సెరటోనిన్ మెదడులో ఉత్పత్తి అయ్యే ఒక రసాయనం. ఇది శరీరంలో మానసిక స్థితి, గ్రహణ శక్తి, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి మొదలైన కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉత్పత్తి అవుతుంది. ఇది సరైన స్థాయిలో ఉంటే సంతోషంగా, ప్రశాంతంగా, అంతా బాగున్నట్లు అనిపిస్తుంది. ఇది తక్కువ అవడం వలన మానసిక కుంగుబాటు, ఆరాటం లాంటి భావనలు కలుగుతాయి.

రసాయనికంగా ఇది ఫీనోల్స్ రకానికి చెందిన ఒక అమైనో సమ్మేళనం.[1]

మూలాలు

మార్చు
  1. PubChem. "Serotonin". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్). Retrieved 2024-05-21.