విద్యార్థి

చదువుకునే వారు

విద్యను ఆర్థించే వ్యక్తిని విద్యార్థి అంటారు. ఆర్థించడం అంటే కోరడం అని అర్థం. విద్యార్థిని విద్యార్థి, శిష్యుడు అని కూడా అంటారు. మగ విద్యార్థిని విద్యార్థుడు అని ఆడ విద్యార్థిని విద్యార్థిని అంటారు. విద్యార్థికి బహువచనం విద్యార్థులు. ఆంగ్లంలో విద్యార్థిని విద్యా స్థాయిని బట్టి ప్యుపిల్, స్టూడెంట్, డిసిప్లీ, స్కాలర్ అని అంటారు. ఆంగ్లంలో పదవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థిని ప్యుపిల్ అని అంటారు. తెలుగులో బాలవిద్యార్థి అంటారు. ఆంగ్లంలో కాలేజి స్థాయి విద్యార్థిని స్టూడెండ్ అంటారు. కాలేజి స్థాయి విద్యను పూర్తి చేసుకొని పరిశోధించే విద్యార్థిని ఆంగ్లంలో స్కాలర్ అని తెలుగులో విద్వాంసుడు అని అంటారు.

చిత్తూరులోని ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు

శిష్యుడు మార్చు

విద్యార్థి, శిష్యుడు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నప్పటికి విడమరచి చెప్పవలసి వచ్చినప్పుడు గురువుకు తెలిసిన విద్యను గురువును అనుసరిస్తూ గురువుకు తెలిసిన విద్యలోనే ప్రావీణ్యం సంపాదించే వ్యక్తిని శిష్యుడు అంటారు. ఉదాహరణకు విలువిద్యలో శిక్షణ పొందుతున్న అభ్యర్థి.

ఇవి కూడా చూడండి మార్చు

విద్య

విద్యాలయాలు - ఉపాధ్యాయులు

తెలుగు విద్యార్థి - తెలుగు భాషలో ప్రచురించబడుతున్న విద్యా సాంస్కృతిక మాస పత్రిక

బయటి లింకులు మార్చు