సూసైడ్ నోట్ లేదా డెత్ నోట్ అనేది ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వదలే ఒక సందేశం. జపనీస్ ఆత్మహత్య నోట్లను పరిశీలించిన ఒక అధ్యయనం ప్రకారం ఆత్మహత్యల యొక్క 25 నుంచి 30 శాతం వరకు సూసైడ్ నోట్ తో బాటు ఉంటాయని అంచనా. ఏదేమైనా, సూసైడ్ నోట్ వ్రాయుట అనేది జాతి, సాంస్కృతిక భేదాలపై ఆధారపడి ఉండవచ్చు, కొన్ని ప్రాంతాల జనాభాలో సూసైడ్ నోట్ వ్రాయుట అనేది 50% అధిక రేటుకు చేరుకోవచ్చు.[1] గెల్డర్, మయు, గెడ్డెస్ (2005) ప్రకారం ఆరుగురిలో ఒకరు సూసైడ్ నోట్ వదులుతారు. ఈ కంటెంట్ క్షమించమనే అభ్యర్ధనగా లేదా జీవితం యొక్క తప్పిదాలకు కుటుంబం, స్నేహితులను నిందించునట్లుగా ఉంటుంది. ఆత్మహత్య సందేశం ఒక వ్రాసిన నోట్, ఒక ఆడియో సందేశం, లేదా ఒక వీడియోగా ఉండవచ్చు.

కారణాలు

మార్చు

సోషియాలజీ, సైకియాట్రీ, గ్రాఫాలజీ వంటి కొన్ని అధ్యయన రంగాలు, ఆత్మహత్యలు చేసుకున్న లేదా ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులు సూసైడ్ నోట్‌ను వ్రాయడానికి గల కారణాలను పరిశోధించాయి.

ఉటా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ లెనోరా ఒల్సేన్ ప్రకారం, ఆత్మహత్య గురించి ఆలోచించే వ్యక్తులు ఆత్మహత్య నోట్ రాయడానికి ఎంచుకునే సాధారణ కారణాలు ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ::[2]

  • అపరాధాన్ని తొలగించడానికి ప్రయత్నించడం ద్వారా బాధితుడికి తెలిసిన వారి బాధను తగ్గించడానికి.

మూలాలు

మార్చు
  1. SHIOIRI, TOSHIKI; NISHIMURA, AKIYOSHI; AKAZAWA, KOHEI; ABE, RYO; NUSHIDA, HIDEYUKI; UENO, YASUHIRO; KOJIKA-MARUYAMA, MAKI; SOMEYA, TOSHIYUKI (April 2005). "Incidence of note-leaving remains constant despite increasing suicide rates". Psychiatry and Clinical Neurosciences. 59 (2): 226–228. doi:10.1111/j.1440-1819.2005.01364.x. PMID 15823174.
  2. Olsen, Lenora (2005). The Use of Suicide Notes as an Aid for Understanding Motive in Completed Suicides (Thesis). University of Utah.