అభినవ్ గోమఠం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా నటుడు. 2014లో వచ్చిన మైనే ప్యార్ కియా చిత్రంతో సినిమారంగంలోకి అడుగుపెట్టిన అభినవ్, 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.[1]

అభినవ్ గోమఠం
జననం
అభినవ్ గోమఠం

జాతీయతభారతీయుడు
విద్యబి.టెక్
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

జీవిత విశేషాలు సవరించు

హైదరాబాదులో జన్మించిన అభినవ్, గుజరాత్ లో పెరిగాడు. అభినవ్ తండ్రి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి. అందువల్ల అభినవ్ విద్యాభ్యాసం వివిధ ప్రాంతాలలో జరిగింది. బి.టెక్ చదువుతున్న సమయంలో కాలేజీలోనే నటనలో శిక్షణ పొందాడు. ఇంజినీరింగ్‌ తరువాత కొంతకాలం డెల్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి, సినిమాలకోసం ఉద్యోగాన్ని వదిలేశాడు.[2][3]

సినిమారంగం సవరించు

నటనపై ఉన్న ఆసక్తితో ఉదాన్ థియేటర్, అహం థియేటర్ వంటి నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాల్లో నటించాడు.[4] అటుతరువాత కొన్ని లఘుచిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించాడు.

నటించిన చిత్రాలు సవరించు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2012 ఆర్టిఫీసియల్ మానవ్ షార్ట్ ఫిల్మ్
2014 మైనే ప్యార్ కియా
బిల్లా రంగ
2015 జగన్నాటకం బంటి
2017 మళ్ళీరావా డంబో
2018 ఈ నగరానికి ఏమైంది కౌశిక్
2019 జెస్సీ
ఫలక్‌నుమా దాస్ మానసిక వైద్యుడు అతిధి పాత్ర
సీత చక్రం [5] [6]
మీకు మాత్రమే చెప్తా కామేష్ [7]
2021 రంగ్ దే అభి
ఇచ్చట వాహనములు నిలుపరాదు మీనూ బావ
శ్యామ్ సింగరాయ్ ప్రమోద్
2022 సెహరి వాసు
2023 విరూపాక్ష సూర్య స్నేహితుడు
గూఢచారి రా ఏజెంట్ కమల్
గాందీవధారి అర్జునుడు అర్జున్ స్నేహితుడు
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రాహుల్

వెబ్‌సిరీస్ సవరించు

మూలాలు సవరించు

  1. ఆంధ్రభూమి, చిత్రభూమి (28 October 2019). "అందరికీ.. అదే చెప్తున్నాం". andhrabhoomi.net. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  2. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (29 October 2019). "నటుణ్ణి అవుదామనుకోలేదు!". www.ntnews.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  3. ఈనాడు, టాలీవుడ్ (సినిమా). "అందుకే ఉద్యోగం మానేశాను". www.eenadu.net. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  4. ప్రజాశక్తి (28 October 2019). "ఇది విజయ్ చేయాల్సింది కానీ." www.prajasakti.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  5. "Teja's Sita trailer is out". Archived from the original on 11 May 2019. Retrieved 28 December 2020.
  6. "Teja's film with Kajal Aggarwal titled as 'Sita', first look tomorrow". The Times of India. 25 January 2019.
  7. "Meeku Maathrame Cheptha". Times of India (in ఇంగ్లీష్). 23 September 2019. Retrieved 16 October 2019.