సులోచన గాడ్గిల్

సులోచన గాడ్గిల్ భారతదేశానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞురాలు.[1]. ఈమె భారతదేశంలోని బెంగళూరులోగల సెంటర్ ఫర్ అట్మోస్ఫెరిక్ అండ్ ఓషనిక్ సైన్సెస్ (CAOS) లో పనిచేస్తున్నారు. ఋతుపవనాలు ఎందుకు, ఎలా ఏర్పడతాయో అనే విషయాలపై ఈవిడ అధ్యయనం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ విధానాలలో వర్షపాత వైవిధ్యం, పర్యావరణ దృగ్విషయాలను గూర్చి తెలియజేశారు. ఈవిడ చేసిన పరిశోధన వివిధ కాలాలలో ఋతుపవనాలు, మేఘాల బ్యాండ్స్ యొక్క ప్రాథమిక లక్షణాలను అన్వేషించుటకు తోడ్పడింది[2].వర్షపాతం అంటే ఏమిటి, ఎందుకు, వ్యవసాయ విధానాలు, వర్షపాతం వైవిధ్యం, పర్యావరణ రూపకల్పన, పరిణామాత్మక దృశ్యం వంటి విషయాలపై అధ్యయనం చేసారు. ఋతు అంతర్గత వర్షపాత మేఘాల గురించిన పరిశోధనను కూడా చేపట్టారు.

సులోచన గాడ్గిల్
సులోచన గాడ్గిల్
జాతీయతభారతీయులు
రంగములుసముద్ర విజ్ఞానం, వాతావరణ శాస్త్రం
చదువుకున్న సంస్థలుపూనే విశ్వవిద్యాలయం.

ఋతుపవనం అనగా భూమిపై సముద్రపు గాలి కాదని ఈవిడ వివరించింది. కానీ ఋతు ప్రాంతాలలో అలాగే చూడబడిన గ్రహ స్థాయి వ్యవస్థ అని అభివక్తీకరించడం జరిగింది. రైతులతో కలిసి ఆమె భారతదేశం వివిధ ప్రాంతాల వర్షపాతం వైవిధ్యం అనుగుణంగా వివిధ వ్యవసాయ విధానాలను ఆవిష్కరించింది.[3]

బాల్యం - విద్యాభ్యాసం మార్చు

సులోచన పూణెలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకుగల నలుగురు కుమార్తెలలో సులోచన మూడవవారు. ఈమె తండ్రి ఒక వైద్యుడు, తల్లి మరాఠీ రచయిత్రి. సులోచన ప్రాథమిక విద్యను పూణెలో పూర్తిచేసి, తర్వాత ఉన్నత విద్యను పూర్తి చేయుటకు ఋషి వ్యాలీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చేరారు. అనంతరం "ఫెర్గ్యుసన్ కాలేజి"లో చేరారు. ఆతర్వాత ఆమె పూణె విశ్వవిద్యాలయంలో అప్లైడ్ గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేయుటకు వెళ్లారు. తరువాత ఆమె పట్టభద్రురాలయ్యారు. ఆమె భౌతిక సముద్రశాస్త పరిశోధనల నిమిత్తం "హార్వార్డ్ విశ్వవిద్యాలయం" నకు చేరారు. అక్కడ ప్రొఫెసర్ ఎ.ఆర్. రోబిన్సన్ తో కలిసి పరిశోధనలు చేశారు. పి.హెచ్.డి పూర్తిచేసిన తర్వాత ఆమె ఒక సంవత్సరం పాటు "మాస్సాచుసెట్ట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ" (MIT) లో చేరి ప్రొఫెసర్ "జూలే గ్రెగరీ చార్నీ"తో కలసి పోస్ట్ డాక్టరల్ పని పూర్తిచేశారు.

భారతదేశానికి రాక మార్చు

1971 లో ఆమె భారతదేశానికి ఆమె భర్త మాధవ్ తో పాటు వచ్చారు. మాధవ్ కూడా హార్వర్డ్ స్కాలర్. ఈమె ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటెరాలజీలో CSIR పూల్ ఆఫీసరుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ శాస్త్రవేత్తలైన ఆర్.అనంతకృష్ణన్, డి.ఆర్ సిక్కా లతో కలసి పనిచేశారు. ఈమె సెంటర్ ఫర్ థీరిటికల్ స్టడీస్ (CTS) లో సభ్యులుగా నియమింపబడ్డారు. ఈమె భర్త కూడా CTS కు గణిత జీవావరణశాఖలో సభ్యులుగా నియమించబడ్డారు. తర్వాత సెంటర్ ఫర్ అట్మాస్ఫోరిక్ అండ్ ఓషనిక్ సైన్సెస్ (CAOS) అనే కొత్త సంస్థ పుట్టినది. ఇది వాతావరణం, సముద్రాలను అధ్యయించే సంస్థ, [4]

వ్యక్తిగత జీవితం మార్చు

ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మూలాలు మార్చు

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.
  1. "Indian Fellow: Sulochana Gadgil". Indian National Science Academy. Archived from the original on 16 మార్చి 2014. Retrieved 25 November 2012.
  2. "Sikka, D., and S. Gadgil, 1980: On the maximum cloud zone and the ITCZ over Indian longitudes during the Southwest Monsoon." Monthly Weather Review, vol.108, 1840-1853".
  3. "Sulochana Gadgil: Research Interests". IISc. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 November 2012.
  4. Gadgil, Sulochana. "My tryst with the Monsoon" (PDF). Indian Academy of Sciences. Retrieved 25 November 2012.

వెలుపలి లింకులు మార్చు