురం వెళ్ళే రైలు మార్గంలో తిరువణ్ణామలై ఉంది. ప్యాసింజరు రైలులో ప్రయాణికులు వెల్లూరు లేదా విల్లుపురం వెళ్ళవచ్చు. (గేజు మార్పిడి పనుల కోసం ఈ మార్గంలో రైలు రాక పోకలను ప్రస్తుతం నిలిపి వేసారు.) దగ్గరలో ఉన్న పెద్ద రైల్వేస్టేషన్ 60 కి.మీ. దూరంగా ఉన్న విల్లుపురంలో ఉంది. తిరువణ్ణామలై నుండి టిండివనం మీదుగా చెన్నై వరకు కొత్త రైలు మార్గం నిర్మాణంలో ఉంది.

వాయు రవాణాసవరించు

చెన్నై (170 కి.మీ.) మరియు బెంగళూరు (200 కి.మీ.) అంతర్జాతీయ విమానాశ్రయాలు తిరువణ్ణామలైకి దగ్గరగా ఉన్న విమానాశ్రయాలు.

ఆర్థిక వ్యవస్థసవరించు

చెన్నై పట్టణానికి దగ్గరగా ఉన్నప్పటికీ తిరువణ్ణామలై లోను దీని చుట్టు పక్కల పెద్ద పరిశ్రమలు లేవు. అందువల్ల, ఈ జిల్లా వాసులు చెన్నై మరియు బెంగళూరు పట్టణాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు.

పరిపాలన మరియు రాజకీయాలుసవరించు

ఈ నగరం తిరువణ్ణామలై జిల్లా ప్రధాన కేంద్రం. తిరువణ్ణామలై శాసనసభ నియోజక వర్గం తిరువణ్ణామలై పార్లమెంటు నియోజక వర్గంలో భాగం[6]. తమిళనాడు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా ఉన్న శ్రీ ఇ. వి. వేలు తిరున్నమలైకి చెందిన వారే.ఇదివరటి గృహ నిర్మాణ మంత్రి కే. పిచ్చండి కూడా ఇక్కడి వారే. అరుణై ఇంజినీరింగ్ కాలేజి మరియు SKP ఇంజినీరింగ్ కాలేజి తిరువణ్ణామలై లోని ఖ్యాతి గాంచిన రెండు ఇంజినీరింగ్ కళాశాలలు.

సూచనలుసవరించు

  1. తిరువన్నమలై క్షేత్రం
  2. ద హిందూ : 10 లక్షల మంది తిరువన్నమలై జ్యోతిని దర్శించు కున్నారు
  3. దీన్ని గిరి వాళం అని కూడా అంటారు.తమిళనాడు పర్యాటక శాఖ వెబ్ సైటు లో తిరువన్నమలై
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help)
  5. రోమా బ్రద్నోక్ రాసిన దక్షిణ భారత దేశపు కర దీపిక
  6. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Retrieved 2008-10-08.

బాహ్య లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు