ప్రకృతి ప్రేమికుడు, పచ్చదనం ప్రేమికుడు, పంటలకు రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండ ఆరోగ్య కరమైన అధిక ఉత్పత్తి సాధించిన ఘనుడు, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్. ఇతడు అభివృద్ధి పరచిన వ్యవసాయ పద్ధతికి పాలేకర్ విధానము.గా ప్రాచుర్యము పొందినది. ఇదే ప్రకృతి వ్యవసాయం.

బాల్యముసవరించు

సుభాష్ పాలేకర్ 1949 మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాకు చెందిన బెలోరా అనే గ్రామంలో జన్మించారు.

విద్యసవరించు

వ్యవసాయం అంటే తనకున్న మక్కువతో వ్యవసాయ రంగంలో పట్టా పొందారు. తండ్రి తోబాటు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు.

కాలేజీ రోజుల్లోసవరించు

వ్వసాయంలో పశుపాలనసవరించు

ఒక్క దేశ వాళీ ఆవుతో సుమారు 30 ఎకరాలలో మిశ్రమ పంటలను పండించ వచ్చని అంటారు వీరు. దేశ వాళీ ఆవు పేడ, మూత్రము పంటలకు ఎంతో ముఖ్యమని అంటారు. ఇతర జంతువుల పేడ, మూత్రము దేశ వాళీ ఆవు పేడ, మూత్రము ఇచ్చినంత ఫలితాన్నివ్వవని ఇతను నమ్ముతాడు.

రచయితగాసవరించు

తన జీవితమంతా ప్రయాణాలు, సదస్సులతోనే ఉపన్యాసాలతోనే గడచిపోతున్నది. ప్రతి ప్రయాణము ఇతనికొక పాటం నేర్పుతుంది. ఆవిధంగా ఇప్పటివరకు పాలేకర్ గారు 50 పైగా పుస్తకాలను వ్రాశారు. ఏక బిగిన పన్నెండు గంటలపాటు ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఎదుర్కొన్న సవాళ్లుసవరించు

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతుల మనసులో నాటుకోవడానికి చాల కస్టపడవలసి వచ్చింది. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయ వచ్చుననే ఇతని విధానాన్ని చూచి చాలమంది అపహాస్యం చేశారు. కొంతమంది ఇతనిని పిచ్చి వాడిగా కూడా జమకట్తారు.

మూలసూత్రంసవరించు

అడవిలోని చెట్లు, ఫల వృక్షాలకు ఎవరు నీరు పోస్తున్నారు, ఎవరు ఎరువులేస్తున్నారు, క్రిమి సంహారక మందులెవరు చల్లుతున్నారు. ఎవరు లేరు. ప్రకృతి ఆ బాధ్యతను తీసుకున్నది. ఇలా సహజ సిద్దంగా పండిన పంటలో రుచికరంగాను, పోషక విలువలు ఎక్కువగాను వుంటాయి. ఈ ఆలోచనే సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్యం అనే ఉద్యమం వైపు తిప్పింది.

ఆహారపు అలవాట్లుసవరించు

సుభాష్ పాలేకర్ ది చాల నిరాడంబర జీవితము. సాదా ఖద్దరు బట్టలను వాడుతారు. ఇతను మితాహారి. శాకాహారి. ప్రకృతి సిద్ధంగా పండిన అన పండ్లు వంటివి మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. సబ్బులు, షాంపూలు వాడరు. టీ, కాఫీ, ఇతర శీతల పానీయాలకు దూరంగా వుంటారు.

సమాజసేవసవరించు

ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు కావలసిని సలహాలనిస్తాడు. ఈ విషయంలో కొంత మంది కలసి ఎక్కడిరమ్మాన్నా వస్తారు. వారిటి తగు సలహాలను, సూచనలను ఇస్తారు. దేశ వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నెలకు ఇరవై రోజులు ప్రయాణలలో, అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్న సదస్సులతోనే సరిపోతుంది. సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం వల్ల రోగాల పాలవుతున్నామని చెప్పారు. రసాయనిక సాగుతో వచ్చిన పంటల్లో కూడా రసాయనిక అవశేషాలు ఉంటాయన్నారు. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమన్నారు.

హైదరాబాద్ లోసవరించు

దేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా హైదరాబాదులో ప్రత్యేక కార్యాలయం ఉంది. ప్రకృతి సేద్యం చేయాలనుకునేవారికి ఒక ఎకరానికి సరిపడా విత్తనాలను ఉచితంగా ఇస్తామంటున్నారు ఈ కార్యాలయం వారు. విద్యావంతులైన ఇతని కుమారులు ఇద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి తమ తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా వుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోసవరించు

పాలేకర్ ప్రకృతిసేద్యం పద్ధతికి ఆకర్షితులైన రైతులు ఆ విధానలో వ్యవసాయం చేస్తున్నారు. అలా వ్యవసాయ దారులుగా మారిన వారిలో, వ్యాపార వేత్తలు, విద్యాధికులు. సాప్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ విధానంలో వ్యవసాయం చేస్తున్న వారు మన రాష్ట్రంలో సుమారు 50,000 మంది ఉన్నట్లు ఒక అంచనా.

మూలాలుసవరించు

https://web.archive.org/web/20140107053015/http://palekarzerobudgetspiritualfarming.org/ ఈనాడు ఆదివారము: 26/5/2013

ప్రాకృతిక వ్యవసాయం