సెహరి 2022లో విడుదలైన తెలుగు సినిమా. వర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించాడు. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలైంది.[1]సెహ‌రి సినిమా ఆహా ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 25 నుండి స్ట్రీమింగ్ కానుంది.[2]

సెహరి
సెహరి 2022.jpg
దర్శకత్వంజ్ఞానసాగర్‌ ద్వారకా
రచనహర్ష్‌ కనుమిల్లి
నిర్మాతఅద్వయ జిష్ణు రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంఅరవింద్ విశ్వనాథన్
కూర్పురవి తేజ గిరజాల
సంగీతంప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాణ
సంస్థ
వర్గో పిక్చర్స్‌
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 11 (2022-02-11)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

వరుణ్(హర్ష్) ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యి బాధలో ఉంటాడు. ఇక ప్రేమ లాంటివి వద్దని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని పెద్దలు కుదిర్చిన అమ్మాయి ఆలియాతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతాడు. అప్పుడే తన జీవితంలోకి అమూల్య (సిమ్రాన్) వస్తుంది. తనతో ప్రేమలో పడతాడు. తీరా చూస్తే తానే పెళ్లికూతురు అక్క అని తెలుస్తుంది. తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: వర్గో పిక్చర్స్‌
 • నిర్మాత: అద్వయ జిష్ణు రెడ్డి
 • కథ: హర్ష్‌ కనుమిల్లి
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారకా
 • సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
 • సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
 • ఎడిటర్: రవి తేజ గిరజాల

మూలాలుసవరించు

 1. Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
 2. Namasthe Telangana (19 February 2022). "ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న సెహ‌రి.. విడుద‌ల ఎప్పుడంటే?". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
 3. TV5 News (11 February 2022). "'సెహరి' మూవీ రివ్యూ.. బోర్ కొట్టని ఫ్యామిలీ డ్రామా." (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
 4. Eenadu (11 February 2022). "పెళ్లికూతురు అక్కని ప్రేమిస్తే..." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
 5. Andhra Jyothy (21 February 2022). "మా వాడు ఎలాగైనా సాధిస్తాడు!". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సెహరి&oldid=3703610" నుండి వెలికితీశారు