సుబాహుడు
రామాయణంలో ఒక రాక్షస పాత్ర
సుబాహుడు, రామాయణంలో ఒక రాక్షస పాత్ర. ఇతడు రాక్షస రాజైన సుందుడు - తాటకి దంపతుల కుమారుడు.
సుబాహుడు | |
---|---|
సమాచారం | |
కుటుంబం | తాటకి (తల్లి), మారీచుడు (సోదరుడు), కైకసి (సోదరి, రావణుడి భార్య) |
కథ
మార్చుసుబాహుడు, మారీచుడు, వారి తల్లి అయిన తాటకి మొదలైన రాక్షసులు అడవులలో తపస్సులు చేసుకుంటున్న మునులను (విశ్వామిత్రుని), వారి యజ్ఞాలను రక్తమాంసపు వర్షాలతో భంగపరచి వేధించేవారు.[1] ఈ రాక్షసుల ఆగడాలను ఆపడానికి విశ్వామిత్రుడు వెళ్ళి, దశరథుడిని సహాయాన్ని కోరాడు. అప్పుడు దశరథుడు తన ఇద్దరు కుమారులైన రాముడు, లక్ష్మణులను విశ్వామిత్రునితో అడవికి పంపించి మునులను, వారి యజ్ఞాలను రక్షించమని ఆజ్ఞాపించాడు.[2] సుబాహుడు, మారీచ రాక్షసులు వచ్చి మళ్ళీ యజ్ఞాలపై మాంసాన్ని, రక్తాన్ని వేయడానికి వచ్చినపుడు శ్రీరాముడు తన బాణంతో సుబాహుని చంపాడు.[3] అది చూసీన మారీచుడు లంకకు పారిపోయి, అక్కడ ఒక ఋషిగా తన జీవితాన్ని కొనసాగించాడు.
మూలాలు
మార్చు- ↑ Gita Jnana Brahmacharini Sharanya Chaitanya (1 July 2018). "Rama Brings Ahalya Back to Her Living Form". The New Indian Express. Retrieved 2022-10-21.
- ↑ Shashtri, Hari Prasad (21 September 2020). "Dasaratha acquiesces [Chapter 21]". Wisdom Library - Valmiki Ramayana - Bala Kanda (in ఇంగ్లీష్). Wisdom Library. Retrieved 2022-10-21.
- ↑ "Subahu - Asura Slain by Rama". Indian Mythology. Archived from the original on 2022-10-21. Retrieved 2022-10-21.