సుమిత్రానందన్ పంత్
సుమిత్రానందన్ పంత్ 1900 మే 20 న ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించారు. ఆయన హిందీ కవులలో ప్రముఖులు. "ఛాయావాది" అనే యుగపు కవులలో ఒకరిగా ఈయన్ని పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాసారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం కలిపి 28 కృతులు రాసారు. ఛాయావాది కవితలే కాకుండా, పంత్ అభ్యుదయవాద, ఆధ్యాత్మిక (ఆరోబిందో ప్రభావంతో), సామాజిక, మానవీయ రచనలు కూడా చేసారు.[1]
సుమిత్రానందన్ పంత్ सुमित्रा नन्दन पंत | |
---|---|
![]() | |
పుట్టిన తేదీ, స్థలం | సుమిత్రానందన్ నందన్ పంత్ 1900 మే 20 కౌసాని గ్రామం, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం |
మరణం | 1977 డిసెంబరు 28 రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | (వయసు 77)
కలం పేరు | Poems = నారీ, భరతమాత గ్రామవాసిని, మాయి సబ్సే ఛోటే హూఁ |
వృత్తి | రచయిత, కవి |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
విద్య | హిందీ సాహిత్యం |
విషయం | సంస్కృతం |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం నెహ్రూ శాంతి పురస్కారం |
పంత్ జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి హిందీ కవి. 1968 లో ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయన వ్రాసిన కవితా సంకలనం "చిదంబర"కు గానూ ఈ పురస్కారం ఇచ్చారు.[2] ఈయనకు అప్పటి సోవియట్ యూనియన్ రష్యా వారు నెహ్రూ శాంతి పురస్కారం ప్రదానం చేసారు. ఇది ఈయన రాసిన లోకాయతన్ అనే రచనకు ఇచ్చారు. "కలా ఔర్ బుద్ధచంద్" అనే రచనకు గానూ సాహిత్య కలా అకాదమీ పురస్కారం పొందారు.భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో ఈయనను సత్కరించింది.
కాసానిలోని పంత్ చిన్ననాటి స్వగృహాన్ని ఒక సంగ్రహాలయంగా మార్చారు. ఈ సంగ్రహాలయంలో ఆయన రోజువారి వాడిన వస్తువులు, ఆయన కవితల చిత్తుప్రతులు, లేఖలు, పురస్కారాలు భద్రపరచి ఉన్నాయి.
ఐఐటీ రూర్కీ వారి సంస్థ గీతాన్ని ఈయన రచించి ఇచ్చారు. ఈ పాట "జయతి జయతి విద్యా సంస్థాన్" అన్న పదాలతో ఉంటుంది. ఈయన 1977 డిసెంబరు 28 న రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్) లో మరణించారు.
మూలాలు మార్చు
- ↑ "ఛాయావాది కవి సుమిత్రానందన్ పంత్".
- ↑ "జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల అధికారిక జాబితా". జ్ఞానపీఠ జాలస్థలి. Archived from the original on 2007-10-13. Retrieved 2015-02-26.