సైనసైటిస్
ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు. అత్యధికంగా శస్త్రచికిత్సకి దారితీసే రోగాలలో సైనసైటిస్ ఒకటిగా ఒక అధ్యయనంలో వెల్లడైంది.
సైనసైటిస్ | |
---|---|
Specialty | Otolaryngology ![]() |
నేపధ్యముసవరించు
ప్రతి మనిషి తన జీవితకాలంలో సైనసైటిస్ బారిన పడనివారు ఉండరు.అలా కాకపోయినా కనీసం 90శాతం పైన దాని బారిన పడతారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వస్తుంది. వైరస్, బాక్టీరియా, ముఖ్యంగా స్టైప్టోకోకస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నయం చేయడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు. సైనసైటిస్ వస్తే ఇక ఆపరేషన్ తప్పదని, ఆ తర్వాత కూడా ఇది మళ్లీ మళ్లీ వచ్చి దీర్ఘకాలికంగా బాధిస్తుంటుందని దీని బారిన పడిన వారు అంటుంటారు.
సైనసైటిస్ వర్గీకరణసవరించు
ఇందులో మూడు విభాగాలుగా వర్గీకరించారు.
- అక్యూట్: ఒక వారం రోజులు ఉంటుంది.
- సబ్ అక్యూట్ : 4-8 వారాలు ఉంటుంది.
- క్రానిక్ : దీర్ఘకాలిక సైనసైటిస్ ఇది 8-10 వారాలపైన ఉంటుంది.
సైనస్‌లలో రకాలుసవరించు
- ఫ్రంటల్
- పారానాసల్
- ఎత్మాయిడల్
- మాగ్జిలరీ
- స్ఫినాయిడల్,ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి.
ప్రధాన కారణాలుసవరించు
- ఇన్‌ఫెక్షన్స్ (బాక్టీరియా, వైరస్, ఫంగస్)
- ఊపిరితిత్తులు, శ్వాస కోశ వ్యాధులు
- ముక్కులో దుర్వాసన
- ముక్కులో దుర్వాసన పెరుగుదల
- అలర్జి
- పొగ
- విషవాయువుల వల్ల కాలుష్యం
- వాతావరణ కాలుష్యం
- ఆకస్మాత్తుగా వాతావరణ మార్పులు
- చలికాలం, వర్షాకాలం
- గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం.
- మంచు ప్రదేశాలలోని నీటిలో ఈదడం వల్ల
- జలుబు, గొంతునొప్పి పిప్పిపన్ను టాన్సిల్స్ వాపు రోగనిరోధక శక్తి తగ్గడం
వ్యాధి లక్షణాలుసవరించు
- ముఖంలో భారంగా ఉండటం, తలనొప్పి, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారుట, గొంతులోనికి ద్రవం కారడం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము, కోపం, మానసిక స్థైర్యం కోల్పోవడం, అలసట, విసుగు, పనిపై శ్రద్ధ లేకపోవడం, హోరు దగ్గు.
వ్యాధి నిర్ధారణసవరించు
- ఎక్స్‌రే ముఖ్యంగా ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్ రావచ్చును
- సైనస్ భాగంలో నొక్కితే నొప్పి
- సీటీ స్కాన్
ఇతర దుష్పలితాలుసవరించు
దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడేవారు కళ్ళ రెప్పల వాపు, కనుగుడ్లు ప్రక్కకు జరిగినట్లుండటం, కన్ను నరం దెబ్బతిన్నప్పుడు చూపు కోల్పోవడం, వాసనలు తెలియకపోవడం, తరచు వచ్చే జ్వరం, ఎదుగుదలలో లోపాలు రావచ్చును. మానసికంగా ధైర్యం కోల్పోవడం జరగవచ్చు.
సైనసైటిస్‌ను ఎలా గుర్తించవచ్చును?సవరించు
ఎవరైనా పది రోజుల కంటే ఎక్కువగా ఈ కింది వాటిలో దేనితోనైనా బాధపడుతున్నట్లయితే దానిని సైనుసైటిసా అనుమానించి వెంటనే వైద్యుడిని సంప్రదించవలెను.
- ముఖభాగంలో నొప్పి
- తలనొప్పి
- ముక్కుదిబ్బడ
- చిక్కటి పసుపు, ఆకుపచ్చ స్రావాలు
- జ్వరం (99-100 డిగ్రీలు)
- నోటి దుర్వాసన
- పంటినొప్పి
నివారణసవరించు
- నోటిని తరచు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండడం.
- అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంటి చుట్టూ నీరూ, బురదా లేకుండా ఉండాలి.
- ఈత కొలనులో ఎక్కువ సమయం కేటాయించ వద్దు. ఎందుకంటే అది ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీయవచ్చు.
- ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండటం, చల్లని గాలితో తగలకుండా చెవిలో దూది పెట్టుకోవటం, వేడి ఆవిరి పట్టడం వల్ల కొంత వరకు సైనసైటిస్‌ను నివారించవచ్చు.
హోమియో చికిత్ససవరించు
హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా సమూలంగా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా నయం చేయవచ్చు.హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కాలిబైక్, కాలిసల్ఫ్, హెపార్ సల్ఫ్, మెర్క్ సాల్, సాంగ్‌న్యూరియా, లెమినా మైనర్, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి.
A computed tomograph showing infection of the ethmoid sinus
Maxillary sinusitis caused by a dental infection associated with periorbital cellulitis