సురవరం ప్రతాపరెడ్డి కథలు


సురవరం ప్రతాపరెడ్డి కథలు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకంలోని కథలు సురవరం ప్రతాపరెడ్డి జీవించిన కాలంనాటి చరిత్రకు ఆనవాళ్ళుగా, ఆనాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చారిత్రకకు ప్రతిబింబంగా నిజాంపాలనలో జరిగిన దురంతాలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.[1][2]

సురవరం ప్రతాపరెడ్డి కథలు
సురవరం ప్రతాపరెడ్డి కథలు
కృతికర్త: కథల సంకలనం
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమీ (తృతీయ ముద్రణ)
విడుదల: అక్టోబరు, 2019
పేజీలు: 156
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-8922840-3

కథల నేపథ్యం మార్చు

నిజాం పాలనలో నలిగిన గ్రామీణ ప్రజానీకపు సాంఘిక వాతావరణం, గ్రామ జీవన చైతన్యం, వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, కష్టసుఖాలు, గ్రామ రాజకీయాలు, వాళ్ళ సమస్యలు - వాళ్ళను దోచుకున్న దొరలు, వాళ్ళ కక్ష్యలూ కార్పణ్యాల నేసథ్యంలో ఈ కథలు రాయబడ్డాయి. ఈ కథల్లో ఆ కాంలో తరచుగా వాడబడే ఉర్దూ పదాలు (వాపసు, జమా, ఖజానా, ఖాళీ, నౌకరి, జుమ్మా వంటి ఉర్దూ పదాలైనా, ఏరాలు, మనుం (పెండ్లి), పైకం, ఊర్కనే) వాడబడ్డాయి.[3]

అధికారంలో ఉన్నవారు ప్రజలను పరిపాలించే విధానం, మోసం చేయడం, అలసత్వమూ, లంచగొండితనం, గుడ్డిన్యాయం, ప్రజల అమాయకత్వం, నిస్సహాయతను తన కథల్లో చిత్రించాడు. ప్రజాజీవన విధానాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించబడిన ఈ కథల్లో ఎక్కువ శాతం తెలంగాణ సామాజిక, రాజకీయ, నాటి ప్రభుత్వాంగాల పనితీరును రాశాడు.

ముద్రణల వివరాలు మార్చు

ఈ పుస్తకం తొలిసారిగా 1940లో అణా గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఆ తరువాత 1987లో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి - ఆంధ్ర సార్వస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ద్వితీయ ముద్రణ జరుపుకుంది. 2019 అక్టోబరులో తెలంగాణ సాహిత్య అకాడమీ తృతీయ ముద్రణ చేసింది.[4]

కథలు మార్చు

ప్రతాపరెడ్డి కథలు మార్చు

  1. నిరీక్షణ
  2. హుసేన్ బీ
  3. సంఘాల పంతులు
  4. వకీలు యెంకయ్య
  5. బారిస్టర్ గోపాలకిషన్ రావు
  6. వెంకటరెడ్డి దొర (నాటిక)
  7. మెహ్దీ బేగం
  8. ఖిస్మత్
  9. అపరాధం
  10. వింత విడాకులు

మొగలాయి కథలు మార్చు

  1. గ్యారా కద్దూ బారా కోత్వాల్[5] (19-08-1931)
  2. బేఖూప్ మదారుసాబ్
  3. బంగారు గాడిద
  4. గోమాజీ గణేశ్ పీతల్ దర్వాజా (16-08-1930, గోల్కొండ పత్రిక)
  5. బీబీ జాన్
  6. కిచిడీ జాగీరు
  7. బేతాళు సుల్తానుల భేటీ
  8. రంభ
  9. చస్తామంటే పురుసతు లేదు
  10. ఫకీరు బిడ్డ
  11. రుమాలను బఱ్ఱె తినిపోయింది

మూలాలు మార్చు

  1. కొండపల్లి నీహారిణి (2021-05-29). "సురవరం కథల్లో స్త్రీ పాత్రల ఔచిత్యం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-18. Retrieved 2021-10-18.
  2. సాగి మనోహరి. "తెలంగాణ సమున్నత శిఖరం సురవరం | Telangana Magazine". magazine.telangana.gov.in. Archived from the original on 2021-01-28. Retrieved 2021-10-17.
  3. సురవరం ప్రతాపరెడ్డి కథలు. హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. అక్టోబరు 2019. p. 3. ISBN 9789389228403.
  4. సురవరం ప్రతాపరెడ్డి కథలు. హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. అక్టోబరు 2019. p. 2. ISBN 9789389228403.
  5. "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2021-10-18. Retrieved 2021-10-18.