సుబర్ణపూర్ జిల్లా

ఒడిశా లోని జిల్లా
(సుబర్నపూర్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో సుబర్నపూర్ జిల్లా (ఒరియా:ସୁବର୍ଣ୍ଣପୁର ଜିଲ୍ଲା) ఒకటి. సోనేపూర్ (ఒడిషా) జిల్లాకు కేంద్రంగా ఉంది. దీనిని సోనేపురి జిల్లా, సోనేపురియా జిల్లా అనికూడా అంటారు.

సుబర్నపూర్ జిల్లా
జిల్లా
సుబర్నపూర్ లోని లంకేశ్వరాలయం
సుబర్నపూర్ లోని లంకేశ్వరాలయం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రాంతంపశ్చిమ ఒడిశా
స్థాపన1993 ఏప్రిల్ 1
ప్రధాన కార్యాలయంసుబర్నపూర్
Government
 • కలెక్టరుR. P. Singh
 • పార్లమెంటు సభ్యుడుKalikesh Narayan Singh Deo, BJD
విస్తీర్ణం
 • Total2,284.4 కి.మీ2 (882.0 చ. మై)
జనాభా
 (2001)
 • Total5,41,835
 • జనసాంద్రత231/కి.మీ2 (600/చ. మై.)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
767 xxx
టెలిఫోన్ కోడ్+91 665x
Vehicle registrationOD 31
సమీప పట్టణంBalangir
లింగ నిష్పత్తి1000:966 /
అక్షరాస్యత64.07%
లోక్ సభ నియోజకవర్గంBolangir
Vidhan Sabha constituency2, (Sonepur, Birmaharajpur)
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,443.5 మిల్లీమీటర్లు (56.83 అం.)
Avg. annual temperature30 °C (86 °F)
సగటు వేసవి ఉష్ణోగ్రత45 °C (113 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత24 °C (75 °F)

చరిత్ర

మార్చు

10-11 శతాబ్ధాలలో సుబర్నపూర్ పశ్చిమలంకగా పిలువబడిందని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. .[1][2] సుబర్నపూర్ ప్రాంతానికి చెందిన సోమవంశానికి చెందిన సోమేశ్వరదేవ వ్రాయించిన తామ్రపత్రాలు ఇందుకు ఆధారంగా ఉన్నాయి.[3] రాజకుమారుడు తనకుతానే పశ్చిమలంకకు రాజుగా ప్రకటించుకున్నాడు. మహాద తామ్రపత్రం ఆధారంగా కుమార సోమసుందరదేవ పాలనలో పశ్చిమలంక సమీపంలో ఉన్న చిత్రోపల నదీతీరప్రాంతం కూడా ఉండేదని భావిస్తున్నారు. పశ్చిమ లంకలో ఉన్న దేవతను లంకేశ్వరీదేవి అంటారు.[4] సోమవంశస్థుల పాలనా కాలంలోనే ఈ ప్రాంతం సుబర్నపూర్ అని పిలువబడింది. 1993లో ఈ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సుబర్నపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

డివిజన్లు

మార్చు
  • సబ్ డివిజన్లు: సోనేపూర్ (ఒడిషా),, బిర్మహరాజాపూర్
  • తాలూకాలు: సోనేపూర్ ( ఒడిషా), బినిక, రాంపూర్, బిర్మహరాజాపూర్, తర్భా, ఉల్లుండ.
  • బ్లాక్స్: సోనేపూర్ (ఒడిషా), బినిక, తర్భా, దుంగూరిపలి, బిర్మహరాజాపూర్, ఉల్లుండ.
  • మున్సిపాలిటీ: సోనేపూర్ (ఒడిషా)
  • ఎన్.ఎ.సి., బింకె.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 652,107,[6]
ఇది దాదాపు. మొంటెనెగ్రొ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. వర్మొంట్ నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 512 వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 279 .[6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.35%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 959:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 74.42%.[6]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

సంస్కృతి

మార్చు

సుబర్నపూర్ జిల్లా సాంస్కృతిక సంపద కలిగిన ప్రాంతంగా గుర్తించబడుతుంది. కళలు, హస్థకళలకు సుబర్నపూర్ ప్రత్యేకత కలిగి ఉంది. ప్రస్తుతం ఇక్కడ వస్త్రాల తయారీ, ఇత్తడి వస్తువుల తయారీ, తర్బ, బింకాకు చెందిన ఫిలిగ్రీ వస్తువులు, సోనేపూర్ టెర్రకోటా, ఉల్లుండ రాతిచెక్కడాలు, దుంగురిపల్లి పడ్డీ క్రాఫ్టులు రాష్ట్రమంతటా గుర్తింపును పొందాయి. ప్రఖ్యాత కవి మహిమా ధర్మా, శాంత్ భిమా భొయి ఈ జిల్లాకు చెందిన వారే. చైత్రమాసంలో ప్రదర్శించే మయపరమైన దండనాట్యం కూడా సుబర్నపూర్‌కు ప్రత్యేకత తీసుకు వస్తుంది. [9] చారిత్రకంగా సుబర్నపూర్ ప్రాంతం పశ్చిమలంక అని గుర్తించబడుతుంది.

ఆలయం పట్టణం, సోనేపూర్

మార్చు
  • పశ్చిమ లంక
  • లంక పోడి
  • శశిసేనా కావ్య
  • శశిసేనా ఆలయం
  • సురేశ్వరి ఆలయం
  • సుబర్నమేరు ఆలయం
  • కోసలేశ్వర ఆలయం
  • లంకేశ్వరి ఆలయం
  • చంపేశ్వర్ ఆలయ
  • మెటకాని ఆలయ

పర్యాటక ఆకర్షణ

మార్చు
  • మహిమా పీట, ఖలియపలి
  • మెటకని ఆలయం, ఉల్లుండ
  • పటలి శ్రీఖేత్ర, కోటాశమలై
  • పాపక్షయ ఘాట్ (బింక)
  • కపిలేశ్వర్ ఆలయం, చర్ద
  • వబగ్రహకుండ
  • డిగ్సిర అంగాడి
  • మహానది, టెల్ సంగం వద్ద రామేశ్వర్ శివాలయం.
  • లార్డ్ స్వప్నేశ్వర్ ఆలయం బిర్మహరాజ్పూర్ బ్లాక్ గౌడ్‌గాడ్.
  • బిర్మహరాజ్పూర్ బ్లాక్ తెంగో ఇరిగేషన్ ప్రాజెక్ట్. (సందర్శకులు పారడైజ్)
  • సొనేపురి సారి

ప్రముఖులు

మార్చు
  • కైలాష్ చంద్ర మెహర్, భారతప్రభుత్వం నుండి ప్రఖ్యాత చరిత్రకారుడిగా " పద్మశ్రీ" అవార్డు గ్రహీత.
  • నిల మాధబ్ పండ, చలనచిత్ర నిర్మాత, " ఐ యాం కలాం " చిత్రానికి దర్శకుడు.
  • సభ్యసాచి మొహపత్రా ( ఒరియా ) చలనచిత్ర నిర్మాత, చిత్రానికి దర్శకుడు.
  • జితమిత్ర ప్రసాద్ సింగ్ దేవ్

విద్యా

మార్చు
  • శ్రీ అరబిందో శిక్ష్యాకేంద్రా గౌడ్‌గాడ్, పొ- అమర్పాలి.

రాజకీయాలు

మార్చు

సుబర్నపూర్ జిల్లా బలంగీర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

అసెంబ్లీ

మార్చు

సుబర్నపూర్ జిల్లాలోని ఒడిషా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల వివరణ .[10][11] ఎన్నికైన సభ్యుల వివరణ [12] క్రింద పట్టికలోఉంది.

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
64 బిర్మజరాజ్పూర్ షెడ్యూల్డ్ కుల్లాలు ఉలుండా, బిర్మహరాజ్పూర్, బింక (ఎన్.ఎ.సి), బింక (ఎన్.ఎ.సి) పద్మనాబ్ బెహరా బి.జె.డి
65 సోనేపూర్. లేదు సోనేపూర్, తరబ, తరబ (ఎన్.ఎ.సి) సోనేపూర్ (ఎం), దుంగురిపలి, బింకా (భాగం) నిరంజన్ పూజారి బి.జె.డి

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Brief History of Sonepur
  2. "Web site of Planning Commission of India" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-10-16.
  3. Some New Facts About Goddess Samlei
  4. Encyclopaedia of tourism resources in India, Volume 2
  5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est.
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741
  9. (Pasayat,1994:413-427;2003)
  10. Assembly Constituencies and their EXtent
  11. Seats of Odisha
  12. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు