తెలంగాణ సాహిత్య అకాడమి

(తెలంగాణ సాహిత్య అకాడమీ నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్‌.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి ప్రముఖ కవి, రచయిత డా" నందిని సిధారెడ్డి ని అధ్యక్షుడిగా , డిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా" ఏనుగు నరసింహారెడ్డి ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి.

తెలంగాణ సాహిత్య అకాడమీ
250px
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగతం)
వ్యవస్థాపిత 2017
బహూకరించేవారు తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం
వివరణ తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం

సాహిత్య అకాడమీ.. వెలుగుదీపికసవరించు

-దేశంలోనే అత్యున్నత సాహితీ సంస్థగా రూపుదిద్దుతాం -నవతరానికి దిశానిర్దేశం చేసే వేదికగా తయారుచేస్తాం -ఆకాడమీ ఏర్పాటు కల నెరవేరింది: నందిని సిధారెడ్డి

సాహిత్య అకాడమీ రానున్న మూడేండ్లలో ఒక సాహిత్య అకాడమీ చేయగలిగిన పనులన్నీ చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 34 ఏండ్ల క్రితం కోల్పోయిన సాహిత్య అకాడమీ కీర్తిప్రతిష్ఠలను మరోసారి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. పూర్వకవుల అపురూప గ్రంథాలను ప్రచురించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా వర్తమానతరానికి దిశానిర్దేశం చేసేందుకు, సాహిత్య అకాడమీ వేదికగా ఉంటుందని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర రాష్ర్టాలలోని అకాడమీలను సమన్వయం చేసుకుంటామని, స్థానిక సాహిత్య సంస్థలకే ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రచురణలుసవరించు

  1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ
  2. తెలంగాణ పద్య కవితా వైభవం: తెలంగాణలో శతాబ్దాలుగా వెలుగొందిన పద్య కవిత్వం. (రచన: డా. గండ్ర లక్ష్మణరావు)

ఇవీ చూడండిసవరించు

బయటి లింకులుసవరించు