సునీల్ పాల్
సునీల్ పాల్ భారతదేశానికి చెందిన సినిమా, వాయిస్ నటుడు.[1] ఆయన స్టార్ వన్‌లో ప్రసారమైన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ లో విజేతగా నిలిచాడు.[2] సునీల్ పాల్ 2010లో సిరాజ్ ఖాన్, జానీ లీవర్, రాజు శ్రీవాస్తవ్, కపిల్ శర్మ, నవీన్ ప్రభాకర్, అహ్సాన్ ఖురేషీ వంటి 51 మంది స్టాండ్-అప్ హాస్యనటులతో భావ్నావో కో సంజో సినిమాకు దర్శకత్వం వహించాడు.[3]
సునీల్ పాల్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | స్టేజి కామెడీ |
జననం, విద్యాభాస్యం
మార్చుసునీల్ పాల్ 1975 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతి తాలూకాలోని ముర్సా గ్రామంలో మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి భారతీయ రైల్వేలో ఉద్యోగి. సునీల్ పాల్ బల్హర్షాలోని జనతా విద్యాలయ సిటీ బ్రాంచ్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి 1995లో తన తండ్రికి బదిలీ కావడంతో ముంబై వచ్చి అక్కడే జూనియర్ కాలేజీలో చేరాడు.[4]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాలు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2004 | హమ్ తుమ్ | ||
2006 | ఫిర్ హేరా ఫేరి | మున్నా భాయ్ సైడ్‌కిక్ | |
2006 | అప్నా సప్నా మనీ మనీ | మఠ ప్రసాద్ సహాయకుడు | |
2007 | బాంబే టు గోవా | లాల్ సింగ్ | |
2008 | క్రేజీ 4 | టాక్సీ యాదవ్ | |
2010 | భవనో కో సంఝో | సుందర్‌లాల్ యాదవ్ | దర్శకుడు కూడా |
2014 | కిక్ | ||
2014 | మనీ బ్యాక్ గ్యారెంటీ | దర్శకుడు కూడా | |
2015 | ససు చ స్వయంవర్ | బాజీ | మరాఠీ సినిమా |
2015 | మై హూ రజనీకాంత్ | అరవింద్ ముఖర్జీ ది ఖాస్ ఆద్మీ | |
2015 | డర్టీ పాలిటిక్స్ | నాథు లాల్ | |
2018 | తేరీ భాభీ హై పగ్లే | ||
2019 | విగ్ బాస్ | ||
2019 | శర్మ జీ కి లాగ్ గయీ |
టెలివిజన్
మార్చుసంవత్సరం | క్రమ | పాత్ర | ఛానెల్ | గమనికలు |
---|---|---|---|---|
2005 | ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ - I | పోటీదారు (విజేత) | స్టార్ వన్ | |
2008 | కామెడీ ఛాంపియన్స్ | పోటీదారు | సహారా వన్ | |
2010 | కామెడీ సర్కస్ కీ సూపర్ స్టార్స్ | పోటీదారు | సోనీ టీవీ | ప్రియా మరాఠేతో |
మూలాలు
మార్చు- ↑ "Bharti Singh की Drugs Case में गिरफ्तारी पर बोले Comedian Sunil Pal और Raju Srivastava". Zee News Hindi. 2020-11-21. Retrieved 2021-01-30.
- ↑ "Sunil Pal gets candid about his upcoming film 'Lockdown To Unlock' | Hindi Movie News - Bollywood - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-30.
- ↑ Team, Tellychakkar. "Before Kis Kisko Pyaar Karoon and Bhavnao Ko Samjho, Kapil made his acting debut 13 years back with THIS movie, READ MORE". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2021-01-30.
- ↑ "Comedian Sunil Pal trapped by calling doctors as demons and impostors, FIR lodged - Oneindia". hindi.oneindia.com (in హిందీ). Retrieved 2021-05-06.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సునీల్ పాల్ పేజీ