సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)
సుల్తాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సుల్తాన్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక మండలి నిర్వహిస్తుంది. సుల్తాన్‌పూర్, గంగా నది ప్రధాన ఉపనది అయిన గోమతీ నది కుడి ఒడ్డున ఉంది. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు తూర్పున 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడీ అధికార భాష హింది. దానితో పాటు ప్రజలు అవధి భాషలో కూడా మాట్లాడుతారు. తరువాతి స్థానంలో భోజ్‌పురి ఉంటుంది.
సుల్తాన్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 26°15′54″N 82°04′23″E / 26.264884°N 82.073125°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | సుల్తాన్‌పూర్ |
Elevation | 95 మీ (312 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 1,07,640 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 228001 |
Vehicle registration | UP-44 |
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సుల్తాన్‌పూర్ జనాభా 1,07,640, వీరిలో 56,420 మంది పురుషులు, 51,220 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 11,647. సుల్తాన్‌పూర్లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 84,080, ఇది జనాభాలో 78.1%. పురుషుల్లో అక్షరాస్యత 81.5% కాగా, స్త్రీలలో 74.4%. సుల్తాన్‌పూర్‌లో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 87.6%. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.6% స్త్రీల అక్షరాస్యత 83.2%. షెడ్యూల్డ్ కులాల జనాభా 7,706. 2011 లో పట్టణంలో 17,954 గృహాలు ఉన్నాయి. [1]
భౌగోళికం, వాతావరణం
మార్చుసుల్తాన్పూర్ సముద్ర మట్టం నుండి 95 మీటర్ల ఎత్తున ఉంది. సుల్తాన్‌పూర్ పట్టణం, గోమతి నది వద్ద కొన్ని ప్రాంతాలు మినహాయించి, చాలావరకు చదునుగా ఉంటుంది. దాదాపు మొత్తం పట్టణమంతా గోమతి పరీవాహక ప్రాంతంలో ఉంది. పట్టణపు దక్షిణ భాగం కొంత, ప్రతాప్‌గఢ్ జిల్లా గుండా ప్రవహించే సాయి నది వైపు కలుస్తుంది.
రవాణా
మార్చుసుల్తాన్పూర్ గుండా 4 లేన్ల లక్నో - వారణాసి జాఈయ రహదారి 56, 2 లేన్ల అలహాబాద్ -అయోధ్య రహదారి పోతున్నాయి. ప్రైవేట్ సంస్థలతో పాటు, యుపిఎస్ఆర్టిసి ప్రధానంగా ప్రజా రవాణా సౌకర్యాలను కలుగజేస్తుంది.
సుల్తాన్‌పూర్ రైల్వే స్టేషన్ సుల్తాన్‌పూర్‌ను భారతదేశంలోని ప్రధాన నగరాలతో కలుపుతుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Sultanpur". www.censusindia.gov.in. Retrieved 20 November 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 11 January 2019.