సెయింట్ లూయిస్ హిందూ దేవాలయం
సెయింట్ లూయిస్ హిందూ దేవాలయం, అమెరికాలోని బాల్విన్, మిస్సౌరీలో ఉన్న హిందూ దేవాలయం. సెయింట్ లూయిస్ ప్రాంతంలో నివసిస్తున్న 14,000 మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.
సెయింట్ లూయిస్ హిందూ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | మిస్సౌరీ |
ప్రదేశం: | బాల్విన్ |
అక్షాంశ రేఖాంశాలు: | 38°36′53″N 90°29′57″W / 38.614725°N 90.499097°W |
చరిత్ర
మార్చు1988లో మిస్సౌరీలో సెయింట్ లూయిస్‌లోని హిందూ దేవాలయ సంస్థ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా అధికారికంగా నమోదు చేయబడింది. 1990 ఏప్రిల్ 21న భూమి పూజతో దేవాలయ శంకుస్థాపన ప్రారంభమైంది. 1991 నవంబరు 8న దేవాలయ నిర్మాణం పూర్తయింది. మొదట్లో దేవుళ్ళ చిత్రపటాలు ఏర్పాటుచేశారు, 1995లో ఆ చిత్రపటాల స్థానంలో దేవతామూర్తలు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి.[1][2] 1991లో మొదటగా మహాత్మాగాంధీ కల్చరల్ సెంటర్ భవనం నిర్మించబడింది. 2000లో, గోపురంపై శిల్పాలను చెక్కడానికి భారతదేశం నుండి అనేకమంది శిల్పులు వెళ్ళారు. 2008లో, సెయింట్ లూయిస్ హిందూ దేవాలయాన్ని విస్తరించేందుకు సమీపంలో $3 మిలియన్లతో గృహ సముదాయాన్ని కొనుగోలు చేసింది.[3] కొత్తగా సేకరించిన భూమి చుట్టూ గోడ నిర్మించడానికి 2012లో, స్థానిక సబ్‌డివిజన్, దేవాలయం ఒక ఒప్పందానికి వచ్చాయి.[4][5]
క్యాంపస్
మార్చుఈ దేవాలయ ప్రాంగణంలో పూజా స్థలం, సాంస్కృతిక కేంద్రం, రిసెప్షన్ ప్రాంతం, ఫలహారశాల, లైబ్రరీ, పార్కింగ్ స్థలం, ఆడిటోరియం మొదలైనవి ఉన్నాయి.
విధ్వంసం
మార్చు2003లో, ఇద్దరు విధ్వంసకారులు మోలోటోవ్ కాక్‌టెయిల్‌లను దేవాలయం ముందు తలుపుల వద్ద విసిరారు, కానీ ఎటువంటి గాయాలు కాలేదు,[6] అనుమానితులను తర్వాత పట్టుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "Hindu Temple of St. Louis". Hindu Temple of St. Louis. Retrieved 25 October 2018.
- ↑ Ahmetovic, Ajla. "Welcome to the Hindu Temple of Saint Louis". Arch City Religion. Retrieved 25 October 2018.[permanent dead link]
- ↑ Bogan, Jesse (21 May 2011). "Hindu Temple of St. Louis Expansion Plan Vex Neighbors". St. Louis Today. Retrieved 25 October 2018.
- ↑ Miner, Doug (21 May 2012). "Hindu Temple and Next Door Neighbors come to an agreement". Retrieved 25 October 2018.
- ↑ "Hindu Temple of St. Louis". St. Louis Churches. Retrieved 25 October 2018.
- ↑ "St.Louis Hindu Temple Twice Vandalized, Suspects Apprehended". Pularlism. Retrieved 25 October 2018.