విజ్ఞానశాస్త్రం

(సైన్సు నుండి దారిమార్పు చెందింది)

విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. గణిత శాస్త్రం లాంటివి సాంప్రదాయ శాస్త్రాల క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు.[1] విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.[2]

విశ్వం నమూనా

మధ్యయుగంలో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన అల్ హజెన్ అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు.[3][4][5] ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం[6] మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు.[7] ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని తత్వ శాస్త్రం ప్రకారం నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని విభజిస్తే మధ్యయుగపు మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా పదార్థాలను వివధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు.[8]

17, 18 వ శతాబ్దాలలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరంగా తాము కనుగొన్న సత్యాలను కొన్ని ప్రకృతి నియమాల రూపంలోకి సూత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కాలాన్ని వైజ్ఞానిక విప్లవం అని వ్యవహరిస్తారు. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు రూపుదిద్దుకున్నాయి.[9][10]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Editorial Staff (March 7, 2008). "The Branches of Science". South Carolina State University. Retrieved October 28, 2014.
  2. Editorial Staff (March 7, 2008). "Scientific Method: Relationships among Scientific Paradigms". Seed magazine. Archived from the original on 2007-09-29. Retrieved September 12, 2007.
  3. Haq, Syed (2009). "Science in Islam". Oxford Dictionary of the Middle Ages. ISSN 1703-7603. Retrieved 2014-10-22.
  4. G. J. Toomer. Review on JSTOR, Toomer's 1964 review of Matthias Schramm (1963) Ibn Al-Haythams Weg Zur Physik Toomer p.464: "Schramm sums up [Ibn Al-Haytham's] achievement in the development of scientific method."
  5. "International Year of Light - Ibn Al-Haytham and the Legacy of Arabic Optics". Archived from the original on 2014-10-01. Retrieved 2016-09-02.
  6. http://www.journalijdr.com/significant-contribution-chemistry-ancient-indian-science-and-technology
  7. Lindberg 2007, p. 3.
  8. Science and Islam, Jim Al-Khalili. BBC, 2009
  9. Cahan, David, ed. (2003). From Natural Philosophy to the Sciences: Writing the History of Nineteenth-Century Science. Chicago: University of Chicago Press. ISBN 0-226-08928-2.
  10. The Oxford English Dictionary dates the origin of the word "scientist" to 1834.