నిత్య మేనన్

భారత సినీ నటి, గాయని
(నిత్య మీనన్ నుండి దారిమార్పు చెందింది)

నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. ఈమె మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.

నిత్య మేనన్‌
జననం
నిత్య మేనన్‌

(1988-04-08) 1988 ఏప్రిల్ 8 (వయసు 36)
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

8 సంవత్సరాల వయసులో ద మంకీ హు న్యూ టూమచ్ (1998) అనే ఆంగ్ల చిత్రంలో బాలనటిగా నటించడం మొదలుపెట్టింది. 17 సంవత్సరాల వయసులో 2006 లో ఒక కన్నడ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంతో ప్రధాన పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది.

నేపథ్యం మార్చు

ఈమె 1988, ఏప్రిల్ 8బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించింది. మణిపాల్ విద్యాసంస్థలలో పాత్రికేయ విద్యను అభ్యసించింది. నటిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మంచి పాత్రికేయురాలు కావాలనుకునేది.[2][3] తర్వాతి కాలంలో ఆమెకు మళ్ళీ సినీరంగం మీద ఆసక్తి కలిగి పుణెలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరింది. అక్కడ ఆమెకు బి. వి. నందినీ రెడ్డి పరిచయం అయ్యి, ఆమెను నటనవైపు ప్రోత్సహించింది. తర్వాత ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగులో కథానాయికగా పరిచయం అయింది. ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే కూడా ఆసక్తి.

నట జీవితము మార్చు

అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి.

తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది. అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది.

నటించిన చిత్రాలు మార్చు

తెలుగు మార్చు

ఇతర భాషలు మార్చు

  • 2015 - ఓ కాదల్ కణ్మణి (తమిళం) - తెలుగులో ఓకే బంగారంగా అనువాదమైనది.
  • 2012 పాపిన్స్
  • 2012 ఉస్తాద్ హోటల్ - షహానా \ జనతా హోటల్‌ తెలుగు (2018)
  • 2012 డాక్టర్ ఇన్నొసెంటను - అన్నా
  • 2012 కర్మయోగి
  • 2012 తత్సమయం ఒరు పెంకుట్టి - మంజుల
  • 2011 వెప్పం
  • 2011 180
  • 2011 ఉరుమి - చిరక్కల్ బాల
  • 2011 వయోలిన్
  • 2010 అపూర్వరాగం - నాన్సీ
  • 2009 ఏంజిల్ జాన్
  • 2009 కేరళ కేఫ్
  • 2009 వెల్లతూవల్
  • 2008 ఆకాశ గోపురం

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూలాలు
2020–2022 బ్రీత్: షాడోస్ లోకి అభా సబర్వాల్ హిందీ సీజన్లు 2-3 [4] [5]
2022 మోడరన్ లవ్ హైదరాబాద్ నూరి హుస్సేన్ తెలుగు
2023 కుమారి శ్రీమతి ఇటికలిపూడి కుమారి శ్రీమతి తెలుగు [6]
మాస్టర్ శాంతి రియా కురియన్ మలయాళం [7]

పురస్కారాలు మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Archived from the original on 2011-09-27. Retrieved 2011-09-25.
  2. "'I love to do intelligent films like Kerala Cafe' – Rediff.com Movies". Movies.rediff.com. 2010-03-03. Retrieved 2011-04-07.
  3. "Nithya plays a journalist in next – Times Of India". Articles.timesofindia.indiatimes.com. 2011-04-03. Archived from the original on 2012-05-03. Retrieved 2011-04-07.
  4. "Breathe Into the Shadows review: Inept and illogical, Amazon's strangest show lets Abhishek Bachchan, Amit Sadh down". Hindustan Times (in ఇంగ్లీష్). 10 July 2020. Retrieved 15 September 2021.
  5. "Abhishek Bachchan and Nithya Menen start 'Breathe 3': Shoot for 24-hours at a stretch –Exclusive!". TOI (in ఇంగ్లీష్). 22 Oct 2022. Retrieved 14 September 2022.
  6. NTV Telugu (18 September 2023). "'కుమారి శ్రీమతి'గా నిత్యా మీనన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  7. Malayalam director Sreejith N talks about his web series ‘Master Peace,’ starring Nithya Menen and Sharafudheen The Hindu Retrieved 18 August 2023