సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్
సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (సంక్షిప్తంగా SRF) అనేది పరమహంస యోగానంద 1920లో స్థాపించిన ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ.[1][2][3] 1935 లో ఇది లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థగా రూపుదిద్దుకుంది.[4] ఈ సంస్థ యోగానంద బోధించిన క్రియా యోగంతో పాటు ఆయన రచనలు, బోధనల పరిరక్షణ, ప్రపంచమంతా వ్యాప్తిచేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడింది.[5] యోగానంద రాసిన భగవద్గీత పుస్తకంలో (God Talks With Arjuna: The Bhagavad Gita) క్రియా యోగం అనే సైన్సు[6] అసలైన ఆడమ్ (బైబిల్ ప్రకారం మొదటి మానవుడు) అయిన మనువుకు, ఆయన ద్వారా జనక మహారాజుకు, ఇంకా ఇతర రాజర్షులకు ఇవ్వబడింది.[7]
మూలాలు
మార్చు- ↑ yogananda.org "About Self-Realization Fellowship".
- ↑ Melton, J. Gordon, Martin Baumann (2010). Religions of the World: A Comprehensive Encyclopedia of Beliefs and Practices. ABC-CLIO. ISBN 9781598842043.
- ↑ nytimes.com "When Being a Yogi Had an Exotic Air". Retrieved 2017-07-07.
- ↑ en.wikisource.org: Articles of Incorporation
- ↑ Bowker, John (2000). The concise Oxford dictionary of world religions / Self-Realization Fellowship. Oxford Univ. Press. p. 524. ISBN 0-19-280094-9.
- ↑ Which is explained in his book, Yogananda, Paramahansa (2009). "Chapter 26: The Science of Kriya Yoga". Autobiography of a Yogi. Self-Realization Fellowship. p. 272.
- ↑ Paramahansa Yogananda (1995). God Talks with Arjuna: The Bhagavad Gita (Chapter V), First Edition. Self-Realization Fellowship (Founded by Yogananda). ISBN 0-87612-030-3.