సెగ
సెగ 2011లో తమిళంలో 'వెప్పం' పేరుతో విడుదలై... తెలుగులో 'సెగ' పేరుతో డబ్బింగ్ చేసిన సినిమా. నాని, నిత్య మీనన్ , బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అంజనా అలీఖాన్ దర్శకత్వం వహించాడు. గౌతమ్ మీనన్ తమిళంలో, అశోక్ వల్లభనేని తెలుగులో నిర్మించిన ద్విభాషా చిత్రం.[2]
సెగ | |
---|---|
దర్శకత్వం | అంజనా |
రచన |
|
స్క్రీన్ ప్లే | అంజనా |
కథ | అంజనా |
నిర్మాత | వల్లభనేని అశోక్ (తెలుగు) |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఓం ప్రకాష్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | జాషువ శ్రీధర్ |
విడుదల తేదీ | 29 జూలై 2011 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹ 25 కోట్లు[1] |
కథ
మార్చుకార్తీక్ (నాని) బాలాజీ (ముత్తుకుమార్) అన్నదమ్ములు. కార్తీక్ పెయింటింగ్లు వేస్తూ బాలాజీని ఇంజనీరింగ్ చదివిస్తాడు. కార్తీక్ అదే కాలనిలో ఉండే రేవతి (నిత్య)ని ప్రేమిస్తాడు. విష్ణు (కార్తీక్) కార్తీక్(నాని)కి స్నేహితుడు. జ్యోతి కంపెనీలో వేశ్యగా ఉండే వాణి ( బింధు మాధవి) పై విష్ణు మనసు పారేసుకుంటాడు. అనుకోని కారణాలవల్ల వాళ్ళు ఒక సమస్యలో చిక్కుకుంటారు. అసలు ఆ సమస్య ఏంటి దానినుండి బయట ఎలా పడ్డారు అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- నాని
- నిత్య మీనన్
- కార్తీక్ కుమార్
- ముత్తుకుమార్
- బిందు మాధవి
- షిమ్మోర్
- జెన్నిఫర్
- మిప్పు
- మునీష్ కాంత్
- మైనా నందిని
సాంకేతిక నిపుణులు
మార్చు- నిర్మాత: వల్లభనేని అశోక్
- కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం: అంజనా అలీఖాన్
- కెమెరా: ఓంప్రకాష్
- సంగీతం: జోష్వా శ్రీధర్
- ఎడిటింగ్: ఆంథోని
పాటలు
మార్చుఈ సినిమాకు జోష్వా శ్రీధర్ సంగీతాన్ని అందించాడు.
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
సం. | పాట | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఒక దేవత" | క్లింటన్ , బెన్నీ | 06:02 |
2. | "వర్షం ముందుగా" | సుజానే, సునీతా | 04:28 |
3. | "మెరుపును" | బెన్నీ దయాల్ | 05:13 |
4. | "పదం విడిచి" | కార్తీక్ | 04:06 |
5. | "రాణి" | అపూర్వ | 03:59 |
మూలాలు
మార్చు- ↑ "Photon Kathaas second film sold profitably". Stock Market Wire. 12 July 2011. Retrieved 1 August 2011.
- ↑ "Metro Plus Visakhapatnam / People : Beyond movies". The Hindu. 25 June 2011. Archived from the original on 10 November 2012. Retrieved 1 August 2011.
- ↑ The Times of India (2016). "Sega Movie Review {2.5/5}: Critic Review of Sega by Times of India". Archived from the original on 2 July 2021. Retrieved 2 July 2021.