సెల్ ఫోన్ రేడియో ధార్మికశక్తి

అత్యంత ఆధునిక మైన సాంకేతిక పరికరం సెల్ ఫోన్. ఇది అత్యంత ప్రచారం పొంది వివిధ రూపాంతరాలను సంత రించుకొని ఆబాల గోపాలాన్ని, అన్ని వర్గాల ప్రజలకు ఆతి చేరువైన ఈ పరికరము వలన చాల లాభాలున్నాయి. దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు దీని వాడుతున్నారు. సెల్ ఫోన్ వలన గాని, సెల్ ఫో టవర్ల వలన గాని కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తు తున్నాయి. వాటి నివారణ మార్గాలు తెలుపడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశము.

రేడియేషన్ ఛార్టు

సెల్ ఫోన్ రేడియో ధార్మికశక్తి (రేడియేషన్) సోకడం తగ్గించుకోవడానికి చిట్కాలు మార్చు

సెల్ ఫోన్ ద్వారా మన మాటలు ఇతరులకు వినిపించాలన్నా, మన సందేశాలు ఇతరులకు చేరాలన్నా, ఆ సెల్ ఫోను రేడియో ధార్మిక శక్తిని (రేడియేషన్ ను) విడుదలచేయవలసి వుంటుంది. ఈ రేడియేషన్ వల్ల తలెత్తే ఆరోగ్యసమస్యల గురించి నిర్ధారణ కానప్పటికి, తరచుగా సెల్‌ఫోన్‌ను వినియోగించేవారికి మెదడులోను, నోటిలోను కణుతులు ఏర్పడే అవకాశం, పిల్లలలో నడవడికకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని కొన్ని పరిశోధనలు (అన్నీ కావు) సూచిస్తున్నాయి. ప్రమాదానికి లోనుకాకుండా సురక్షితంగా వుండడంకోసం ఈ కింద పేర్కొంటున్న కొన్ని చిట్కాలను పాటించండి.

1. తక్కువ రేడియేషన్ ప్రభావం ఉండే ఫోన్లనే కొనండి కొనుగోలుదారులకు మార్గదర్శకాలను సూచించే ఇ.డబ్ల్యు.జీ. అనే చిరుపుస్తకంలో మీరు ఆశించే ఫోన్ కోసం చూడండి. (మీరు ఉపయోగించే బ్యాటరీ క్రిందిభాగంలో మీ ఫోన్ నమూనా (మోడల్) నెంబరు ముద్రించి ఉండవచ్చు). వీలైనంత, అతి తక్కువ రేడియేషన్ విడుదల చేస్తూ, మీ అవసరాలను తీర్చ గలిగే దానితో మీ ఫోన్ ను మార్చుకోవడాన్ని పరిశీలించండి.

2. హెడ్ సెట్ ను లేదా స్పీకర్ ను ఉపయోగించండి ఫోన్ల కంటే హెడ్ సెట్ లు అతి తక్కువ రేడియేషన్ ను విడుదల చేస్తాయి. సెల్ ఫోన్ హెడ్ సెట్ కు సంబంధించిన మార్గదర్శకాలను గమనించి, వైర్ తో ఉండే, లేదా వైర్‌లెస్ రకం హెడ్ సెట్ ను ఎంచుకోండి (ఎటువంటి రకం క్షేమకర మైనది అన్న విషయంపై నిపుణులు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు). కొన్ని వైర్ లెస్ హెడ్ సెట్ లు తక్కువ స్ధాయి రేడియేషన్ ను తెంపులేకుండా విడుదల చేస్తూనే ఉంటాయి అందుచేత, మీరు ఫోన్ మాట్లాడనపుడు హెడ్‌సెట్ ను చెవిదగ్గరనుంచి తీసివేయండి. స్పీకర్‌ను ఉపయోగించి ఫోన్ మాట్లాడడంకూడా మీ తల రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

3. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు, సందేశాలను పంపేటప్పుడు కూడా మీ ఫోన్ రేడియేషన్ ను విడుదల చేస్తూ ఉంటుంది కానీ, మీరు సందేశాలను అందుకునేటప్పుడు మాత్రం కాదు. అందుచేత ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం అన్నది మీరు రేడియేషన్ కు గురికావడాన్ని తగ్గిస్తుంది.

4. ఫోన్ ను మీ శరీరానికి దూరంగా వుంచండి మీరు మాట్లాడేటప్పుడు (హెడ్ సెట్ తో గాని లేక స్పీకర్ తో గాని) ఫోన్ ను మీ శరీరానికి, అంటే ఛాతిభాగానికి, మొండేనికి దూరంగా వుంచండి, చెవివద్ద వుంచుకోవద్దు జేబులో పెట్టుకున్నా, లేదా బెల్టుకు తగిలించుకున్నా, మీ శరీరంలోని మృదువైన కణాలు రేడియేషన్‌ను తమలో ఇముడ్చుకోగలుగుతాయి.

5. మాట్లాడటం కంటే, సందేశాలను పంపడాన్నే ఎంచుకోండి మౌఖికంగా కంటే, లిఖితపూర్వకంగా సందేశాలను పంపడానికి ఫోన్లు తక్కువ శక్తిని వినియోగిస్తాయి (అంటే తక్కువ రేడియేషన్). మీ చెవిదగ్గర ఫోన్ ను పెట్టుకుని మాట్లాడటం కన్నా లిఖిత పూర్వకమైన సందేశాలను పంపడం మీ తలను రేడియేషన్ కు దూరంగా ఉంచుతుంది.

6. సంకేతాలు (సిగ్నల్సు) బలహీనంగా ఉన్నాయా? అయితే ఫోన్ ను దూరంగా పెట్టేయండి మీ ఫోన్ మీద తక్కువ గీతలతో సంకేతాలు కనిపిస్తున్నట్లయితే, సంకేతాలనందుకునే స్ధంబానికి (సిగ్నల్ టవర్) మీ సంకేతాన్ని చేరవేయడానికి అది ఎక్కువ స్ధాయిలో రేడియేషన్ విడుదల చేయడం జరుగుతోందన్న మాట. మీ ఫోన్‌లో సంకేతాలు బలంగా వున్నప్పుడే ఫోన్ చేయండి, లేదా అందుకోండి.

7. పిల్లల ఫోన్ వాడకాన్ని పరిమితం చేయండి పెద్దలకంటె, చిన్న పిల్లల మెదళ్ళు రెండింతలు రేడియేషన్‌కు గురవుతాయి. అత్యవసరమైన పరిస్థితిలో తప్ప పిల్లల ఫోన్ వినియోగాన్ని పరిమితంచేయాలని కనీసం 6 దేశాలలోని నిపుణులు చేసిన సిఫార్సులతో ఇ.డబ్ల్యు.జీ ఏకీభవిస్తున్నది.

8. ‘రేడియేషన్ కవచాన్ని (షీల్డ్)‘ తీసివేయండి యాంటెనా క్యాప్స్, కీ ప్యాడ్ కవర్స్ వంటివి సెల్ ఫోన్ అనుసంధానత (కనెక్టివిటి) నాణ్యతను తగ్గించివేస్తాయి. అందువల్ల అలాంటి ఫోన్లు మరింత శక్తితో, మరింత రేడియేషన్‌తో పనిచేయవలసి వస్తుంది.