ప్రధాన మెనూను తెరువు

సెయింట్ మేరీస్ చర్చిగా పిలువబడే బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ సికిందరాబాదులో నెలకొన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన బసిలికా స్థాయిని పొందింది. ఈ చర్చి సికిందరాబాదు సరోజినీదేవి రోడ్డులో ఉంది. 1850లో ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. మొదట ఈ చర్చిని కాథడ్రల్ ఆఫ్ ఆర్కిడయోసిస్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.[1]

బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్
Basilica of Our Lady of the Assumption, Secunderabad.JPG
ప్రాథమిక సమాచారం
ప్రదేశంసికిందరాబాదు, తెలంగాణ
భౌగోళికాంశాలు17°26′32″N 78°30′08″E / 17.4421°N 78.5022°E / 17.4421; 78.5022Coordinates: 17°26′32″N 78°30′08″E / 17.4421°N 78.5022°E / 17.4421; 78.5022
సంస్థాగత స్థితిబసిలికా
అంతర్జాల సైట్www.stmarysbasilicasecunderabad.org
వాస్తు సంబంధ వివరణ
లక్షణాలు

చరిత్రసవరించు

ఈ చర్చిని బ్రిటిష్ ఆర్మీలోని ఐరిష్ కాథలిక్కుల కోసం ఫాదర్ డేనియల్ మర్ఫీ ప్రారంభించాడు.[2]అతడు 1839లో భారతదేశానికి వచ్చి ఈ చర్చిని 1840లో నిర్మించడం ఆరంభించాడు. ఈ చర్చి నిర్మాణం 1850లో పూర్తి అయింది. మేరీ మాతకు అంకితం చేయబడిన ఈ చర్చి హైదరాబాద్ స్టేట్ లో ఆ సమయంలో అతి పెద్దదిగా పేరుగడించింది.[2] ఇది 1886 వరకు కాథడ్రల్ చర్చిగా ఉన్నది. 1871లో ఇటలీ దేశపు టురిన్ పట్టణం నుండి వచ్చిన క్రైస్తవ సన్యాసినులు ఇక్కడ ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ ఆన్స్ హైస్కూలును ప్రారంభించారు. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన 'బసిలికా' గుర్తింపు పొందింది.

వాస్తు శైలిసవరించు

భారతీయ గోతిక్ వాస్తు శైలికి ఒక ఉదాహరణగా ఈ చర్చి భవనం నిలుస్తుంది. వొంపైన కమానులతో, మొనదీరిన అంటుగోడలతో ఈ చర్చి చూపరులను ఆకర్షిస్తుంది. మిగిలిన కాథలిక్ రోమన్ చర్చిలవలె ఈ చర్చి కూడా అనేక సెయింట్‌ల పేరు మీద దైవపీఠాలు ఉన్నాయి.

గంటలుసవరించు

 
క్రిస్మస్ పండుగ సందర్భంగా అలంకరించబడిన సెయింట్ మేరీస్ చర్చ్

ఈ చర్చిలో 1901లో ఇటలీ దేశం నుండి తెప్పించబడిన నాలుగు గంటలు ఉన్నాయి.[3] వాటిలో ఒక గంటకు పగుళ్లు వచ్చాయి.[3]

ఇవి కూడా చూడండిసవరించు

ప్రార్థనా సమావేశాలుసవరించు

ప్రతి దినము సమావేశం ఇంగ్లీషులో ఉదయం 6.గం. మరియు సాయంత్రం 6. గం. ఆదివారం సమావేశాలు:

  • ఉదయం 6 గం - తమిళం
  • ఉదయం 7 గం - ఇంగ్లీషు
  • ఉదయం 8 గం 15 ని - తెలుగు
  • ఉదయం 9 గం 15 ని - బాలబాలికల సమావేశం
  • ఉదయం 9 గం 30 ని - ఇంగ్లీషు
  • ఉదయం 11 గం 30 ని -ఇంగ్లీషు
  • సాయంత్రం 5 గం - ఇంగ్లీషు
  • సాయంత్రం 6 గం - ఇంగ్లీషు

మూలాలుసవరించు

  1. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. మూలం నుండి 26 March 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 26 March 2019. Cite news requires |newspaper= (help)
  2. 2.0 2.1 https://web.archive.org/web/20110716125405/http://www.st-marys-church-secbad.com/renovation.html. మూలం నుండి 16 July 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 3 April 2014. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help); Missing or empty |title= (help)
  3. 3.0 3.1 "The Hindu : Entertainment Hyderabad / Heritage : Sound of history". Hinduonnet.com. 2005-07-08. Retrieved 2013-11-19. Cite web requires |website= (help)