సుబ్బు ఆరుముగం (జననం 1928) ఒక భారతీయ సంగీతకారుడు, రచయిత, విల్లుపట్టు కళాకారుడు.[1][2][3] 2021లో భారతప్రభుత్వం ఇతడికి నాలుగవ ఉన్నత పౌరపురస్కారం పద్మశ్రీ కళలు, సాహిత్యం విభాగంలో యిచ్చి సత్కరించింది.[4][5] ఇతడు విల్లుపట్టు కళారూపానికి సంబంధించి 15 పుస్తకాలను ప్రచురించాడు. వీటిలో వీరపాండ్య కట్టబొమ్మన్, నూలగ విల్లిసై, రామాయణం, విల్లిసై మహాభారతం వంటి రచనలు ఉన్నాయి.[1]

సుబ్బు ఆరుముగం
విల్లుపట్టు కళారూపాన్ని ప్రదర్శిస్తున్న సుబ్బు ఆరుముగం బృందం
జననం1928 (age 95–96)
చిత్తిరం పుదుకులం, తిరునల్వేలి, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిసంగీతకారుడు, రచయిత
పురస్కారాలుపద్మశ్రీ, (2021)
సంగీత నాటక అకాడమీ అవార్డు, కళైమామణి (1975)

ఇతడు జానపద కళారూపమైన విల్లుపట్టుకు సంబంధించిన ఆడియో కేసెట్లు, వీడియోలు అనేకం రూపొందించాడు. ఎన్నో భక్తి గీతాలను రచించాడు. శంకర నేత్రాలయ చెన్నై తరఫున డయాబెటిక్ రెటీనోపతిపై కన్నిలె నల్ల గుణమ్ అనే వీడియోను రూపొంచాడు. అలాగే తమిళనాడు ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన అంశాలతో సత్తం, సత్యం, సముద్యం అనే వీడియోను తయారు చేశాడు.[1] ఇతడు పలు సినిమాలకు హాస్య సన్నివేశాలను, సంభాషణలను, పాటలను వ్రాశాడు.[4]

ఇతడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా చత్తిరం పుదుకులమ్‌ గ్రామంలో జన్మించాడు. ఇతడు ఎ.సుబ్బయ్య పిళ్ళై, ఎన్.కృష్ణ పిళ్ళై, ఎన్.ఎస్.కృష్ణన్‌ల శిష్యరికంలో విల్లుపట్టు కళను అభ్యసించాడు.[1]

ఇతడు 1930వ దశకం నుండి 40 యేళ్లపాటు విల్లుపట్టు కళారూపాన్ని అనేక దేవాలయాలలో, బడులలో, కళాశాలలో, రేడియోలలో, కార్యాలయాలలో ప్రదర్శించాడు.[1]

1974లో తమిళనాడు సాహిత్య సంగీత నాటక ఫోరమ్‌ కళా సాహిత్యరంగాలలో ఇతని కృషికి గుర్తింపుగా కళైమామణి పురస్కారాన్ని ప్రకటించింది. విల్లుపట్టు కళలో ఇతని కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డ్ లభించింది.[1]

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Subbu Arumugam". Sangeetnatak.gov.in. Archived from the original on 2021-01-30. Retrieved 2021-01-31.
  2. "Subbu Arumugam". Chennaiyilthiruvaiyaru.com. Archived from the original on 2021-01-30. Retrieved 2021-01-31.
  3. Chitharth, M (August 19, 2019). "Villupattu exponents Subbu Arumugam, daughter get TN awards". Newstodaynet.
  4. 4.0 4.1 "P Anitha, 'Gearman' Subramanian, Bombay Jayashri among those conferred Padma Shri from TN". The News Minute. January 25, 2021.
  5. "Ten from T.N. chosen for Padma Shri". The Hindu. January 26, 2021.