సురేంద్ర విఠల్ నాయక్ (జననం 1954 అక్టోబరు 20) 1981, 1982 లలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారతీయ క్రికెటర్. దేశీయ ఫస్ట్-క్లాస్ పోటీల్లో బాంబే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టులో అతను ప్రధానంగా కుడిచేతి మీడియం పేస్ లేదా లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసేవాడు. బ్యాటింగులో దిగివ వరుసలో, ఎడమచేతి వాటంతో ఆడేవాడు.[1]

సురు నాయక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సురేంద్ర విఠల్ నాయక్
పుట్టిన తేదీ (1954-10-20) 1954 అక్టోబరు 20 (వయసు 70)
ముంబై
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 158)1982 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1982 జూలై 8 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 38)1981 డిసెంబరు 20 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1982 జూన్ 4 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 4
చేసిన పరుగులు 19 3
బ్యాటింగు సగటు 9.50 3.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 11 3
వేసిన బంతులు 231 222
వికెట్లు 1 1
బౌలింగు సగటు 132.00 161.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/16 1/51
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

క్రీడా జీవితం

మార్చు

సురు నాయక్ ఫస్ట్-క్లాస్ కెరీర్ 1976-77 సీజను నుండి 1988-89 సీజను వరకు కొనసాగింది.

సురు నాయక్ తన కెరీర్ మొత్తంలో కేవలం రెండు టెస్టులు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌ ఆడాడు. అతను ఆడిన టెస్టులన్నీ ఇంగ్లండ్‌తో నే. 1982 జనవరి 24 న మాంచెస్టర్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై తన తొలి టెస్టు ఆడాడు. ఆ తర్వాత, 1982 జూలై 8 న అదే జట్టుతో ఓవల్‌లో చివరి టెస్టు ఆడాడు.

1982 ఇంగ్లండ్ పర్యటనకు నాయక్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. ఈ పర్యటనలో పెద్దగా రాణించలేదు. చాలా మంచి ఫీల్డింగు చేసాడు. రెండు టెస్టుల్లో పాల్గొన్నా పెద్దగా విజయం సాధించలేకపోయాడు. ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డేవిడ్ గోవర్ వికెట్ తీశాడు.

మూలాలు

మార్చు
  1. "All India Cricket test match players, cricketers profile, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-28.