సూర్య వినాయక దేవాలయం
సూర్యవినాయక దేవాలయం నేపాల్‌లోని ఒక హిందూ దేవాలయం.ఇది నేపాల్‌లోని భక్తపూర్ జిల్లాలో ఉంది . ఈ ఆలయం హిందూ దేవుడు గణేశుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఒక చారిత్రక, సాంస్కృతిక స్మారక చిహ్నం, పర్యాటక కేంద్రం. సూర్యవినాయక దేవాలయం ఖాట్మండు లోయలో ఉన్న నాలుగు ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఒకటి.ఈ ఆలయాన్ని ఉదయించే సూర్యుని ఆలయం అని కూడా అంటారు.[1]
సూర్య వినాయక ఆలయం सुर्यविनायक मन्दिर | |
---|---|
భౌగోళికం | |
దేశం | నేపాల్ |
స్థలం | భక్తపూర్ జిల్లా |
ఆలయ స్థానం
మార్చుఈ ఆలయం నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ ఆలయానికి అడవిలో నుండి కాలినడకన మాత్రమే చేరుకోవచ్చు. ఈ ఆలయం సిపాడోల్ లో ఉంది.ఇది ఒక మంచి ప్రదేశం. ఈ ప్రదేశం చాలా పవిత్రమయింది. ఇక్కడి వినాయక స్వామిని పూజిస్తే తమ బాధలు అన్నీతొలగిపోతాయి అని ప్రజల నమ్మకం.[2]
చరిత్ర
మార్చుఈ ఆలయం నిజానికి 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు.ఈ ఆలయం లిచ్ఛవి రాజు ‘విష్ణు దేవ్ బర్మా’ కాలంలో నిర్మించబడింది.[3]
మూలాలు
మార్చు- ↑ "SuryavinayakTemple".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "commons.wikimedia.org/wiki/File:Suryavinayak_Temple.jpg".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Suryavinayak Temple, Nepal · History, Info, Timing and videos 2021". All World Temple (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-11. Retrieved 2021-12-02.
వెలుపలి లింకులు