సెకండరీ స్కూల్ సర్టిఫికేట్

సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్‌ఎస్‌సి) ఎగ్జామినేషన్ 10వ తరగతి బోర్డు పరీక్షగా కూడా పిలవబడుతుంది, ఇది 10వ తరగతి విద్యార్థుల కొరకు CBSE, ఇతర రాష్ట్ర బోర్డులు సహా వివిధ విద్యా బోర్డులు నిర్వహించే ఒక పబ్లిక్ పరీక్ష. ఈ ఎస్‌ఎస్‌సి పరీక్షలను భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లోని అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సి ఇంగ్లాండ్ లో జిసిఎస్‌ఈ (GCSE) కు సమానం. ఈ ఎస్‌ఎస్‌సి పరీక్షను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. 2010లో 9,01,417 బాలుర సహా 16,26,342 మంది విద్యార్థులు మహారాష్ట్రలో రాష్ట్ర వ్యాప్తంగా 3,692 కేంద్రాల వద్ద ఈ పరీక్షను రాశారు. 1.3 మిలియన్ల కంటే ఎక్కువగా విద్యార్థులు 2014లో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలో కనిపించారు.

విధానము మార్చు

భారతదేశంలో 10 వ తరగతి పరీక్షలను రాష్ట్ర బోర్డుల ద్వారా రాష్ట్ర స్థాయిలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షలను వార్షికంగా (ప్రతి సంవత్సరం) నిర్వహిస్తారు. 10వ తరగతి పరీక్షల సిలబస్ వివిధ విద్యా బోర్డులకు చెందిన విద్యార్థులకు వేరువేరు సిలబస్‌లుగా ఉండవచ్చు.

షెడ్యూలు మార్చు

10వ తరగతి బోర్డు పరీక్షలను సాధారణంగా భారతదేశంలోని విద్యా బోర్డులు ఎక్కువగా మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహిస్తాయి. పరీక్షల షెడ్యూల్ ను విద్యా బోర్డులు కనీసం ఒక నెల ముందుగానే విడుదల చేస్తాయి. 10వ తరగతి పరీక్షల ఫలితాలను సాధారణంగా మే లేదా జూన్ నెలల్లో ప్రకటిస్తారు. భారతదేశంలోని విద్యా బోర్డులలో కొన్ని విద్యా బోర్డులు, బోర్డు పరీక్షలలో టాప్ 15 విద్యార్థుల జాబితాను మెరిట్ జాబితాగా ప్రకటిస్తాయి.

భారతదేశం మార్చు

భారతదేశంలో దీనిని టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ అని కూడా అంటారు, ఇది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్స్ (CISCE)[1] సహా విద్య యొక్క వివిధ బోర్డులు, 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర బోర్డులు నిర్వహించే ఒక పబ్లిక్ పరీక్ష. CBSE made their class 10 boards non compulsory.[2]

మూలాలు మార్చు

  1. "ICSE examinations".
  2. "CBSE makes class 10 boards optional". Archived from the original on 2017-01-23.

బయటి లంకెలు మార్చు