సురభి పెద్ద బాలశిక్ష
సురభి పెద్ద బాలశిక్ష బుడ్డిగ సుబ్బరాయన్ సంకలనం చేసిన పెద్ద బాలశిక్ష. ఇది సాంస్కృతిక సాక్షరాస్యత ప్రాతిపదికగా రూపకల్పన చేయబడిన బాలవివేక కల్పతరువు. దీనిని ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇండియా వారు 1997 లో మొదటిసారి ప్రచురించారు.
సురభి పెద్ద బాలశిక్ష | |
కృతికర్త: | |
---|---|
సంపాదకులు: | బుడ్డిగ సుబ్బరాయన్ |
ముఖచిత్ర కళాకారుడు: | కె. దయానందం |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పెద్ద బాలశిక్ష |
ప్రచురణ: | ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఇండియా |
విడుదల: | 1997, 1999, 2000 |
పేజీలు: | 400 |
ఈ పుస్తకాన్ని రచయిత తమ నాన్నగారైన శ్రీ బుడ్డిగ వెంకన్న, అమ్మగారైన శ్రీమతి బుడ్డిగ సుబ్బారావు గార్లను స్మరిస్తూ తెలుగు జాతికి సమర్పించారు.
దీనిలోని విషయాలను భాషా పీఠం, సంస్కృతీ సంప్రదాయ పీఠం, బాలసాహిత్య పీఠం, సాహిత్య పీఠం, విజ్ఞాన పీఠం, లోకజ్ఞాన పీఠం అనే ఆరు విభాగాలుగా చేశారు.