సెబాస్టియన్ పాల్

సెబాస్టియన్ పాల్ (జననం 1 మే 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తరువాత ఎర్నాకులం లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

సెబాస్టియన్ పాల్
సెబాస్టియన్ పాల్


పదవీ కాలం
1997 - 1998
ముందు జేవియర్ అరక్కల్
తరువాత జార్జ్ ఈడెన్
నియోజకవర్గం ఎర్నాకులం

పదవీ కాలం
2003 - 2009
ముందు జార్జ్ ఈడెన్
తరువాత కె.వి. థామస్
నియోజకవర్గం ఎర్నాకులం

వ్యక్తిగత వివరాలు

జననం (1947-05-01) 1947 మే 1 (వయసు 77)
ఎర్నాకులం, కేరళ
రాజకీయ పార్టీ స్వతంత్ర
జీవిత భాగస్వామి లిజమ్మ అగస్టిన్
సంతానం 3 కొడుకులు
నివాసం కొచ్చి

సెబాస్టియన్ పాల్ 7 సంవత్సరాలలో (1997-2004) ఆరు ఎన్నికలలో లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసి అందులో నాలుగింటిలో గెలిచి రెండింట్లో ఓడిపోయాడు.[3][4]

రాజకీయ జీవితం

మార్చు

సెబాస్టియన్ పాల్ 1997లో ఎర్నాకులంలో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనీ ఐజాక్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో కాంగ్రెస్ అభ్యర్థి జార్జ్ ఈడెన్‌ చేతిలో 75,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1998లో ఎర్నాకులం నియోజకవర్గంర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జార్జ్ ఈడెన్ రాజీనామా చేయడం వల్ల జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి లెనో జాకబ్‌ను ఓడించి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సెబాస్టియన్ పాల్ 2001 అసెంబ్లీ ఎన్నికల్లో కెవి థామస్ చేతిలో 11,844 ఓట్ల తేడాతో ఓడిపోయూయి ఆ తరువాత సెప్టెంబరు 2003లో జార్జ్ ఈడెన్ మరణం కారణంగా జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో ఎం.ఓ జాన్‌పై 23,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఆ తరువాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని 70,099 ఓట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Dr Sebastian Paul _ Ernakulam MP/More a journalist than a politician". 1 November 2009. Archived from the original on 2009-03-13. Retrieved 17 March 2014.
  2. "Finally, hammer and sickle for Sebastian Paul" (in ఇంగ్లీష్). 7 April 2016. Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  3. English.Mathrubhumi (10 November 2021). "BJP offered me candidature twice, reveals Sebastian Paul" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  4. The Hin du (8 January 2024). "Kerala Governor's policy address in Legislative Assembly not a benevolent act, says former MP Sebastian Paul" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.