సుప్రియా పఠారే
సుప్రియా పఠారే, మరాఠీ నాటకరంగ, టివి, సినిమా నటి.[1]
సుప్రియా పఠారే | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1995-ప్రస్తుతం |
జననం
మార్చుసుప్రియా పఠారే 1972, ఏప్రిల్ 8న మహారాష్ట్ర, ముంబై నగరంలోని శాండ్‌హర్స్ట్ రోడ్‌లోని ఉమర్‌ఖాడిలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుపఠారేకు వివాహమై ఇద్దరు పిల్లలు (ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) ఉన్నారు. వారంతా థానేలో స్థిరపడ్డారు.[2]
నటనారంగం
మార్చుపాఠశాల చదువునుండే నాటకాలలో చురుకుగా పాల్గొన్నది. 7వ తరగతిలో ఉన్నప్పుడు స్క్రిప్ట్ కూడా రాసింది. డార్లింగ్, డార్లింగ్ అనే మరాఠీ నాటకంతో ఆమె తన నటనావృత్తిని ప్రారంభించింది. పదహారు సంవత్సరాలపాటు అనేక నాటకాలలో నటించింది.[3] కామెడీ రియాలిటీ షో ఫు బాయి ఫూలో నటించడం ద్వారా సుప్రియ కమెడియన్‌గా కూడా తన ప్రతిభను చాటుకుంది. స్టాండప్ యాక్టర్‌గా నటించింది. తరువాత హోనర్ సన్ మే హ్య ఘర్చీ అనే మరాఠీ సీరియల్ లో నటించింది.[4] పుడ్చా పాల్ అనే మరాఠీ సీరియల్ లో కాంచన్‌మాలా రందీవే (నెగెటివ్ రోల్) చేసింది. రాజస్థాన్‌లో ఒక సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో తాను మూడు నెలలపాటు "బందీగా" ఉన్నానని, దివంగత శివసేన అధినేత బాల్ థాకరే జోక్యంతో తాను రక్షించబడ్డానని సుప్రియా పఠారే పేర్కొన్నది.[5]
సినిమాలు
మార్చు- దిలీ సుపారీ బైకొచ్చి (2008)
- అనోలఖి హే ఘర్ మాఝే (2009)
- ఫక్త్ లధ్ మ్హానా (2011)
- కరూయా ఉద్యాచి బాత్ (2011)
- బాలక్ పాలక్ (2012)
- బాల్కడు (2014)
- టైమ్ పాస్ (2014)
- టైంపాస్ 2 (2015)
- చి వా చి సౌ కా (2017)[6]
నాటకాలు
మార్చు- డార్లింగ్, డార్లింగ్
- హిచ్ మాఝీ రాణి
సీరియల్స్
మార్చు- శ్రీయుత్ గంగాధర్ తిప్రే టిప్రే
- హోనర్ సున్ మే హ్య ఘర్చీ (ఇంద్రయాణి గోఖలే)
- ఫూ బాయి ఫు (పోటీదారు)
- పుడ్చా పాల్ (కాంచనమాల రందీవే)
- మోల్కరిన్ బాయి - మోతీ తిచ్చి సవాలి (అంబిక)
- తిప్‌క్యాంచి రంగోలి (మాయి)
- శ్రీమంతఘర్చి సూర్య (దేవిక)
- పింజారా
- కులవధుడు
- జాగో మోహన్ ప్యారే (శోభా మహాత్రే)
- అస్సా మహేర్ నాకో గా బాయి! (సఖి తల్లి)
అవార్డులు
మార్చు- డార్లింగ్ డార్లింగ్ నాటకంలోని పాత్రకు నాట్య దర్పణ్ పురస్కారం
- ఉత్తమ అత్తగారుగా జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డ్స్ (2015)
మూలాలు
మార్చు- ↑ "पाठारे, केरकरने जिंकली विद्यार्थ्यांची मने". Maharashtra Times. 26 December 2015. Archived from the original on 2019-03-08. Retrieved 2022-06-13.
- ↑ "माझं घर". Maharashtra Times. 26 September 2015. Archived from the original on 2019-03-08. Retrieved 2022-06-13.
- ↑ "Journey of a lively actress". The Times of India. 29 June 2011. Retrieved 2022-06-13.
- ↑ "Supriya Pathare Biography". IMDb.com. Retrieved 2022-06-13.
- ↑ "Held "captive" by Rajasthan producer in 1995, says Marathi TV actress Supriya Pathare". India Today. 5 January 2011. Retrieved 2022-06-13.
- ↑ "Supriya Pathare". IMDb. Retrieved 2022-06-13.