సుమ సుధీంద్ర
సుమ సుధీంద్ర కర్ణాటక శాస్త్రీయ సంగీత వీణావాద్య కళాకారిణి. ఈమె కళాప్రదర్శకురాలు, గురువు, పరిశోధకురాలు, నిర్వాహకురాలు.
సుమ సుధీంద్ర | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | భారతదేశం |
మూలం | కర్ణాటక, భారతదేశం |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | సంగీతజ్ఞురాలు, వైణికురాలు |
వాయిద్యాలు | వీణ |
ప్రారంభ జీవితం, వ్యక్తిగత జీవితం
మార్చుఈమె రాజారావు, చిట్టిబాబుల వద్ద సంగీత శిక్షణ పొందింది.
ఈమె బెంగళూరులో నివసిస్తున్నది. ఈమె భర్త దంతవైద్యుడు. ఈమెకు ఇద్ద్రు కుమార్తెలు ఉన్నారు.[1] ఈమెకు బోన్సాయ్ చెట్ల పెంపకంలో ఆసక్తి ఉంది.[2]
వృత్తి
మార్చుఈమె అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేసియా దేశాలలో విస్తృతంగా పర్యటించి వీణాగాన కచేరీలు నిర్వహించింది. ఈమె అనేక సంగీత గోష్టులను నిర్వహించింది.[3]
తరంగిణి వీణ
మార్చుఈమె సరస్వతి వీణలో మార్పులు చేసి తరంగిణి వీణ అనే వాద్యాన్ని సృష్టించింది.
కర్ణాటక జాజ్ సమ్మేళనం
మార్చుఈమె డచ్ జాజ్ గ్రూపు సినిఫెక్స్‌తో కలిసి అనేక కర్ణాటక జాజ్ సంగీత సమ్మేళనాలను నిర్వహించింది.[4]
ఇతర కార్యక్రమాలు
మార్చుఈమె సెంటర్ ఫర్ ఇండియన్ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నది. ఈ మ్యూజియమ్‌లో ప్రతి ఒక్కరు సంగీతాన్ని సృశించి, అనుభవించవచ్చు.[5]
ఈమె కూచిపూడి నృత్యకళాకారిణి వీణామూర్తి విజయ్‌తో కలిసి ఆర్టిస్ట్స్ ఇంట్రాస్పెక్టివ్ మూవ్‌మెంట్(AIM) అనే సంస్థను స్థాపించింది. దీనిద్వారా 2007 నుండి బెంగళూరు ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్ (BIAF)ను నిర్వహిస్తున్నది.[6]
పురస్కారాలు, సత్కారాలు
మార్చు- స్తి2001లో కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి [7]
- "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"చే కళైమామణి పురస్కారం
- కర్ణాటక గానకళాపరిషత్ వారిచే "గానకళా శ్రీ" బిరుదు.
- త్యాగరాజ గానసభ వారిచే "వైణిక విదుషీమణి" బిరుదు.
- 2017లో సంగీత నాటక అకాడమీ అవార్డు[8]
మూలాలు
మార్చు- ↑ Chandaraju, Aruna (30 May 2009). "Fusion is not just mere confusion". Deccan Herald. Retrieved 17 March 2015.
- ↑ "Small is beautiful". Deccan Herald. 25 January 2013. Retrieved 17 March 2015.
- ↑ Ramkumar, Madhavi (10 October 2013). "Synchronised strings". Bangalore. Retrieved 17 March 2015.
- ↑ Mazumdar, Subhra (4 March 2012). "A different melody altogether". Deccan Herald. Retrieved 17 March 2015.
- ↑ Madhukar, Jayanthi (27 October 2013). "Touch, feel and make music". Bangalore mirror. Retrieved 17 March 2015.
- ↑ "City gears up for arts fest". The Hindu. 19 September 2013. Retrieved 17 March 2015.
- ↑ "Rajyotsava awards for ace barber, IAS topper". Bangalore. The Times of India. 30 Oct 2001. Retrieved 17 March 2015.
- ↑ DHNS, Bengaluru (21 June 2018). "Sangeet Natak Akademi award to 3 from Karnataka". Deccan Herald. Retrieved 28 March 2021.