శ్రీమతి సునందినీ ఐప్ ఆకాశవాణిలో విద్యాప్రసారాల రూపకర్త.

అనంతపురంలో 1926 నవంబరులో జన్మించారు. బి.ఎ. బి.యిడి పూర్తి చేసి కొంత కాలం అధ్యాపకులుగ పనిచేశారు. 1972 లో ఆకాశ వాణి హైదరబాదు కేంద్రంలో విద్యా ప్రసార విభాగంలో ప్రొడ్యూసర్ గా చేరారు. విద్యాప్రసారాలను పటిష్ఠం చేసి బహుళ జనామోదం చేయడంలో కృత కృత్యులయ్యారు. విద్యాశాఖతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని విద్యా ప్రసారాల రూప కల్పనలలో కొత్త ఒరవళ్ళు సృష్టించారు. ఎన్.వి.ఎస్. రామారావు (అనౌన్సర్) గా వీరి శాఖకు సహకారలందించారు. ఆయన 1995 లో హృద్రోగంతో హఠాన్మరణం చెందారు. రామారావు చక్కటి నటుడు. ఈలపాట రఘురామయ్య సన్నిహిత బంధువు. సునందిని 1984 నవంబరులో స్టేషను డైరక్టర్ గామైసూరులో పదవీ బాధ్యతలు స్వీకరించి అదే నెలాఖరులో పదవీ విరమణ చేశారు. ఆమె ఇప్పుడు హైదరాబాదులు స్థిర పడ్డారు. చక్కటి వాచకం గల వ్వక్తి సునందిని.