సురేష్ గోపీ

(సురేష్‌ గోపీ నుండి దారిమార్పు చెందింది)

సురేష్‌ గోపీ భారతీయ సినీ నటుడు, టీవీ వ్యాఖ్యాత, గాయకుడు, రాజకీయ నాయకుడు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించాడు. సురేష్ గోపి 1965లో ఓడాయిల్ నిన్ను చిత్రంలో బాల నటుడిగా సినీరంగానికి పరిచయమై 2020 వరకు దాదాపు పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన జాతీయ, రాష్ట్ర అవార్డులను అందుకున్నాడు. 2017 నుండి ఆయన భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] సురేష్‌ గోపీ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[2]

సురేష్ గోపి
మాజీ రాజ్యసభ సభ్యుడు
In office
29 ఏప్రిల్ 2016 – 2019
వ్యక్తిగత వివరాలు
జననం (1958-06-26) 1958 జూన్ 26 (వయసు 66)
అలప్పుజ్హ , కేరళ, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (బీజేపీ)
జీవిత భాగస్వామి
రాధికా నాయర్
(m. 1990)
సంతానం5, నటుడు గోకుల్ సురేష్ తో సహా
బంధువులుఅరన్ముల పొన్నమ్మ - నానమ్మ
నివాసంతిరువనంతపురం, కేరళ
చదువుకేరళ యూనివర్సిటీ
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1965, 1986 – ప్రస్తుతం

సురేష్ గోపి 1958, జూన్ 26 కేరళలోని అలప్పుళలో కె. గోపీనాథన్ పిళ్ళై (సినిమా డిస్ట్రిబ్యూటర్), వి. జ్ఞానలక్ష్మి అమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ముగ్గురు తమ్ములు సుభాష్ గోపి, సునీల్ గోపి, సునీల్ గోపి (చివరి ఇద్దరు కవలలు). ఆయన బాల్యమంతా కొల్లంలో గడిచింది. సురేష్ గోపి పదవ తరగతి వరకు కొల్లంలో పూర్తి చేసి, ఫాతిమామాత నేషనల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

సురేష్ గోపి విద్యార్థి దశలో ఎస్.ఎఫ్.ఐ. విద్యార్థి సంఘంలో పనిచేశాడు. 2006లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ అభ్యర్థి వి.ఎస్. అచ్చుతానందన్ తరపున మలంప్పుళా నియోజకవర్గంలోను, యూడీఎఫ్ అభ్యర్థి ఎంపీ. గంగాధరన్ తరపున పొన్నాని నియోజకవర్గంలోనూ ప్రచారం చేశాడు. 2016 ఏప్రిల్ 29లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2016 అక్టోబరులో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

సురేష్ గోపి 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున త్రిసూర్‌ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు.[4] సురేష్‌ గోపీ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[5]

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. The Indian Express (21 November 2017). "Malayalam actor Suresh Gopi nominated to Rajya Sabha". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  2. Namasthe Telangana (18 March 2021). "నామినేష‌న్ వేసిన సురేశ్ గోపి". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  3. en.msidb.org. "Profile of Malayalam Actor Suresh Gopi". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  4. Deccan Chronicle (24 May 2019). "Suresh Gopi flick fails to click". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.
  5. Namasthe Telangana (2 May 2021). "బీజేపీకి దిమ్మ‌దిరిగే షాక్‌.. కేర‌ళ‌లో ఖాతా తెర‌వ‌ని కాషాయ పార్టీ". Archived from the original on 2 మే 2021. Retrieved 2 May 2021.