సెర్న్
యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ లేదా సెర్న్ (CERN) అనేక దేశాల ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసిన, ప్రపంచంలో అతిపెద్ద కణభౌతిక శాస్త్ర పరిశోధనశాలను నిర్వహించే సంస్థ. 1954 లో ప్రారంభించబడిన ఈ సంస్థ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులో జెనీవాకి సమీపంలోని మేరిన్ వద్ద ఉంది. ఇందులో 23 సభ్యదేశాలు ఉన్నాయి.[4] 2013 లో సభ్యత్వాన్ని పొందిన ఇజ్రాయిల్ మాత్రమే ఐరోపాకు చెందని సభ్యదేశం.[5][6]
Organisation européenne pour la recherche nucléaire | |
స్థాపన | 29 సెప్టెంబరు 1954[1] |
---|---|
ప్రధాన కార్యాలయాలు | మేరిన్, జెనీవా, స్విట్జర్లాండ్ 46°14′03″N 6°03′10″E / 46.23417°N 6.05278°E |
సభ్యులు | Full members (23): |
అధికారిక భాషలు | ఆంగ్లం, ఫ్రెంచి. |
Council President | ఎలీజర్ రేబినోవికి[2] |
డైరెక్టర్ జనరల్ | ఫాబియోలా గియోనట్టి |
బడ్జెట్ | 1405m CHF[3] |
చరిత్ర
మార్చుపశ్చిమ ఐరోపాకు చెందిన 12 దేశాలతో ఏర్పడిన కూటమి సెర్న్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదన సెప్టెంబరు 29, 1954న ఆమోదం పొందింది.[7] CERN అనేది ఫ్రెంచి భాషలో Conseil Européen pour la Recherche Nucléaire (ఆంగ్లం: యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్) అని అర్థం. 12 ఐరోపా దేశాలతో కూడిన ఈ సంస్థ 1952లో ఏర్పడింది. తొలినాళ్ళలో దీనిని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఆధ్వర్యంలో కోపెన్‌హగన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించేవారు. తర్వాతి కాలంలో దీనిని ప్రస్తుతం ఉన్న జెనీవాకి మార్చారు.
మూలాలు
మార్చు- ↑ James Gillies (2018). CERN and the Higgs Boson: The Global Quest for the Building Blocks of Reality. Icon Books Ltd. ISBN 978-1-78578-393-7.
- ↑ "Prof. Eliezer Rabinovici is the new president of the CERN Council". Jerusalem Post. 25 September 2021. Retrieved 1 November 2021.
- ↑ "Final Budget of the Organization for the sixty-eighth financial year 2022" (PDF). CERN. Archived (PDF) from the original on 2022-10-09. Retrieved 9 September 2022.
- ↑ CERN (2020). "Governance". CERN Annual Report (in ఇంగ్లీష్). 2019. CERN: 50. doi:10.17181/ANNUALREPORT2019.
- ↑ "CERN to admit Israel as first new member state since 1999 – CERN Courier". cerncourier.com. 22 January 2014. Archived from the original on 19 జూన్ 2018. Retrieved 7 ఆగస్టు 2024.
- ↑ "CERN accepts Israel as full member". The Times of Israel (in అమెరికన్ ఇంగ్లీష్). 12 December 2013. Retrieved 10 November 2022.
- ↑ Hermann, Armin; Belloni, Lanfranco; Krige, John (1987). History of CERN. European Organization for Nuclear Research. Amsterdam: North-Holland Physics Pub. ISBN 0-444-87037-7. OCLC 14692480.