సుషుప్తి నుంచి (కవిత్వ పుస్తకం)


సుషుప్తి నుంచి అనేది 61 కవితల సంకలనం. తపస్వి అనే కలం పేరుతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు, కవి మామిడి హరికృష్ణ రాసిన కవితలతో స్వరాజ్యం పబ్లికేషన్స్ ఈ పుస్తకం ప్రచురించింది.[1] ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నోట్‌బుక్‌లో రాసిన కవితలను అదే దస్తూరితో ప్రచురించడం ఈ పుస్తకం ప్రత్యేకత. తమ అనుభవంనుండి తమదైన భాషలో, అనుభూతిలో, అభివ్యక్తిలో ఆవిష్కరించాలన్న తపన ఈ పుస్తకం నిండా బలంగా కన్పిస్తోంది.

సుషుప్తి నుంచి
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: మామిడి హరికృష్ణ
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కవిత్వం
ప్రచురణ: స్వరాజ్యం పబ్లికేషన్స్, హైదరాబాద్
విడుదల: ఆగస్టు 2020
పేజీలు: 110
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-9354161797

పుస్తకం గురించి మార్చు

1986-89 మధ్య కాలంలో కవిని స్పందింపజేసిన ప్రతి అంశంపై కవిత్వాన్ని రాశాడు. తను నిత్యం చూస్తున్న, తను అనుభవిస్తున్న జీవితంలో జరిగిన ఘటనలను, ప్రవృత్తులనూ చేదుకొని అలా అలా అలవోకగా కవితలు రాసుకున్నాడు. అలా రాసిన వాటిల్లోంచి 61 కవితలను ఎంపిక చేసి ఈ సంకలనం తీసుకువచ్చాడు. ఇందులోని కొన్ని కవితలకు హరికృష్ణ చిత్రాలు గీసాడు.[2] అయితే తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో రాసిన కవితలున్న లేపాక్షి నోట్ పుస్తకాన్ని 2019లో తన తండ్రి వెతికి ఇచ్చాడు. ఆ నోట్‌బుక్ లో రాసిన కవితల్ని అదే దస్తూరితో పుస్తకంగా, నోట్‌బుక్ కవర్ పేజీతో సహా ప్రచురించాడు.[3] ఈ పుస్తకం, కవి తొలినాటి రచనా కాలాన్ని నిర్ధారించింది.

ఒక కవి ప్రస్తానాన్ని, పరిణామ క్రమాన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ ప్రమాణాల ప్రాతి పదికగా బేరీజువేయాలి అనే ప్రశ్నల పరంపరకు నావల్ల నానుండి, నాతో నాకు దొరికిన సమాధానమే ఈ సుషుప్తి నుంచి అని కవి తన ముందుమాటలో రాశాడు. సమాజ సమస్యలపై కరుకుగా రాసిన కవి, ప్రేమ కవిత్వానికి వచ్చేసరికి మృదువుగా కవిత్వాన్ని ఒలికించాడు. మంచీ చెడూ, నీతి న్యాయం, చీకటి వెలుతురుల మధ్య మానసిక సంఘర్షణను ప్రతి కవితలో చిత్రించే ప్రయత్నమూ చేశాడు.

కవితలు మార్చు

  1. జీవిత పాఠం
  2. సాక్షి
  3. కలల శవాలు
  4. నిజం
  5. భావుకుడు
  6. చెరిగిన ముద్ర
  7. భావగీతం-మౌనస్వరం
  8. సర్వం-సకలం
  9. శిథిలాశలు
  10. ప్లాట్ ఫామ్ మీద రైలు
  11. అన్వేషణ
  12. స్పందన
  13. ఏమని రాయమంటావ్?
  14. సేద
  15. తన్మయం
  16. ఆకలినేత్రం
  17. అర్థరాత్రి
  18. సామాన్యుడు
  19. నిశ్శబ్ద సంగీతం
  20. ఆలాపన
  21. సకలకళ
  22. కాలికీ నేలకీ మధ్య
  23. లేట్
  24. నెగళ్ళు
  25. అభిలాష
  26. మనోవల్మీకం
  27. మౌని
  28. ప్రేరణ
  29. నీకళ్ళు
  30. అజేయమైన పద్యం
  31. అవలోకన
  32. నిరీక్షణ
  33. పునరావృతం
  34. పంజరంలో విహంగం
  35. మృత్యుంజయుడు
  36. ఇసుక తుఫాను
  37. తిరోగమనం
  38. హృదయ చిత్రం
  39. పునర్జన్మ
  40. ఆవిష్కరణ
  41. వైరాగ్య రాగం
  42. ఒడ్డుకి అటూ ఇటూ
  43. భాగ్య విధాత
  44. అరూపం
  45. స్ఫరణ
  46. సంతకం
  47. చుక్కలు, చంద్రుడు, భూమి... నేను
  48. గుండె గుడి గంట
  49. విమానం-విస్ఫోటనం
  50. చితిమంట
  51. సుషుప్తి నుంచి చేతనలోకి
  52. రక్తస్పర్శ
  53. సైనిక కవాతు
  54. ద్వేషగీతం
  55. దేవుడు చచ్చిపోతాడు
  56. జాతర
  57. ఇక్కడ నేనొక్కన్నే
  58. దిగంతం
  59. నిన్ను నువ్వు కోల్పోయిన క్షణం
  60. సూర్యుడ్ని రాజేస్తూ వాళ్ళు... చీకట్లను కొనసాగిస్తూ మనం...
  61. మనోచిత్రం

మూలాలు మార్చు

  1. "సుషుప్తి నుంచి - ఒక మెలకువ". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-16.
  2. pratapreddy. "సామాజిక పరిస్థితులపై సామాన్య పరుగు: సుషుప్తి నుంచి". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2020-11-27. Retrieved 2021-12-16.
  3. సుషుప్తి నుంచి జాగృతమైన తపస్వి, బి.నర్సన్, మన తెలంగాణ సంపాదకీయం, 6 డిసెంబరు 2021. పుట 4.