సుల్తాను ముహమ్మదు మిర్జా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
సుల్తాను మహమూదు మీర్జా (సుమారు 1453 - జనవరి 1495) అబూ సయీదు మీర్జా కుమారుడు ట్రాన్సోక్సియానాకు చెందిన తైమురిదు శాఖ యువరాజు.
సుల్తాను ముహమ్మదు | |||||
---|---|---|---|---|---|
Mirza (royal title) Monarch | |||||
పరిపాలన | 1494–1495 | ||||
పూర్వాధికారి | సుల్తాను అహమ్మదు మిర్జా | ||||
ఉత్తరాధికారి | సుల్తాను బేసంగరు మిర్జా | ||||
జననం | 1453 Samarkand | ||||
మరణం | January 1495 (aged 41–42) Samarkand | ||||
Spouse | ఖజందా బేగం పాషా బేగం ఖంజదా బేగం సుల్తాను నిగరు ఖానుం జురహు బేగీ ఆగా ఇద్దరు పేరు లేని స్త్రీలు | ||||
వంశము | సుల్తాను మసూదు మీర్జా బేసోన్ఘోరు సుల్తాను మీర్జా మీర్జా సుల్తాను అలీ సుల్తాను హుస్సేను మీర్జా సుల్తాను వీసు మీర్జా ఖాన్జాడా బేగం అక్ బేగం ఐ బేగం బేగా బేగం జైనాబు సుల్తాను బేగం మఖ్దుం సుల్తాను బేగం రాజేబు సుల్తాను బేగం మోహెబు సుల్తాను బేగం పేరులేని ఇద్దరు కుమార్తెలు | ||||
| |||||
రాజవంశం | House of Timur | ||||
తండ్రి | Abu Sa'id Mirza |
జీవిత చరిత్ర
మార్చు1459 లో సుల్తాను ముహమ్మదు మిర్జాకు ఆయన తండ్రి హిసారు, టెర్మెజు ప్రభుత్వాధికారాన్ని ఇచ్చాడు. కానీ బాబర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు ప్రధానయుద్ధాలలో సుల్తాను హుస్సేను మీర్జా బేఖారా చేతిలో ఓడిపోయి వాటిని కోల్పోయాడు. మొదటిసారిగా అస్తారాబాదులో ఆయన ఓడిపోయాడు. ఆండిఖుడు సమీపంలో చిక్మాను (సారాయి)లో రెండవ సారి ఓడిపోయాడు. తరువాత 1465 లో హెరాతుకు ఆయన తిరిగి వచ్చాడు. 1466 లో ఆయన తండ్రి వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1468 లో ఆయన తండ్రి అజర్బైజానుకు దండయాత్ర చేసి 1468–1469 ఓడిపోయి ఖైదీగా తీసుకోబడి 1469 ఫిబ్రవరి 5 న ఉరితీయబడ్డాడు.
సుల్తాను మహముదు తన ప్రభుత్వాన్ని కుంబరు హిసారు రాజప్రతినిధి అలీబేగు (హిసారు రాజప్రతినిధి) మద్దతుతో హెరాతుకు వదిలి అబూ సయ్యిదుతో కలిసి ఇరాకుకు తిరిగి వచ్చాడు. తైమురిదు మరొక శాఖకు చెందిన రాకుమారుడు హుస్సేను బేకరాను ఉజ్బెక్ల సహాయంతో సుల్తాను ముహమ్మదు మిర్జాను ఎదుర్కొని 1469 మార్చి 24 న ఈ ప్రాంతాన్ని బేకర సుల్తానేటుగా ప్రకటించాడు. సమర్కాండును పాలించిన సుల్తాను అహ్మదు మీర్జా సుల్తాను అహ్మదు సోదరుడు మహమూదును సుల్తానుగా ప్రకటించాడు. తరువాత హెరాతును తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకుని రాజధాని నుండి బయలుదేరాడు. కాని సమర్కాండు చేరుకున్న తన సోదరుడు మహమూదుతో సంప్రదించిన తరువాత హెరాతును స్వాధీనం చేసుకోవాలని అనుకున్న తన ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు సుల్తాను మీర్జా అహ్మదు సమ్మతితో అమీరు ఖుస్రావు, కంబరు అలీ షా ఆయనను హిసారు పాలించడానికి తీసుకెళ్లారు. తరువాత ఖుక్కా (ఖులుఘా) కు దక్షిణాన ఉన్న భూభాగాలను, హిందూ కోహ్తిను కుషు శ్రేణి పర్వతాలను, టెర్మెజు, కాఘానియను, హిసాను, ఖుత్తలాను, కుండుజు, బదాక్షను భూభాగాల మీద ఆధిపత్యం చేసాడు.
1470 లో హిసారును పాలిస్తున్న సుల్తాను మహమూదు మీర్జా, ఆండిజను (ఫెర్గానా)ను పాలిస్తున్న రెండవ ఉమరు షేకు మీర్జా సమర్కండు మీద దాడి చేయడానికి పొత్తు పెట్టుకున్నారు. కాని ఒక మత నాయకుడి మధ్యవర్తిత్వం ద్వారా వారు శాంతిని నెలకొల్పడానికి అంగీకరించారు. 1471 బాల్ఖు హకీం, అహ్మదు ముష్తాకు (లేదా ముష్తాకు) తిరుగుబాటు చేశాడు. మీర్జా మహమూదు వ్యక్తిగతంగా బల్ఖుకు మద్దతు ఇచ్చాడు. హుస్సేను బేకర బాల్ఖును స్వాధీనం చేసుకుని నాలుగు నెలలకాలం తన ఆధీనంలో ఉంచుకున్నాడు. బేకర బల్ఖును ఎప్పుడు తిరిగి స్వాధినం చేసుకున్నడో స్పష్టంగా తెలియదు.
1479 లో ఆయన తన సోదరుడు మీర్జా అబూబకరును చంపి బడాఖాను, కుండుజు, ఖుత్తలాను కాఘానియన్లను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1494 జూలై మధ్యలో సమర్కాండుకు చెందిన ఆయన సోదరుడు సుల్తాను అహ్మదు మీర్జా మరణించిన తరువాత ఆండిజానుకు, ఫెర్గానా లోయ (1494 జూను 8) చెందిన మరొక సోదరుడు ఉమరు షేకు మీర్జా మరణించాడు. తరువాత మీర్జా మహమూదుకు సమర్కాండును సమర్పించి ఆయనను సుల్తానుగా ప్రకటించారు. అహ్మదు మీర్జా చాలా చిన్నవాడైన కారణంగా ఆయనకు సంతానం లేకపోవచ్చు లేక ఆయన సంతానం అతి పిన్నవయస్కులై ఉండవచ్చు. ముహమ్మదు మిర్జా ఆరు నెలలు పరిపాలించిన తరువాత వ్యాధితో మరణించాడు (1495 జనవరిలో తన 43 సంవత్సరాల వయస్సులో). దాదాపు ఎనిమిది నెలల్లో ముగ్గురు సోదరులు మరణించారు.
రెండుసార్లు కఫీరిస్తాను, బదాఖ్షాను దక్షిణ ప్రాంతాల మీద పవిత్ర యుద్ధం చేసాడు. మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడు బాబరు, మీర్జా మహమ్మదు పిల్లలతో సహా మీర్జాల అధికారాన్ని అమీర్లు ప్రశ్నించడం ప్రారంభించారు.
మరణం తరువాత
మార్చుసుల్తాను ముహమ్మదు మిర్జా 1495 లో మరణించాక ఆయన కుమారుడు మిర్జా బేసూంకరు సమర్ఖండు సింహాసనాన్ని అధిష్ఠించాడు.
కుటుంబం
మార్చుముహమ్మదు మిర్జాకు ఏడుగురు భార్యలు:
- టెర్మెజుకు చెందిన మీరు బుజుర్గు కుమార్తె ఖాన్జాడా బేగం;
- కారా కోయున్లూ అమీరు అహు షేరు బేగు కుమార్తె పాషా బేగం, ముహమ్మదు మీర్జా అక్కోయున్లు భార్యగా వైధవ్యం చెందింది.
- ఖాన్జాడా బేగం:- ఖాన్జాడా బేగం సోదరుడి కుమార్తె, మీరు బుజుర్గు మనవరాలు;
- సుల్తాను నిగరు ఖానుం:- యూనుసు ఖాను కుమార్తె;
- జుహ్రేహు బేగి ఆఘా, ఉజ్బెకు:- మహముదు ప్రధాన ఉంపుడుగత్తె;
- రాజాబు సుల్తాను బేగం తల్లి;
- మోహిబు సుల్తాను బేగం తల్లి;
కుమారులు
మార్చుఆయనకు 5 మంది కుమారులు:
- సుల్తాను మసూదు మీర్జా (ఖాన్జాడా బేగం కుమారుడు)
- బేసున్ఘురు మీర్జా (పాషా బేగం కుమారుడు);
- సుల్తాను అలీ మీర్జా (జుహ్రా బేగి ఆఘా కుమారుడు);
- హుస్సేను మీర్జా (రెండవ ఖాన్జాడా బేగం కుమారుడు పదమూడేళ్ళ వయసులో మరణించాడు);
- సుల్తాను వేసు మీర్జా అని పిలుస్తారు మీర్జా ఖాను (సుల్తాను నిగరు ఖానుం కుమారుడు);
గణాంకాలు
మార్చుఅతనికి 11 మంది కుమార్తెలు:
- ఖాన్జాడా బేగం:- (రెండవ ఖాన్జాడా బేగం కుమార్తె) మొదట మీర్జా అబూబకరు దుగ్లతును వివాహం చేసుకున్నది. రెండవసారి సయ్యదు ముహమ్మదు మీర్జాను వివాహం చేసుకున్నది.
- అక్ బేగం (రెండవ ఖాన్జాడా బేగం కుమార్తె);
- అయీ బేగం:- (రెండవ ఖాన్జాడా బేగం కుమార్తె) బాబరు సోదరుడు జహంగీరు మీర్జాను వివాహం చేసుకున్నది;
- బేగా బేగం:-(రెండవ ఖాన్జాడా బేగం కుమార్తె) సుల్తాను హుస్సేను మీర్జా బేఖారా కుమారుడు హైదరు మీర్జాను వివాహం చేసుకున్నది;
- జైనాబు సుల్తాను బేగం:- (రెండవ ఖాన్జాడా బేగం కుమార్తె) బాబరును వివాహం చేసుకున్నది;
- సుల్తాను ముహమ్మదు మీర్జా:- (పాషా బేగం కుమార్తె) కుమారుడు మనుచిరు మీర్జా కుమారుడు మాలికు ముహమ్మదు మీర్జాను వివాహం చేసుకున్నది;
- మఖ్దుం సుల్తాను బేగం:- (జుహ్రా బేగి ఆఘా కుమార్తె);
- రాజాబు సుల్తాను బేగం:- (ఉంపుడుగత్తె కుమార్తె);
- మోహిబు సుల్తాను బేగం:- (ఉంపుడుగత్తె కుమార్తె);
- పాషా బేగంకు చేత పేరుతెలియని ఇద్దరు కుమార్తెలు;
మూలాలు
మార్చు- History of civilizations of Central Asia, Volum 4, Unesco
- ʻUbayd Allāh ibn Maḥmūd Aḥrār, The letters of Khwāja ʻUbayd Allāh Aḥrār and his associates
- Mirza Muhammad Haidar Dughlt, A History of the Moghuls of Central Asia: The Tarikh-I-Rashidi
సుల్తాను ముహమ్మదు మిర్జా
| ||
అంతకు ముందువారు Sultan Ahmed Mirza |
Timurid Empire (in Samarkand) 1494-1495 |
తరువాత వారు Sultan Baysonqor Mirza |